ETV Bharat / sports

హై స్కోరింగ్ మ్యాచ్​లో దిల్లీ థ్రిల్లింగ్ విన్- స్మృతి పోరాటం వృథా

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 10:58 PM IST

RCB vs DC WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్​ గురువారం జరిగిన ఆర్​సీబీ- దిల్లీ మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ మజానిచ్చింది. థ్రిల్లింగ్​గా సాగిన ఈ హై స్కోరింగ్ మ్యాచ్​లో దిల్లీ 25 పరుగుల తేడాతో నెగ్గింది.

RCB vs DC WPL 2024
RCB vs DC WPL 2024

RCB vs DC WPL 2024: 2024 డబ్ల్యూపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరుకు బ్రేక్ పడింది. గురువారం ఆర్​సీబీతో జరిగిన మ్యాచ్​లో దిల్లీ 25 పరుగుల తేడాతో నెగ్గింది. 195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆర్​సీబీ 169-9 స్కోర్​కు పరిమితమైంది. కెప్టెన్ స్మృతి మంధాన (74 పరుగులు) భారీ ఇన్నింగ్స్​తో ఆకట్టుకుంది. సబ్బినేని మేఘన (36), సోఫీ (23) మాత్రమే రాణించారు. దిల్లీ బౌలర్లలో జెస్ జొనాసెన్ 3, మరిజానే కాప్ 2, అరుంధతి రెడ్డి 2, శిఖ పాండే​ 1 వికెట్ దక్కించుకున్నారు.

భారీ లక్ష్య ఛేదనను ఆర్​సీబీ ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ స్మృతి ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడుతూ దిల్లీ బౌలర్లను బెంబేలెత్తించింది. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డ స్మృతి స్కోర్ బోర్డును పరులుగు పెట్టించింది. ఇక 8.3వ ఓవర్​ వద్ద దిల్లి తొలి వికెట్ దక్కించుకుంది. ఓపెనర్ సోఫీ డివైన్​ (23 పరుగులు) క్యాచౌట్​గా పెవిలియన్ చేరింది.

సోఫీ ఔటైనా, స్మృతి ఎక్కడా తగ్గలేదు. జోరుగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. అర్ధ శతకం పూర్తైన తర్వాత కూడా స్మృతి జోరు కొనసాగింది. అయితే 74 వ్యక్తిగత పరుగుల వద్ద స్మృతి క్లీన్​ బౌల్డ్​గా వెనుదిరిగింది. దీంతో వికెట్ల పతనం ప్రారంభమైంది. దిల్లీ పట్టు బిగించడం వల్ల ఆర్​సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. ఓపెనర్ కెప్టెన్ లానింగ్ (11 పరుగులు) నిరాశ పర్చినా, మరో ఓపెనర్ షఫాలీ వర్మ (50 పరుగులు: 31 బంతుల్లో; 3x4, 4x6) తుఫాన్ ఇన్నింగ్స్​తో చెలరేగింది. వన్ డౌన్​లో వచ్చిన అలీస్ క్యాప్సీ (46 పరుగులు: 33 బంతుల్లో; 4x4, 2x6), మరిజానే కాప్ (32 పరుగులు), జొనాసెన్ (36 పరుగులు) రాణించారు. దీంతో దిల్లీ భారీ స్కోర్ చేయగలిగింది. బెంగళూరు బౌలర్లలో ఎస్ డివైన్ 2, నదినె డి క్లెర్క్ 2, శ్రేయాంక పాటిల్​ 1 వికెట్ దక్కించుకున్నారు.

ముంబయి జోరుకు బ్రేక్- యూపీ గ్రాండ్ విక్టరీ

రెట్టింపు ఆనందంతో ఆర్సీబీ - చిన్నస్వామి వేదికగా రెండో విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.