ETV Bharat / sports

బ్యాటింగ్​ పరంగా ఆర్సీబీ ఫెయిల్ - దూబేతో బౌలింగ్​ చేయించాలి - ఐపీఎల్​-2024పై మిథాలీ ఆసక్తికర వ్యాఖ్యలు - MITHALI RAJ INTERVIEW

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 16, 2024, 2:58 PM IST

Updated : Apr 16, 2024, 3:25 PM IST

Etv Bharat
Etv Bharat

Mithaliraj Exclusive Interview with ETV Bharat : ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ రోజురోజుకూ రసవత్తరంగా సాగుతోంది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠతో ప్రేక్షకులకు ఊపేస్తోంది. ఈసారి కొన్ని జట్లు అంచనాలకు మించి రాణిస్తుండగా, మరికొన్ని పెద్ద జట్లు తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని క్రికెట్​లో ఇలాంటి పరిస్థితులు కామనే అయినా, ఆయా జట్ల అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్​పై భారత మహిళా క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ స్పోర్ట్స్​ తెలుగు ఎక్స్​పర్ట్​ మిథాలీరాజ్​​ ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Mithaliraj Exclusive Interview with ETV Bharat : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐపీఎల్-17​ ఫీవర్​ నడుస్తోంది. మార్చి 22న చెన్నై - గుజరాత్​ జట్ల మధ్య పోరుతో ప్రారంభమైన ఈ సీజన్​ (IPL 2024), ఉత్కంఠ మ్యాచ్​లతో క్రికెట్​ లవర్స్​ను ఉర్రూతలూగిస్తోంది. టికెట్​ కొని స్టేడియానికి వెళ్లే ఫ్యాన్స్​పై ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంటే, ఇళ్లల్లో కూర్చుని టీవీల్లో చూసే వారూ ఆ బౌండరీల వర్షంతో తడిసి ముద్దవుతున్నారు. గత సీజన్​ వరకు 200, 230 స్కోర్లు కొడితే దాదాపు గెలిచేశామనే ధీమాలో ఉండే జట్లు, ఈసారి అంతకుమించి దంచినా, గెలుపుపై ధీమాగా ఉండలేకపోతున్నాయి. ఐపీఎల్​ చరిత్రలో 11 ఏళ్లుగా పదిలంగా ఉన్న అత్యధిక పరుగుల రికార్డు (263 బెంగళూరు)ను ఈసారి ఇప్పటికే 2 సార్లు తిరగరాశారంటే (హైదరాబాద్ ​277, 287) పరుగుల వరద ఏ రేంజ్​లో పారుతుందో అర్థం చేసుకోవచ్చు.

రసవత్తరంగా సాగుతోన్న లీగ్​లో ఇప్పటి వరకు దాదాపు అన్ని జట్లు 6 మ్యాచులు ఆడేశాయి. ఈసారి నిలకడగా రాణిస్తోన్న రాజస్థాన్ జట్టు టేబుల్​ టాపర్​గా కొనసాగుతుండగా, ఈసాలా కప్​ నమదే అంటూ ప్రతిసారి ఊదరగొట్టే ఆర్సీబీ, చివరి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో ఏ జట్టు ఎలా ఆడుతోంది? ఆర్సీబీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్లే ఆఫ్స్​ రేసులో నిలవాలంటే ఏం చేయాలి? ధారాళంగా పరుగులు ఇచ్చేస్తున్న మన సిరాజ్​ మియా, హార్దిక్​ పాండ్య వంటి టీమిండియా ప్లేయర్లకు టీ-20 ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కే అవకాశం ఉందా? అన్న వాటిపై మన హైదరాబాదీ, భారత మహిళా క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ స్పోర్ట్స్​ తెలుగు ఎక్స్​పర్ట్​​ మిథాలీ రాజ్​ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం.

  • ఆర్సీబీ ఈసారీ వరుసగా విఫలమౌతుంది. విరాట్​ కోహ్లీ ఓపెనర్​గా వస్తున్నారు. అలా కాకుండా ఆయన 3వ స్థానంలో వచ్చి, విల్​ జాక్స్​తో ఓపెనింగ్​ చేయిస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా?

నా దృష్టిలో బెంగళూరు ఈసారి బ్యాటింగ్​లో సమష్టిగా రాణించడంలో క్లిక్​ కాలేదు. విరాట్​ కోహ్లీ ఓపెనర్​గా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎవరైనా సరే ఒక స్థానంలో నిలకడగా పరుగులు చేస్తున్నప్పుడు, ఆ స్థానం నుంచి తప్పించడం కరెక్ట్​ కాదు. బెంగళూరు కావాలంటే ఫాఫ్​ డుప్లెసిస్​కు బదులు విల్​ జాక్స్​ను విరాట్​కు జోడీగా పంపించాలి. జాక్స్​ దూకుడుగా ఆడతాడు కాబట్టి, పవర్​ ప్లేలో ఎక్కువ పరుగులు రాబట్టుకోవచ్చు. డుప్లెసిస్​ 3వ స్థానంలో బ్యాటింగ్​కు వస్తే అతడికి ఉన్న అనుభవంతో మధ్య ఓవర్లలో పరిస్థితులకు తగ్గట్లు ఆడతాడు. అలా చేస్తే జట్టుకు సమతూకం వచ్చే ఛాన్స్​ ఉంటుంది.

  • చెన్నై బ్యాటర్​ శివమ్​ దూబే ఈసారి బ్యాటింగ్​లో అదరగొట్టేస్తున్నాడు. సీఎస్కే అతడికి బౌలింగ్ అవకాశం​ కూడా ఇచ్చి టీ-20 వరల్డ్​ కప్​ కోసం ఆల్​ రౌండర్​గా తీర్చిదిద్దే ఛాన్స్​ ఉందా?

చెన్నై జట్టుకు ఆ అవకాశం ఉంది. దూబే డొమెస్టిక్​ క్రికెట్​లో బౌలింగ్​ కూడా చేస్తాడు. కానీ ఐపీఎల్​ మనం ఎక్కువగా చూడలేదు. ఈ సీజన్​లో ముఖ్యంగా బ్యాట్​తో అదరగొట్టేస్తున్నాడు. అందుకే అతడితో బౌలింగ్​ చేయించట్లేదు. కానీ టీ-20 వరల్డ్​ కప్​ను దృష్టిలో పెట్టుకుని అతడితో కొన్ని ఓవర్లు బౌలింగ్​ చేయిస్తే, టీమిండియాకు ఓ మంచి ఆల్​ రౌండర్​ దొరికినట్లవుతుంది.

  • ఈ సీజన్​లో టీమిండియా పేస్​ బౌలర్లు సిరాజ్​, అర్ష్​దీప్​, ముకేశ్​ కుమార్​ లాంటి వాళ్లు భారీగా పరుగులు ఇస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచకప్​ సమయానికి టీమిండియాకు టెన్షన్​ తప్పదా?

టీమిండియాకు కచ్చితంగా టెన్షన్​ ఉంటుంది. సిరాజ్​ తన లయను అందుకోలేకపోతున్నాడు. అతనితో పోలిస్తే అర్ష్​దీప్​ కాస్త మెరుగ్గానే బౌలింగ్​ చేస్తున్నాడు. కానీ బుమ్రాతో కలిసి మరో ఎండ్​ నుంచి బౌలింగ్​ చేసేందుకు మంచి పేస్​ బౌలర్​ను వీలైనంత త్వరగా వెతకాలి. ఈ సీజన్​లో కొంతమంది యువ పేసర్లు (మయాంక్​ యాదవ్​ లాంటి వాళ్లు) అద్భుతంగా రాణిస్తున్నారు. అలాంటి వాళ్లకు ఛాన్స్​ ఇస్తే బాగుంటుంది.

జెట్ స్పీడ్​లో 'సన్​రైజర్స్'- ఇది 2.O వెర్షన్- కానీ అదొక్కటే లోటు!

ఆల్​రౌండర్​గా ఫెయిల్​- నెట్టింట ట్రోలింగ్- అయినా బౌలింగ్ కంటిన్యూ​- ఎందుకంటే?

Last Updated :Apr 16, 2024, 3:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.