ETV Bharat / sports

ఉత్కంఠ పోరుతో సన్​రైజర్స్​పై కోల్​కతా విజయం​ - KKR VS SRH IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 23, 2024, 11:00 PM IST

Updated : Mar 24, 2024, 6:27 AM IST

KKR VS SRH IPL 2024 : ఐపీఎల్‌ 17వ సీజన్​లో భాగంగా శనివారం జరిగిన హోరాహోరీ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై కోల్​కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. హైదరాబాద్‌ జట్టు 4 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓటమి చెందింది.

KKR VS SRH IPL 2024
KKR VS SRH IPL 2024

KKR VS SRH IPL 2024 : ఐపీఎల్‌ 17వ సీజన్​లో భాగంగా శనివారం జరిగిన హోరాహోరీ మ్యాచ్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్​పై కోల్​కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. హైదరాబాద్‌ జట్టు 4 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓటమి చెందింది. అసలు సన్‌రైజర్స్‌ లక్ష్యం 208. 17 ఓవర్లకు ఆ జట్టు 149/5 స్కోరు చేసింది. అంటే మరో మూడు ఓవర్లలో 60 పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. దీంతో ఈ సీజన్​ను ఓటమితోనే పెట్టనుందని హైదరాబాద్​ ఫ్యాన్స్ అంతా ఓ అంచనాకు వచ్చేశారు. కానీ అంతలోనే హెన్రిచ్‌ క్లాసెన్‌ ఒత్తిడిలోనూ సిక్సర్ల మోత మోగిస్తూ విధ్వంసాన్ని సృష్టించాడు. దీంతో ఆఖరి 5 బంతుల్లో 7 పరుగులతో సమీకరణం తేలికైపోయింది. ఇక సన్‌రైజర్స్‌ గెలుపు లాంఛనమే అందరూ భావించారు. కానీ మ్యాచ్ మళ్లీ రివర్స్ అయింది. ఆఖరి 5 బంతుల్లో హర్షిత్ అద్భుతం చేశాడు. కేవలం 2 పరుగులే సమర్ఫించుకుని 2 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌ కోల్‌కతా ఖాతాలోకి వెళ్లిపోయింది. హైదరాబాద్​కు వేదనే మిగిలింది.

మొదట టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్​ టీమ్​ 7 వికెట్లు కోల్పోయి 208 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఆండ్రి రసెల్‌ (25 బంతుల్లో 3×4, 7×6 సాయంతో 64 నాటౌట్‌) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఫిల్‌ సాల్ట్‌ (40 బంతుల్లో 3×4, 3×6 సాయంతో 54) కూడా రాణించాడు. అలా భారీ సిక్సర్లతో విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ (3/32), మయాంక్‌ మార్కండే (2/39) వికెట్లు తీశారు.

అనంతరం లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ కాస్త తడబడ్డప్పటికీ ఆ తర్వాత ధనా ధన్ ఇన్నింగ్స్​తో చెలరేగిపోయింది. వరుస బౌండరీలతో మైదానాన్ని బ్యాటర్లు హోరెత్తించారు. పవర్‌ ప్లే పూర్తయిన సమయానికి 65/1 స్కోర్ చేసిన హైదరాబాద్​ జట్టు, ప్రత్యర్థులు వేసే బంతులను ఆచితూచి ఆడుతూ వచ్చింది. దీంతో 111 పరుగులు స్కోర్ చేసిన సమయానికి నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (29 బంతుల్లో 8×6 సాయంతో 63) అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఆఖరి ఓవర్లో హర్షిత్‌ (3/33) గొప్పగా బౌలింగ్​ చేసి కోల్‌కతాకు విజయాన్ని కట్టబెట్టాడు. దీంతో సన్​రైజర్స్​ జట్టు 7 వికెట్లకు 204 పరుగులే చేయగలిగింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు :
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా.

హైదరాబాద్ తుది జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్‌), మయాంక్ అగర్వాల్, మయాంక్ మార్కండే, రాహుల్ త్రిపాఠి, ఐడెన్‌ మార్‌క్రమ్‌, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్.

గబ్బర్​​ జట్టు ఘన విజయం - రెండో మ్యాచ్​లో పంజాబ్​దే విక్టరీ! - PBKS VS DC IPL 2024

KKR vs SRH: బరిలోకి హైయ్యెస్ట్ ప్లేయర్- ఒక్కో బంతికి రూ.7 లక్షలకు పైనే! - Mitchell Starc IPL 2024

Last Updated :Mar 24, 2024, 6:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.