ETV Bharat / sports

'ఫ్యామిలీతో కేశవ్ అయోధ్య ట్రిప్​- అందుకు LSG ఏర్పాట్లు?'

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 5:28 PM IST

Keshav Maharaj Ayodhya: తాను కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లాలనుకుంటున్నట్లు సౌతాఫ్రితా ప్లేయర్ కేశవ్ మహరాజ్ తెలిపాడు. ఈ విషయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ ఎల్​ఎస్​జీ అతడికి హెల్ప్ చేయాలని ఆశించాడు.

KESHAV MAHARAJ
KESHAV MAHARAJ

Keshav Maharaj Ayodhya: సౌతాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్ అయోధ్య రామమందిరాన్ని సందర్శించాలనుకుంటున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్​లో డర్బన్ సూపర్ జెయింట్స్​కు ఆడుతున్న కేశవ్, రీసెంట్​గా జరిగిన అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రాలేకపోయాడు. అయితే డర్బన్ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ ఐపీఎల్​ లఖ్​నవూ సూపర్ జెయింట్స్ యాజమాన్యానిదే. దీంతో తన కుటుంబ సభ్యులతో సహా అయోధ్య టూర్​కు ఎల్​ఎస్​జీ (LSG) ఫ్రాంచైజీ సహాయం చేస్తుందని ఆశించాడు.

'నా బిజీ షెడ్యూల్​ కారణంగా రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయాను. కానీ, భవిష్యత్​లో కచ్చితంగా అయోధ్య రామమందిరాన్ని సందర్శిస్తా. మా ఫ్యామిలీ కూడా భారత్​లో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లాలని ఎప్పట్నుంచో అనుకుంటుంది. ఈ విషయంలో లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ప్రాంఛైజీ నాకు హెల్ప్ చేస్తుందనుకుంటున్నా' అని కేశవ్ అన్నాడు.

Keshav Maharaj Ayodhya Wishes: రీసెంట్​గా రామమందిక ప్రారంభోత్సవానికి ముందు కేశవ్ సౌతాఫ్రికాలో ఉన్న భారతీయులకు శుభాకాంక్షలు తెలిపాడు.'అందరికీ నమస్తే, అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సం సందర్భంగా సౌతాఫ్రికాలో ఉన్న నా భారతీయులందరికీ శుభాకాంక్షలు. అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలగాలి. జై శ్రీరామ్' అని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే కేశవ్ మహరాజ్ భారతీయ మూలాలున్న సౌతాఫ్రికా పౌరుడు. అతడి పూర్వికులు (తాత) ఉత్తర్​ప్రదేశ్ సుల్తాన్​పుర్​కు చెందినవారు. కేశవ్ భార్య లెరిషా మున్సామీ ఓ కథకళి డ్యాన్సర్. ఇక రామమందిరాన్ని సందర్శించడానికి తను కూడా ఎదురుచూస్తున్నట్లు కేశవ్ తెలిపాడు. ఈసారి భారత్​కు వచ్చినప్పుడు కచ్చితంగా అయోధ్య మందిరాన్ని సందర్శిస్తానని కేశవ్ ఓ సందర్భంలో చెప్పాడు. 2023 వన్డే వరల్డ్​కప్​లో ఆడేందుకు భారత్ వచ్చిన కేశవ్, కేరళలోని పద్మనాభస్వామి ఆలయానికి వెళ్లాడు.

గతంలో సౌతాఫ్రికా ఆడిన మ్యాచ్​​ల్లో కేశవ్ బ్యాటింగ్​కు వచ్చే సమయంలో పలుమార్లు రాముడి పాటలు ప్లే చేశారు. రీసెంట్​గా సౌతాఫ్రికా- భారత్ టెస్టు, వన్డే సిరీస్​లోనూ ఆదిపురుష్ సినిమాలోని 'సీతా రామ్' పాట ప్లే చేశారు. 'నువ్వు వచ్చినప్పుడు రాముడి పాట ప్లే చేస్తున్నారు' అని టీమ్ఇండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, కేశవ్​తో చెప్పాడు. దీంతో కేశవ్ కూడా నవ్వుతూ అవునని బదులిచ్చాడు.

రామ్​ లల్లా ప్రాణప్రతిష్ఠ- సౌతాఫ్రికా క్రికెటర్ స్పెషల్ విషెస్

దక్షిణాఫ్రికాకు ఎదురుదెబ్బ.. మూడో టెస్టుకు కేశవ్ దూరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.