ETV Bharat / sports

పంజాబ్​పై ముంబయి ఇండియన్స్ విజయం - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 11:46 PM IST

Etv Bharat
Etv Bharat

IPL 2024 Punjab Kings vs Mumbai Indians : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​పై ముంబయి ఇండియన్స్ గెలిచింది. 9 పరుగుల తేడాతో విజయం సాధించింది.

IPL 2024 Punjab Kings vs Mumbai Indians : ఐపీఎల్ 2024లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో పంజాబ్ కింగ్స్​పై ముంబయి ఇండియన్స్ గెలిచింది. 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 19.1 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆలౌట్ అయిపోయింది. పంజాబ్​ అశుతోష్ శర్మ(28 బంతుల్లో 7 సిక్స్​లు, 2 ఫోర్ల సాయంతో 61 పరుగులు) టాప్ స్కోరర్​గా నిలిచాడు. శశాంక్ సింగ్(25 బంతుల్లో మూడు సిక్స్​లు, 2 ఫోర్ల సాయంతో 41 పరుగులు), హర్​ప్రీత్ బార్​(20 బంతుల్లో 1 సిక్స్​, 2 ఫోర్ల సాయంతో 21 పరుగులు), జితేశ్ శర్మ(9), హర్​ప్రీత్ సింగ్ భాటియా(13), హర్​ప్రీత్ బార్(21) పరుగులు చేశారు. హర్షల్ పటేల్​(1) నాటౌట్​గా నిలిచాడు.ముంబయి బౌలర్లలో గెరాల్డ్​ 3, జస్ప్రిత్ బుమ్రా 3, అకాశ్ మద్వాల్​, హర్దిక్ పాండ్య, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్​లో మిస్టర్‌ 360 డిగ్రీస్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఒంటరి పోరాటం చేశాడు. 53బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు హాఫ్​ సెంచరీ బాదాడు. మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హైదరాబాద్‌ బ్యాటర్‌ తిలక్‌ వర్మ కూడా చెలరేగారు. మొదట ముంబయి ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(8) రబడా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. భారీ షాట్‌ ఆడి బౌండరీ వద్ద హర్‌ప్రీత్‌ బ్రార్‌ చేతికి చిక్కాడు. దీంతో 18 పరుగుల వద్ద ముంబయి తొలి వికెట్​ను కోల్పోయింది. ఇషాన్‌ ఔటైనా గత మ్యాచ్‌లో చెన్నైపై సెంచరీ బాదిన రోహిత్‌ శర్మ(36) బాగానే ఆడాడు. అయితే చివర్లో పంజాబ్‌ కింగ్స్‌ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌(3/31) తన బౌలింగ్ కట్టడి చేయడంతో ముంబయి భారీ స్కోర్‌ చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 192పరుగులతో ఇన్నింగ్స్ ముగించింది.

రోహిత్ అరుదైన ఘనత - ఈ మ్యాచ్​లో రోహిత్‌ శర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో చెన్నై సూపర్‌ కింగ్స్ స్టార్‌ ప్లేయర్​ ఎం​ఎస్‌ ధోనీ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 256 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాతి స్ధానాల్లో రోహిత్‌(250), దినేశ్​ కార్తీక్‌ నిలిచారు. రోహిత్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు డెక్కన్ ఛార్జర్స్ తరపున 45 మ్యాచ్‌లు, ముంబయి ఇండియన్స్‌ తరపున 205 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 6472 పరుగులు సాధించాడు.

'రాత్రిళ్లు నిద్ర పట్టేది కాదు - కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీ అలా ఉంటుంది' - కేఎల్ రాహుల్​ - IPL 2024

ఐపీఎల్​లో ఆ రూల్​ నాకు నచ్చలేదు - దాని వల్ల నష్టం : రోహిత్ శర్మ - IPL 2024 Rohith Sharma

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.