ETV Bharat / sports

స్టాయినిస్​ హాఫ్ సెంచరీ - ముంబయిపై లఖ్​నవూ విజయం - IPL 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 11:30 PM IST

Updated : Apr 30, 2024, 11:35 PM IST

.
.

IPL 2024 Lucknow Super Giants vs Mumbai Indians : ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై లఖ్​నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2024 Lucknow Super Giants vs Mumbai Indians : ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా తాజాగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై లఖ్​నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్​నవూ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 రన్స్ చేసింది.

మార్కస్ స్టాయినిస్(45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్​ల సాయంతో 62 పరుగులు) టాప్ స్కోరర్​గా నిలిచాడు. కేఎల్ రాహుల్(22 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 28 పరుగులు), దీపక్ హుడా(18 బంతుల్లో 18 పరుగులు), నికోలస్​ పూరన్(14 నాటౌట్​), అస్టన్​ టర్నర్​(5), కృనాల్ పాండ్య(1 నాటౌట్​) స్కోర్ చేశారు. హార్దిక్ పాండ్య 2, గెరాల్డ్, నువాన్ తుష్రా, మహ్మద్​ నబి తలో వికెట్ దక్కించుకున్నారు.

అంతకుముందు లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు ముంబయి ఇండియన్స్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేశారు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి ఇండియన్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (32), నేహల్‌ వధేరా (46), టిమ్‌ డేవిడ్‌ (35 నాటౌట్‌) మోస్తరు స్కోర్లు చేశారు. రోహిత్‌ శర్మ (4), సూర్యకుమార్‌ (10), తిలక్‌ వర్మ (7), హార్దిక్‌ పాండ్యా (0), మొహమ్మద్‌ నబీ (1) ఫెయిల్ అయ్యారు. లఖ్​నవూ బౌలర్లలో మొహిసిన్‌ ఖాన్‌ 2 వికెట్లు తీయగా స్టోయినిస్‌, నవీన్‌ ఉల్‌ హక్‌, మయాంక్‌ యాదవ్‌, రవి బిష్ణోయ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

పుట్టినరోజున ఆసక్తికరంగా రోహిత్ ఇన్నింగ్స్ - నేడు రోహిత్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు అతడు అద్భుతంగా ఆడాలని అంతా కోరుకున్నారు. కానీ అలా జరగలేదు. హిట్ మ్యాన్​ చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. ఐదు బంతుల్లో ఓ బౌండరీ సాయంతో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. మొహిసిన్‌ ఖాన్‌ బౌలింగ్‌లో స్టొయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే పుట్టినరోజు నాడు రోహిత్ ఇలా తక్కువ స్కోరుకు ఔట్ అవ్వడం కొత్తేది కాదు.

రోహిత్‌ తన పుట్టిన రోజున ఆడిన గత నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా 1, 2, 3, 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ స్కోర్లన్నీ యాదృచ్చికంగా 5 బంతుల్లో చేసినవే. 2014లో సన్‌రైజర్స్‌పై 5 బంతుల్లో ఒక్క పరుగు చేసిన రోహిత్‌ 2022లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో 2 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం గతేడాది పుట్టిన రోజున రాజస్థాన్‌పై 5 బంతుల్లో 3 పరుగులు చేసిన హిట్ మ్యాన్ 2024(ఈ ఏడాది) లఖ్​నవూతో జరిగిన మ్యాచ్‌లో 5 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అలా 1 (5), 2 (5), 3 (5), 4 (5) వరుసగా చేశాడు.

ఇంపాక్ట్ రూల్​ వల్లే రింకూ సింగ్​కు జట్టులో చోటు దక్కలేదా? - T20 World Cup 2024

కోల్​కతా బౌలర్ ఓవర్​ యాక్షన్​ - ఒక మ్యాచ్​ నిషేధం - IPL 2024 KKR

Last Updated :Apr 30, 2024, 11:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.