ETV Bharat / sports

భారత్xఇంగ్లాండ్- పడిలేచిన టీమ్ఇండియా- డే 2 కంప్లీట్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 4:45 PM IST

Updated : Feb 24, 2024, 4:56 PM IST

Ind vs Eng 4th Test 2024: భారత్- ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 219-7తో నిలిచింది.

Ind vs Eng 4th Test 2024
Ind vs Eng 4th Test 2024

Ind vs Eng 4th Test 2024: రాంచీ టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో ఆట ముగిసేసరికి భారత్ తొలి ఇన్నింగ్స్​లో 219-7తో నిలిచింది. భారత్ ఇంకా 134 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ధ్రువ్ జురెల్ (30 పరుగులు), కుల్​దీప్ యాదవ్ (17 పరుగులు) ఉన్నారు. టీమ్ఇండియాలో యశస్వి జైశ్వాల్ (73 పరుగులు; 117 బంతులు; 8x4, 1x6) ఒక్కడే హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 4, టామ్ హార్ట్లీ 2, జేమ్స్ అండర్సన్ 1 వికెట్ దక్కించుకున్నారు.

తొలి ఇన్నింగ్స్​ బ్యాటింగ్​కు దిగిన టీమ్ఇండియా భారీ స్కోర్ చేయడంలో విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (2)ను అండర్సన్ పెవిలియన్ చేర్చాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో నాలుగో బంతిని డిఫెన్స్ చేసే క్రమంలో రోహిత్ కీపర్ క్యాచ్​గా వెనుదిరాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన శుభ్​మన్ గిల్ (38)తో జైశ్వాల్ మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇన్నింగ్స్​ సాఫీగా సాగుతున్న సమయంలో స్పిన్నర్ బషీర్, గిల్​ను ఎల్​బీడబ్ల్యూగా ఔట్ చేశాడు.

సిరీస్​లో మరో ఛాన్స్ దక్కించుకున్న రజత్ పటీదార్ (17) ఈఇన్నింగ్స్​లోనూ నిరాశపర్చాడు. మరోసారి స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన జడేజా (12) రెండు సిక్స్​లు బాది ఊపుమీద కనిపించాడు. కానీ,అతడిని కూడా బషీర్ బోల్తా కొట్టించాడు. సర్ఫరాజ్ (14) ఈ మ్యాచ్​లో సత్తా చాటలేకపోయాడు. అశ్విన్ (1) హార్ట్లీ బౌలింగ్​లో ఔటయ్యాడు. ఇక జురెల్, కుల్​దీప్​తో కలిసి ఇన్నింగ్స్​ను నడిపిస్తున్నాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ జోడి ఇప్పటికే 42 పరుగులు జోడించింది.

అంతకుముందు ఓవర్​నైట్ స్కోర్ 301-7 వద్ద ఇన్నింగ్స్​ ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 52 పరుగులు జోడించి 3 వికెట్లు కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 353 పరుగులకు ఆలౌటైంది. జో రూట్ (122 పరుగులు) నాటౌట్​గా నిలిచాడు. రాబిన్సన్ (58), బెన్ ఫోక్స్ (47), జాక్ క్రాలీ (42), జానీ బెయిస్టో (38) రాణించారు. టీమ్ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4, ఆకాశ్ దీప్ 3, మహ్మద్ సిరాజ్ 2, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ దక్కించుకున్నారు.

జడ్డూ దెబ్బకు ఇంగ్లాండ్ హడల్​ - 353 పరుగులకు ఆలౌట్‌

అరంగేట్రంలోనే అదరగొట్టేస్తున్న కుర్రాళ్లు - ప్రత్యర్థి జట్టు ఢమాల్​!

Last Updated : Feb 24, 2024, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.