ETV Bharat / sports

ఉప్పల్​లో తిప్పేస్తున్న భారత స్పిన్నర్లు- రోహిత్, సిరాజ్ సూపర్ క్యాచ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 2:27 PM IST

Updated : Jan 26, 2024, 5:04 PM IST

Ind vs Eng 1st Test 2024: భారత్- ఇంగ్లాండ్ తొలి టెస్టులో టీమ్ఇండియా స్పిన్నర్లు జోరు ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు టీ బ్రేక్ సమయానికి 8 వికెట్లు నేలకూల్చారు.

ind vs eng 1st test 2024
ind vs eng 1st test 2024

Ind vs Eng 1st Test 2024: ఉప్పల్​లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్​లో టీమ్ఇండియా స్పిన్నర్లు ఉచ్చు బిగిస్తున్నారు. టాస్ నెగ్గి బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్​ను టీమ్ఇండియా అద్భుతంగా కట్టడి చేస్తోంది. బజ్​బాల్ వ్యూహంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు, భారత్​ పిచ్​పై పరుగులు చేయలేక టపటపా వికెట్లు కోల్పోయింది. తొలి రోజు టీ బ్రేక్ సమయానికి 58 ఓవర్లకు 215 పరుగులకు ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయింది. టీమ్ఇండియా బౌలర్లు రవిచంద్రన్ రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2, అక్షర్ పటేల్ 2, జస్ప్రీత్ బుమ్రా 1 వికెట్ దక్కించుకున్నారు.

రోహిత్ వావ్: అయితే ఈ మ్యాచ్​ తొలి సెషన్​లో 14.4 ఓవర్ వద్ద టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ ఓవర్​లో స్ట్రైక్​లో ఉన్న ఓల్లీ పోప్​ జడేజా బౌలింగ్​లో డిఫెన్స్ ఆడాడు. బ్యాట్ అంచున తాకిన బంతి స్లిప్​లోకి దూసుకెళ్లింది. అక్కడే స్లిప్​లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ చురుగ్గా స్పందించి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.

సిరాజ్ అదరహో: అశ్విన్ బౌలింగ్ చేసిన 15 ఓవర్లో తొలి బంతిని జాక్ క్రాలీ ముందుకు వచ్చి మిడాఫ్​ వైపు షాట్ ఆడాడు. 30 యార్డ్ సర్కిల్​లో ఫీల్డింగ్​లో ఉన్న మహ్మద్ సిరాజ్ చురుగ్గా స్పందించాడు. వెంటనే ముందుకు డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ క్రాలీ షాకై పెవిలియన్ బాట పట్టాడు.

ఈ మ్యాచ్​ తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్​ఇండియా 23 ఓవర్లు ఆడి తొలి వికెట్​కు 119 పరుగులు చేసింది. .యంగ్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్​(70 బంతుల్లో 76; 9x4, 3x6) దూకుడుగా ఆడాడు. శుభమన్ గిల్​ (14 పరుగులు) క్రీజులో ఉన్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(24 పరుగులు 27 బంతులు; 3x4) ఔట్ అయ్యాడు. రోహిత్‌ను జాక్‌ లీచ్‌ ఔట్ చేశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్​లో 246 చేసి ఆలౌట్ అయింది.

మ్యాచ్‌ మధ్యలో రోహిత్ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని!

అశ్విన్ - జడేజా : టెస్టుల్లో ఆల్​ టైమ్ రికార్డ్​

Last Updated : Jan 26, 2024, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.