ETV Bharat / sports

90 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ - ధ్రువ్ 'సెల్యూట్'​ వెనక కారణం ఏంటంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 25, 2024, 8:48 PM IST

Updated : Feb 25, 2024, 9:31 PM IST

Dhruv Jurel England Series : ఇటీవలే టెస్ట్​ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ క్రికెటర్ ధ్రువ్ జురెల్ తన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందిస్తూ దుసుకెళ్లాడు. నేడు( ఫిబ్రవరీ 25)న జరిగిన మ్యాచ్​లోనూ 90 పరుగులు స్కోర్ చేసి జట్టును ఆదుకున్నాడు. అయితే హాఫ్​ సెంచరీ తర్వాత క్రీజులో అతడు సెల్యూట్​ చేశాడు. ఇలా అతడు ఎందుకు చేశాడంటే ?

Dhruv Jurel England Series
Dhruv Jurel England Series

Dhruv Jurel England Series : టెస్ట్ జట్టులోకి అరంగేట్రం చేసి కొద్ది రోజులు కూడా కాలేదు అప్పుడే క్రికెట్ హిస్టరీలో పలు సంచలనాలు సృష్టిస్తున్నాడు ఓ యంగ్ క్రికెటర్​ రాజ్‌కోట్‌ వేదికగా టెస్ట్ అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు ఇప్పుడు రాంచీ మ్యాచ్​లోనూ సత్తా చాటుతున్నాడు. అతడి ఆటతీరు చూసిన ప్రతి ఒక్కరూ తనను జట్టుకు కొత్త అని అస్సలు అనుకోరు. ఇంతకీ అతడెవరో కాదు ఇంగ్లాండ్ ప్లేయర్లను తన బ్యాటింగ్​ స్టైల్​తో హడలెత్తిస్తున్న యువ కెరటం ధ్రువ్ జురెల్​.

మైదానంలోకి దిగి బౌండరీల వర్షం కురిపించే ఈ స్టార్, రాంచీ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న నాలుగో టెస్ట్​ తొలి ఇన్నింగ్ల్​లో టీమ్ఇండియాకు భారీ స్కోర్​ను అందించాడు. 149 బంతుల్లో 90 పరుగులు సాధించాడు. డెబ్యూ మ్యాచ్​ల్లోనే తన అద్భుతమైన ఆట తీరును చూసి మాజీలు కొనియాడుతున్నారు. భారత జట్టుకు అతడు కీలకం అంటూ కితాబులిస్తున్నారు.

ఇలా ధ్రువ్​ ఆటతీరును అందరూ కొనియాడుతున్న నేపథ్యంలో అతడి చిన్ననాటి కోచ్ ఫూల్‌చంద్ శర్మ​ కూడా జురెల్​ గురించి పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో వండర్స్ క్రికెట్ క్లబ్‌ను నడుపుతున్న ఆయన, ఈటీవీ భారత్​కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలను పంచుకున్నారు. తన అకాడమీలో జురెల్ శిక్షణ తీసుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు.

"13 ఏళ్ల వయసులో ధృవ్​ నా అకాడమీకి వచ్చాడు. నేను అతడ్ని చూని నువ్వు ఇంటి నుంచి పారిపోయావా? అని అడిగాను. ఆ తర్వాత తన తండ్రితో మాట్లాడి అసలు విషయాన్ని తెలుసుకున్నాను. దీంతో ఇక తనను ఓ హాస్టల్‌లో చేర్పించి తనకు కోచింగ్ ఇవ్వడం ప్రారంభించాను." అంటూ ధృవ్​ తన అకాడమీకి ఎలా వచ్చాడో వివరించారు.

ఓ వైపు శిక్షణ ఇస్తూనే ధృవ్​ను కొన్ని లోకల్​ టోర్నమెంట్‌లలో ఆడించారు కోచ్​. ఇలా పలు టోర్నీల్లో ఆడి ధృవ్ బ్యాటింగ్​తో పాటు వికెట్ కీపింగ్ రెండింటిలోనూ రాణించాడు. క్రమక్రమంగా ఏజ్ గ్రూప్ టోర్నమెంట్‌లతో పాటు, రంజీ ట్రోఫీలోనూ ఆడాడు. పలు రికార్డులు సృష్టించాడు. అయితే నేషనల్ టీమ్​లో తన స్థానం కోసం ఎదురుచూసిన జురెల్​, అవకాశం రాగానే దాన్ని అందుకుని సద్వినియోగం చేసుకున్నాడంటూ కోచ్ ఫూల్​చంద్ ధృవ్​ కోచింగ్ రోజుల గురించి మాట్లాడారు.

అయితే రాంచీ వేదికగా నేడు ( ఫిబ్రవరీ 25)న జరిగిన మ్యాచ్​లో తొలి అర్ధశతకాన్ని పూర్తి చేసుకొన్నాక ధ్రువ్‌ మైదనంలో 'సెల్యూట్‌' చేశాడు. అతడు ఇలా చేయడం అందర్ని ఆశ్చర్యపర్చింది. అయితే అతడు అలా ఎందుకు చేశాడో తెలిశాక మాత్రం నెటిజన్లు ' ధ్రువ్​ నీకు హ్యాట్సాఫ్‌' అంటూ తన గెస్టర్​కు పొంగిపోయారు.

మాజీ సైనికుడైన తన తండ్రి గౌరవార్థం అతడు అలా చేశాడు ధ్రువ్​. 1999లో జరిగిన కార్గిల్‌ వార్​లో ధ్రువ్ తండ్రి నేమ్‌ చంద్‌ జురెల్‌ దేశానికి విశిష్ట సేవలను అందించారు. హవాల్దార్‌ హోదాలో ఉన్న సమయంలో ఆయన సైన్యం నుంచి రిటైర్​ అయ్యారు. అయితే ధ్రువ్‌ను కూడా తన తండ్రీ ఓ ఆర్మీ మ్యాన్​లా చూడాలనుకున్నారు. కానీ, చిన్నతనం నుంచి క్రికెట్‌పై మక్కువ ఉండటం వల్ల ఆ దిశగా ప్రోత్సహించారు.

నాలుగో టెస్ట్​ తొలి ఇన్నింగ్స్​ - భారత్ ఆలౌట్​ - ధ్రువ్‌ జురెల్ ధనాధన్ ఇన్నింగ్స్​!

గోల్డ్​ చైన్ అమ్మి క్రికెట్ కిట్ కొనిచ్చిన అమ్మ- తల్లి కలను బతికిస్తున్న క్రికెటర్

Last Updated :Feb 25, 2024, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.