ధోనీయే కాదు- వాళ్ల అత్త కూడా రిచ్చే- రూ.800 కోట్ల కంపెనీకి CEO - Dhoni Business Investments

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 4:32 PM IST

Dhoni Business Investments

Dhoni Business Investments: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యాపారాల్లోనూ రాణిస్తున్నాడు. అతడి వ్యాపారాల్లో ఒకటైన 'ధోనీ ఎంటర్​టైన్మెంట్​ లిమిటెడ్'కు సతీమణి సాక్షి సింగ్ తల్లి షీలా సింగ్ సీఈఓగా ఉన్నారు.

Dhoni Business Investments: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ క్రికెట్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్​ కెప్టెన్. కేవలం క్రికెట్ పరంగానే కాదు డబ్బు సంపాదన, ఆదాయం పరంగా ధోనీ స్టైలే డిఫరెంట్ అని చెప్పవచ్చు. క్రికెట్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న ధోనీ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్​ నుంచి తప్పుకున్నా, ధోనీ ఇప్పటికీ ఐపీఎల్​ ఆడుతున్నాడు.

కాగా, టీమ్ఇండియాకు మూడు ఐసీసీ ట్రోఫీ (టీ20 వరల్డ్​కప్​, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ)లు అందించిన ధోనీ ఐపీఎల్ ఆడుతూనే తనకున్న క్రేజ్ క్యాష్ చేసుకోవడంలోనూ ముందున్నాడు. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్న ఝార్ఖండ్ డైనమైట్ యాడ్స్ రూపంలోనూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అంతేకాదు ఈ మధ్య పలు వ్యాపారసంస్థల్లోనూ పెట్టుబడి పెట్టాడు. వినోద రంగంలోనూ అడుగుపెట్టాడు. 'ధోనీ ఎంటర్టైన్​మెంట్ లిమిటెడ్' పేరుతో ప్రొడక్షన్ హౌజ్ ఏర్పాటు చేశాడు. మరి ఈ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరో మీకు తెలుసా?

ఆమె ఎవరో కాదు ధోనీకి పిల్లనిచ్చిన అత్తగారు షీలా సింగ్. ఓ జాతీయ పత్రికా కథనం ప్రకారం తన ప్రొడక్షన్ హౌజ్ లో కుటుంబసభ్యులకు పెద్ద పీట వేయాలని భావించిన ధోనీ భార్య సాక్షి సింగ్, ఆమె తల్లి షీలా సింగ్​కు కంపెనీ కీలక బాధ్యతలను అప్పగించాడు. ప్రస్తుతం వీళ్లు దక్షిణాదిలో తమ బ్యానర్​పై పలు సినిమాలు నిర్మిస్తున్నారు. కాగా, ధోనీ ఎంటర్టైన్​మెంట్ లిమిటెడ్ విలువ దాదాపు రూ.800కోట్లు ఉంటుందని అంచనా. ఈ కంపెనీలో సాక్షి బిగ్గెస్ట్ షేర్ హోల్డర్​గా ఉన్నట్లు సమాచారం.

కాగా, 2020 నుంచి ధోనీ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో పాత్రలను అతని భార్య సాక్షి, ఆమె తల్లి షిలా సింగ్ ఇద్దరూ కలిసి కంపెనీని ఉన్నత స్థానంలోకి తీసుకెళ్లారట. సాక్షి తండ్రి ఆర్కే సింగ్ , ధోనీ తండ్రి పాన్ సింగ్ తో కలిసి గతంలో ఒకేచోట పనిచేసేవారట. బినాగురి అనే చాయ్ కంపెనీలో వీరు సహోద్యోగులుగా ఉన్నారట. ఆ సమయంలో ఇంటి బాధ్యతలు నిర్వర్తించిన షీలా సింగ్ అల్లుడు ధోని రిక్వెస్ట్​తో కూతురుతో కలిసి బిజినెస్ వుమెన్​గా అవతారమెత్తినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024లో కెప్టెన్​గా వైదొలిగిన ధోనీ వికెట్ కీపర్​గా రాణిస్తున్నాడు.

ప్రైవేట్​ జెట్​, కాస్ట్​లీ కార్లు - సౌత్​లో రిచెస్ట్​ హీరోయిన్ ఎవరంటే ?

బిజినెస్​లోనూ రోహిత్ మార్క్​- హిట్​మ్యాన్ నెట్​వర్త్​ ఎంతో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.