ETV Bharat / sports

బాడీషేమింగ్​ - ట్రోలర్స్​కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బుమ్రా భార్య

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 1:39 PM IST

Bumrah Wife Sanjana Body Shamed : టీమ్​ఇండియా పేసర్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ తన శరీరాకృతిపై నెట్టింట ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. కామెంట్స్ చేసిన వారికి సంజనా తిరిగి గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

Bumrah Wife Sanjana Body Shamed
Bumrah Wife Sanjana Body Shamed

Bumrah Wife Sanjana Body Shamed : టీమ్​ఇండియా స్టార్​ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్​ తన శరీరాకృతిపై కామెంట్ చేసిన అభిమానికి గట్టి గుణపాఠం చెప్పారు. ఓ సౌందర్య ఉత్పత్తుల కంపెనీ చేసిన ప్రచార చిత్రంలో బుమ్రా దంపతులు నటించారు. వాలెంటైన్స్ సందర్భంగా సంజనా సోమవారం తన ఇన్​స్టా పేజీలో ఓ ప్రమోషన్ వీడియోను పోస్ట్ చేశారు. అయితే అందులో సంజన శరీరాకృతిపై కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. దీంతో వాళ్లకు సంజనా గట్టిగా కౌంటర్ ఇచ్చింది.

'మీరు చాలా లావుగా ఉన్నారు' అంటూ ఓ నెటిజన్ బాడీషేమింగ్ చేశాడు. ఆ కామెంట్​కు సంజనా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తిరిగి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. " పాఠశాల్లో సైన్స్ పుస్తకాల్లో మీరు చదువుకున్న విషయాలు గుర్తులేవా? మహిళ శరీరాకృతిపై కామెంట్లు చేయడానికి మీకెంత ధైర్యం? ఇక్కడి నుంచి వెళ్లిపో " అంటూ సంజనా గణేశన్ చురకలు అంటించారు. ఈ క్రమంలో పలువురు హర్షం వ్యక్తం చేశారు. 'సరిగ్గా చెప్పారు మేడం' అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇకపోతే ప్రముఖ స్పోర్ట్స్‌ యాంకర్‌ సంజనా గణేశన్‌ను బుమ్రా 2021 మార్చిలో వివాహం చేసుకున్నారు. గతేడాది సెప్టెంబరులో సంజనా మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి చిన్న విరామం దొరకడం వల్ల బుమ్రా ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు. త్వరలోనే జట్టుతో చేరనున్నారు.

IND vs ENG 3rd Test : భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్​లో చెరో పాయింట్‌తో ఇరు జట్లు స్కోర్‌ను సమం చేశాయి. వైజాగ్​లో జరిగిన రెండో టెస్టులో బుమ్రా 9 వికెట్లు పడగొట్టి టీమ్‌ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ గురువారం (ఫిబ్రవరి 15) నుంచి రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది. ఈ టెస్ట్​ కోసం భారత జట్టు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తోంది. అయితే మూడో టెస్టుకు బుమ్రా రెస్ట్ తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

మూడో టెస్ట్​కు కీలక మార్పులు - భరత్‌ బదులు ధ్రువ్‌- సర్ఫరాజ్​ సంగతేంటంటే ?

చివరి ఆరు మ్యాచుల్లో నాలుగు సెంచరీలు - మూడో టెస్ట్​లో అతడు ఎంట్రీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.