ETV Bharat / sports

టెస్టు ఫార్మాట్​ ఫీజు పెంచిన బీసీసీఐ- ఒక్కో మ్యాచ్​కు రూ.45 లక్షలు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 3:09 PM IST

Updated : Mar 9, 2024, 6:34 PM IST

BCCI Test Match Fee
BCCI Test Match Fee

BCCI Test Match Fee: టీమ్ఇండియా పురుషుల టెస్టు మ్యాచ్ ఫీజు పెంచనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ జై షా తెలిపారు. ప్రస్తు

BCCI Test Match Fee: టీమ్ఇండియా ఆటగాళ్లకు బీసీసీఐ గుడ్​న్యూస్ చెప్పింది. పురుషులకు టెస్టు ఫార్మాట్​ మ్యాచ్ ఫీజు పెంచనున్నట్లు బోర్డు సెక్రటరీ జై షా వెల్లడించారు. ఆటగాళ్ల ఆర్ధిక స్థిరత్వాన్ని దృఢపర్చేందుకు 'టెస్టు క్రికెట్ ఇన్సెంటివ్ స్కీమ్' పేరిట అదనపు ఫీజు చెల్లించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు షా తెలిపారు. ఈ ఇన్సెంటివ్ స్కీంతో ఆయా ప్లేయర్​కు అత్యధికంగా ఒక్కో మ్యాచ్​కు రూ.45 లక్షల దాకా ఫీజు రూపంలో అందనుంది. ఇది 2022-23 సంవత్సరం నుంచే అమలైనట్లు షా పేర్కొన్నారు.

ఫీజు వివరాలు: ఒక సంవత్సర కాలంలో భారత్ 9 మ్యాచ్​లు ఆడుతుందని అనుకుంటే, అందులో 4 టెస్టు​లకంటే తక్కువ ఆడిన ప్లేయర్లకు ఈ ఇన్సెంటివ్ వర్తించదు. 50 శాతం అంటే 5-6 మ్యాచ్​లు ఆడిన ప్లేయర్ రూ.30 లక్షలు అందుకుంటాడు. సిరీస్​కు ఎంపికై తుది జట్టులో లేకపోయినా రూ.15 లక్షలు దక్కుతాయి. ఇక 7 అంతకంటే ఎక్కువ (75 శాతం) మ్యాచ్​లు ఆడిన ఆటగాడికి బీసీసీఐ అత్యధికంగా రూ.45 లక్షలు చెల్లించనుంది. ఇందులో కూడా బెంచ్​కు పరిమితమైనా రూ.22.50 లక్షలు అందుకుంటారు. కాగా, ప్రస్తుతం ఒక్కో టెస్టు మ్యాచ్​కు బేసిక్ ఫీజు రూ.15 లక్షలు ఉంది.

BCCI Annual Contract: 2023-24వ ఏడాదికిగానూ బీసీసీఐ ఇటీవల టీమ్ఇండియా వార్షిక ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. ఇందులో భాగంగా గ్రేడ్​ ఏ ప్లస్​, ఏ, బీ, సీలోకి ఆయా ప్లేయర్ల కాంట్రాక్ట్​లను సవరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాను A+ గ్రేడ్​లో చేర్చగా, రవిచంద్రన్ అశ్విన్‌, మహ్మద్​ షమీ, కేఎల్‌ రాహుల్‌, మహ్మద్​ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా A గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.

జైస్వాల్​, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్ B గ్రేడ్, ​రింకూ సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్, ముకేశ్ కుమార్‌, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌, కేఎస్‌ భరత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, అవేష్ ఖాన్‌, రజత్‌ పాటిదార్​ గ్రేడ్ Cలో స్థానం దక్కించుకున్నారు.

అందుకే అయ్యర్‌పై వేటు పడింది - అసలు కారణమిదే!

సెంట్రల్​ కాంట్రాక్ట్ నుంచి ఔట్​ - ఇషాన్, శ్రేయస్​కు కలిగే నష్టాలేంటి?

Last Updated :Mar 9, 2024, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.