ETV Bharat / sports

రోహిత్ ముంబయిని వదిలేస్తే బెటర్- ఆ జట్టులోకి వెళ్తే కెప్టెన్ అవుతాడు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 1:16 PM IST

Updated : Mar 11, 2024, 2:00 PM IST

Ambati Rayudu Rohit Sharma IPL
Ambati Rayudu Rohit Sharma IPL

Ambati Rayudu Rohit Sharma IPL: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ ఫ్యూచర్​ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Ambati Rayudu Rohit Sharma IPL: 2024 ఐపీఎల్​కు సమయం దగ్గర పడుతోంది. మరో 11 రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఇకఆయా ఆటగాళ్లు తమతమ ఫ్రాంచైజీ క్యాంప్​ల్లో చేరి ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్​ కెరీర్​పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడు చెన్నై సూపర్ కింగ్స్​ జట్టుకు మారితే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

2025లో ఐపీఎల్​ మెగా వేలం ఉండనుంది. అందులో ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్​ను వదిలేసి హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్​ను రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. దీంతో వచ్చే ఏడాది ధోనీ రిటైరైతే, రోహిత్ చెన్నై సూపర్ కింగ్స్​ జట్టుకు మారాలని సూచించాడు.

'రోహిత్ చాలాకాలం నుంచి ముంబయికి ఆడుతున్నాడు. ఇంకో 5-6 ఏళ్లపాటు క్రికెట్ ఆడగలడు. ఒకవేళ ధోనీకి ఇదే లాస్ట్ ఐపీఎల్​ అయితే, 2025 నుంచి రోహిత్ చెన్నై జట్టుకు ఆడాలని కోరుకుంటున్నా. అతడు చెన్నైకి ఆడితే బాగుంటుంది. అక్కడ అతడికి ఈజీగానే కెప్టెన్సీ లభిస్తుంది' అని రాయుడు ఓ సందర్భంలో అన్నాడు.

ఐపీఎల్​కు దూరం!: ఇక ధర్మశాల టెస్టులో రోహిత్ గాయపడ్డాడు. వెన్నునొప్పి బాధతో మూడో రోజు బరిలోకి దిగలేదు. ఆతడి స్థానంలో పేసర్ జస్ప్రత్ బుమ్రా జట్టును నడిపించాడు. ఇక టీమ్ఇండియాకు ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్​లు ఏమీ లేవు. జూన్​లో నేరుగా టీ20 వరల్డ్​కప్ ఆడాల్సి ఉంది. ఈ టోర్నీకి వెస్టిండీస్, యూఎస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. అయితే పొట్టికప్ టోర్నీ దృష్యా రోహిత్ 2024 ఐపీఎల్​కు విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ మేనేజ్​మెంట్​కు కూడా సమాచారం ఇచ్చాడట. ఇక త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. ఇక మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్​- రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు మ్యాచ్​తో ఐపీఎల్​ సీజన్- 17 ప్రారంభం కానుంది.

రోహిత్ రిటైర్మెంట్ ప్లాన్ రివీల్- ​2024 IPLకూ దూరం!

రోహిత్ చెప్పిన ఒక్క మాటతో సర్ఫరాజ్​ సేఫ్- లేకుంటే ప్రమాదమే!

Last Updated :Mar 11, 2024, 2:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.