ETV Bharat / sports

2027 వరల్డ్​కప్​ వేదికలు ఖరారు- సౌతాఫ్రికాలో 8 స్టేడియాల్లో మ్యాచ్​లు - 2027 Cricket World Cup Venue

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 8:37 PM IST

2027 Cricket World Cup Venue
2027 Cricket World Cup Venue

2027 Cricket World Cup Venue: 2027 వన్డే వరల్డ్‌ కప్‌కి దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే ఆతిథ్యం ఇస్తున్నాయి. తాజాగా వరల్డ్ కప్‌ జరిగే 8 వెన్యూలను దక్షిణాఫ్రికా ప్రకటించింది. అవేంటంటే?

2027 Cricket World Cup Venue: క్రికెట్​ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే వన్డే వరల్డ్​కప్​నకు యావక్ క్రీడాలోకం ఎదురుచూస్తుంటుంది. 2027లో జరగనున్న మెగా టోర్నమెంట్​కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 10న బుధవారం క్రికెట్ దక్షిణాఫ్రికా వన్డే ప్రపంచకప్ 2027కి ఎనిమిది వేదికలను ప్రకటించింది. జింబాబ్వే, నమీబియా నుంచి ఎటువంటి అప్‌డేట్ లేదు. అయితే జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో ఎక్కువ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఈ ఫేవరెట్‌ వెన్యూలోనే జాతీయ జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడుతుంది.

వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరిగే వెన్యూలు ఇవే!
దక్షిణాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫోలేట్సీ మోసెకి ప్రకారం, వేదికల ఎంపిక చాలా జాగ్రత్తగా జరిగింది. వేదిక లభ్యత, హోటళ్లు, విమానాశ్రయాల దూరం వంటి అంశాలను పరిగణించారు. ఐసీసీ గుర్తింపు పొందిన 11 స్టేడియంలు ఉన్నప్పటికీ, అందులో 8 వెన్యూలను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

వన్డే ప్రపంచ కప్ 2027 కోసం ఎంపిక చేసిన స్టేడియాల్లో, జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, డర్బన్‌లోని కింగ్స్‌మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్‌లోని బోలాండ్ పార్క్, కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్, బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్, ఈస్ట్‌ లండన్‌లోని బఫెలో పార్క్ ఉన్నాయి.

నమీబియా క్వాలిఫైయర్‌ ఆడాల్సిందే?
ఇదిలా ఉంటే, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఇప్పటికే తదుపరి వన్డే ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి. అయితే ఆతిథ్య దేశాల్లో ఒకటిగా ఉన్నాసరే, నమీబియా క్వాలిఫైయర్‌లను ఆడాల్సి ఉంటుంది. 2024 T20 వరల్డ్‌ కప్‌కి యూఎస్‌, కరేబియన్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు కావడంతో, క్వాలిఫైయర్‌లను ఆడకుండానే యూఎస్ అర్హత సాధించింది.

2027 వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌?
టోర్నమెంట్ 2027 అక్టోబర్, నవంబర్‌లో జరగాల్సి ఉంది. అయితే ఖచ్చితమైన తేదీలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇంకా ధృవీకరించలేదు. అదనంగా మునుపటి టోర్నమెంట్‌ల మాదిరిగా పది టీమ్‌లతో కాకుండా, ఇందులో 14 జట్లను ఏడు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు.

2025 IPL మెగా వేలం- ఫ్రాంచైజీ ఓనర్స్​ మీటింగ్ వాయిదా - Ipl 2025 Mega Auction

కథక్ వదిలి క్రికెటర్​గా - రుతురాజ్ వైఫ్​ ఆసక్తికర జర్నీ! - Ruturaj Gaikwad Wife

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.