ETV Bharat / spiritual

వినాయకుడిని ఈ 7 పత్రాలతో పూజిస్తే - మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి! - Offer Sacred Leaves to Lord Ganesh

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 2:01 PM IST

Offer These Sacred Leaves to Lord Ganesh : చాలా మందికి ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందాలంటే ఏ విధంగా పూజ చేయాలో తెలియదు. అలాంటి వారు.. ఈ 7 పవిత్రమైన ఆకులతో వినాయకుడిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

vinayaka
Lord Ganesh

Lord Ganesh Blessings Offer These Sacred Leaves : హిందువులు ఏ పని చేపట్టినా.. ముందుగా గణపతిని ఆరాధిస్తారు. అయితే.. చాలా మందికి గణపతి(Lord Ganesh) పూజ ఎలా చేయాలో తెలియదు. అలాంటి వారు.. ఈ 7 పత్రాలతో పూజిస్తే స్వామి ఆశీర్వాదం లభించడమే కాకుండా.. అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. ఆ పత్రాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గన్నేరు ఆకులు : నిరుద్యోగులుగా ఉన్నవారు వినాయకుడిని గన్నేరు ఆకులతో పూజించాలని సూచిస్తున్నారు. "వికాత్య నమః" అనే మంత్రాన్ని జపిస్తూ 5 గన్నేరు ఆకులను గణేశుడికి సమర్పించండి. దాంతో మీకు గణపతి ఆశీస్సులు లభించడమే కాకుండా ఉద్యోగం పొందే మార్గంలో ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోతాయట.

అర్జున చెట్టు ఆకులు : మద్ది చెట్టు ఆకులనే అర్జున పత్రాలంటారు. ఇవి మర్రి ఆకుల మాదిరిగానే ఉంటాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు.. పదకొండు అర్జున చెట్టు ఆకులతో పూజిస్తే, స్వామివారి ఆశీర్వాదం లభిస్తుందని చెబుతున్నారు. "కపిలాయ నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ ఆకులను సమర్పించాలి.

మొగలి ఆకులు : వీటినే కేతకి ఆకులు అని కూడా అంటాం. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గణేశుడి ఆశీస్సులు పొందడానికి.. 9 కేతకి ఆకులను సమర్పించండి. ఆ టైమ్​లో సిద్ధి వినాయకాయ నమః మంత్రాన్ని పఠించాలి. దీనివల్ల వ్యాపారం ఎలాంటి అడ్డంకులూ లేకుండా ముందుకు సాగుతుందంటున్నారు.

గణపతి విగ్రహాన్ని గిఫ్ట్‌గా ఇస్తున్నారా? - ఈ రూపంలోనివి ఇవ్వకూడదట!!

బిల్వ పత్రాలు : వీటినే మారేడు ఆకులు అంటాం. సంతాన లేమి సమస్యలతో ఇబ్బందిపడే వారు గణపతికి బిల్వ పత్రాలు సమర్పించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు."ఉంపుత్రయ్ నమః" అని పఠిస్తూ విఘ్నేశ్వరుడికి 7 మారేడు పత్రాలను సమర్పించడం ద్వారా స్వామివారి ఆశీస్సులు పొందడంతో పాటు మంచి ఫలితాలు లభిస్తాయంటున్నారు.

బిర్యానీ ఆకులు : సమాజంలో గౌరవం పొందాలంటే గణేశుడికి 7 బే ఆకులను సమర్పించి, "చతుర్హోతేరీ నమః" అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చంటున్నారు.

జిల్లేడు ఆకులు : ఆర్థికంగా మంచి పొజిషన్​ స్థిరపడాలని కోరుకునే వారు.. గణేశుడికి 9 జిల్లేడు పత్రాలను సమర్పించడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చంటున్నారు. పూజా సమయంలో "వినాయక నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ ఆకులను స్వామి వారికి సమర్పించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయని చెబుతున్నారు.

జమ్మి ఆకులు : మీరు మీ పనిలో ఏదైనా ఆటంకాలు ఎదుర్కొంటుంటే గణపతికి జమ్మి ఆకులు సమర్పిస్తే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు. "వక్రతుండాయ నమః" అనే మంత్రాన్ని పఠిస్తూ.. పదకొండు జమ్మి ఆకులను గణేశుడికి సమర్పించడం ద్వారా ఆటంకాలన్నీ తొలగిపోతాయట.

నోట్ : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

వినాయక పూజలో వాడే ప్రతుల్లోని ఔషధగుణాలు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.