ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి అన్నింట్లో విజయమే! ఉద్యోగులకు ప్రమోషన్! - Horoscope Today May 25th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 5:01 AM IST

Horoscope Today May 25th 2024 : మే​ 25న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today May 25th 2024
Horoscope Today May 25th 2024 (ETV Bharat)

Horoscope Today May 25th 2024 : మే​ 25న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు, ముఖ్యమైన కార్యక్రమాలు మొదలు పెట్టడానికి మంచి రోజు. వ్యాపారులకు వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా పలు ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సహోద్యోగుల సహకారంతో పట్టుదలతో అన్ని పనులు పూర్తి చేసి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్యంపట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ వ్యహారాల్లో శాంతంగా, సమయానుకూలంగా ఉండడం మంచిది. మరిన్ని మెరుగైన ఫలితాల కోసం శివ పంచాక్షరీ మంత్రం జపించండి.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపార రంగాల వారికి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇంటికి బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం నెలకొంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు స్థాన చలనం ఉండవచ్చు. కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆందోళన ఉండవచ్చు. దైవబలంతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు విశేషమైన ప్రయోజనాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి ఐశ్వర్య ప్రాప్తి ఉంది. మీలోని సానుకూల శక్తి కారణంగా చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. గృహంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధు మిత్రులతో విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీలక్ష్మీ ధ్యానం శుభప్రదం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యల చికాకు పెడతాయి. ఉద్యోగులు మొదలు పెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులపై సంతకాలు చేస్తారు. ఆస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శాంతి సౌఖ్యం నెలకొంటాయి. యోగా ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలు వేస్తారు. ఫలితాలు ఊహించనిది కన్నా మెరుగ్గా ఉంటాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గతంలో చేసిన తప్పిదాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆర్థికంగా అస్థిరత నెలకొంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేస్తే మంచిది. సన్నిహితులతో కోపాన్ని అదుపులో ఉంచుకొని మాట్లాడితే గొడవలు రావు. ప్రతికూల ఆలోచనలు వెడితే మంచిది. ఆరోగ్యం ఫర్వాలేదనిపిస్తుంది. హనుమాన్ చాలీసా పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తినిపుణులు, ఉద్యోగులు అనుకోని అవాంతరాల కారణంగా ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారులు ఆశించిన ఫలితాలను పొందుతారు. సన్నిహితుల సాంగత్యంలో ప్రశాంతత పొందుతారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. గణపతి ప్రార్థన మేలు చేస్తుంది.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అనవసర విషయాలు, అనుకోని సమస్యలు ఈ రోజు ఇబ్బంది పెడతాయి. సమస్యలకు మూలం తెలుసుకొని పరిష్కరించుకుంటే మంచిది. వ్యాపారులకు రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కోపాన్ని తగ్గించుకొని సహనంతో ఉంటే మంచిది. కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్త పడండి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి నిపుణులకు, వ్యాపారులకు కష్టే ఫలి అన్నట్లుగా ఉంటుంది. మనోబలంతో ముందుకెళ్తే విజయం మీదే! మీ లక్ష్యం చేరుకోడానికి కృషి అవసరం. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సుబ్రమణ్య స్వామి అష్టకం చదువుకుంటే శుభ ఫలితాలు ఉంటాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. వాహన ప్రమాదం ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి. వైద్య పరీక్షల నిమిత్తం ధనవ్యయం ఉంటుంది. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి అనుకూలమైన సమయం. ఆదిత్య హృదయం పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు ఫలప్రదంగా ఉంటుంది. గృహంలో సంతోషం నెలకొంటుంది. దూరప్రాంతాల నుంచి అందిన శుభవార్తలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ఉద్యోగులకు జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి రంగం వారికి లాభాల పంట పండుతుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశివారికి ఈ రోజు అదృష్ట దాయకంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి లక్ష్మీకటాక్షం, విజయసిద్ధి ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపుదల, ఆఫీసులో ప్రశంసల జల్లులూ ఉంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. కుటుంబంతో విహార యాత్రలకు వెళతారు. సంతానం అభివృద్ధి గర్వకారణం అవుతుంది. గణపతి ఆలయ సందర్శనం శుభప్రదం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. ఈ రోజు తీసుకునే అన్ని నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం చేకూరుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. రచయితలు, కళారంగం వారు విశేష ప్రతిభ చూపి సన్మాన సత్కారాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. మహాలక్ష్మి అష్టకం పఠిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.