ఆ రాశివారికి ఈరోజు పెళ్లి కుదిరే ఛాన్స్​- ఆ దేవుడిని పూజిస్తే మంచిది! - Horoscope Today March 30th 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 5:16 AM IST

Horoscope Today March 30th 2024

Horoscope Today March 30th 2024 : మార్చి 30న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today March 30th 2024 : మార్చి 30న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తితో ఉంటారు. దైవబలం రక్షిస్తోంది. భవిష్యత్ కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్ధికంగా అనుకూలంగా ఉంది. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోండి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈరోజు అనుకూలమైన రోజు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. దూరదేశాల నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభాలను కలిగిస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. అనుకోని ధనలాభం ఉంటుంది. ఖర్చులు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మొత్తానికి ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. శివధ్యానం మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ప్రతికూలతలు తొలగిపోతాయి. బాధ్యతగా ఉంటారు. సానుకూల దృక్పథంతో ముందుకెళితే విజయం మీదే! వినాయకుని ధ్యానం శుభప్రదం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈరోజు సామాన్యంగా ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య వాదోపవాదాలు జరుగుతాయి. ఆరోగ్యం సహకరించదు. తల్లి గారి అనారోగ్యం ఆందోళన కలిగించవచ్చు. నెగెటివ్ ఆలోచనలకు స్వస్తి చెప్పండి. ఇంటాబయటా ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమించడానికి ధ్యానం చేయండి. మానసిక ప్రశాంతత కోసం వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి.

.

కన్య (Virgo) : కన్య రాశి వారికి ఈరోజు చాలా బాగుటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్ధికంగా అనుకూలం. వృత్తి వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. కష్టకాలం నడుస్తోందని చెప్పాలి. స్థిరమైన నిర్ణయాలు తీసుకోడానికి ఇబ్బంది పడతారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది. మీ మొండి వైఖరి అందరినీ కష్టాల పాలు చేస్తుంది. మీ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యం అంత బాగుండదు. శనీశ్వరుని ధ్యానిస్తే మేలు.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. మిత్రుల సహకారం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ధనలాభం ఉంటుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. దుర్గా ధ్యానం శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. తొందరపడి ఇతరులను దుర్భాషలాడటం చేయకూడదు. లేదంటే చిక్కుల్లో పడతారు. మాటతీరు మార్చుకోకపోతే అబాసుపాలవుతారు. వినాయకుని ధ్యానం మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. అవివాహితులకు వివాహప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి బహుమతులు అందుకుంటారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఆంజనేయస్వామి దర్శనం చేస్తే మంచిది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. వృత్తివ్యాపారాల్లో రాణిస్తారు. అన్ని పనులు అనుకూలంగా జరుగుతాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. ఇది మీలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. సహోద్యోగుల సహకారం ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈరోజు అనుకూలంగా లేదు. పై అధికారులతో గొడవలకు దూరంగా ఉంటే మేలు. ప్రతికూల ఆలోచనలకు తావివ్వద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం సహకరించదు. ధన నష్టం ఉండవచ్చు. మెరుగైన ఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.