ETV Bharat / politics

'వివేకాను ఎవరు చంపారో జగన్​కు తెలుసు - నిందితుడిని పక్కనే పెట్టుకుని నాటకాలెందుకు?' - YS viveka murder Case

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 3:24 PM IST

tdp_leader_varla_ramaiah
tdp_leader_varla_ramaiah

Varla Ramaiah on Viveka murder case : తన బాబాయి వివేకానందరెడ్డి హంతకులెవరో జగన్​కు తెలియదా? నిందితులను కాపాడుతున్నది ఎవరో రాష్ట్ర ప్రజలకు తెలియదా? అని టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పేర్కొన్నారు. బాబాయిని చంపిన హంతకులను పక్కనే పెట్టుకుని జగన్​ నాటకాలు ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

Varla Ramaiah on Viveka murder case : వివేకానందరెడ్డిని చంపిన హంతకులు బయట తిరుగుతున్నారని జగన్ చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని తెలుగు దేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. బాబాయిని చంపిన హంతకులు జగన్ పక్కనే ఉన్నారని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. బాబాయి హంతకులను పట్టుకొని చట్టానికి అప్పగించండని చెప్పాల్సిన సీఎం.. సీబీఐ దర్యాప్తుకు అడుగడుగునా ఆటంకాలు కల్పించారని దుయ్యబట్టారు.

హూ కిల్డ్​ బాబాయ్ - నేటి వరకు దొరకని సమాధానం

దస్తగిరి అప్రూవర్‌గా మారినందుకు అతన్ని ముఖ్యమంత్రి హింసించలేదా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వివేకాను ఎవరు చంపారో జగన్​కు తెలుసని తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు. నిందితుడిని పక్కనే పెట్టుకుని నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. వివేకాను చంపిన వారికి శిక్ష వేయించాలనే ఉద్దేశం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. వివేకాను చంపిన వారిని జగన్ కాపాడుతున్నారని ఆరోపించారు.

వైఎస్​ వివేకా హత్యపై జగన్​ వ్యాఖ్యలు - దెయ్యాలు వేదాలు వల్లించడమంటే ఇదేనేమో ! - Jagan on YS Viveka Murder Case

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరిని మాయచేయాలని జగన్‌ చూస్తున్నారు? అని టీడీపీ పొలిట్​ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (TDP politburo member Varla Ramaiah) ప్రశ్నించారు. జగన్‌ చెప్పే అబద్దాలు ప్రజలు నమ్ముతారా?, వివేకాను ఎవరు చంపారో జగన్‌కు తెలియదా? అని నిలదీశారు. వివేకాను ఎవరు చంపారో దేవుడికే తెలుసని అంటున్న జగన్​ అవినాష్‌ను పక్కనే పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

'నా' అన్నాడంటే నాశనమే - జగన్​ తడిగుడ్డతో గొంతులు కోస్తాడు : పిల్లి మాణిక్యరావు - TDP Leader Manikya Rao on Jagan

వివేకానంద రెడ్డిని చంపేస్తారనే విషయం జగన్‌కు ముందే తెలుసని వర్ల రామయ్య అన్నారు. వివేకాను చంపిన వారికి శిక్ష వేయించాలనే ఉద్దేశం జగన్‌కు ఉందా? అని ప్రశ్నించారు. జగన్‌ నటుడని తెలుసు కానీ ఇంత పెద్ద నటుడని మాకు తెలియదు అని ఎద్దేవా చేశారు. వివేకాను ఎవరు, ఎందుకు, ఎలా చంపారో జగన్‌కు తెలుసు , వివేకాను చంపిన వారు బయట లేరు జగన్‌ ఆధీనంలో ఉన్నారని పేర్కొన్నారు. వివేకాను చంపిన వారిని జగన్‌ కాపాడుతున్నారని చెప్తూ, ముద్దాయిని పట్టుకోడానికి పోలీసులకు జగన్‌ సహకరించారా? అని ప్రశ్నించారు.

హత్యా రాజకీయాలు చేస్తున్న జగన్​కు ఓటేయొద్దు: దస్తగిరి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు నిందితులు కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి హాజరయ్యారు. తదుపరి విచారణను ఏప్రిల్ 12కు సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

హంతకుల పార్టీకి ఓటేయొద్దు- జగనన్న పార్టీ గెలవొద్దు: వైఎస్ సునీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.