విశాఖ ఘటన ప్రసారం - ఈటీవీ, ఏబీఎన్‌ ప్రతినిధులపై పోలీసుల కేసు - CASE REGISTERED ON MEDIA

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 12:18 PM IST

thumbnail
విశాఖ ఘటన ప్రసారం - ఈటీవీ, ఏబీఎన్‌ ప్రతినిధులపై కేసు నమోదు (ETV Bharat)

Visakha Incident Broadcast Case Registered against Media : విశాఖ బర్మా క్యాంపు వద్ద సుంకర ధనలక్ష్మి, ఆమె కుమార్తె నూకరత్నం, కుమారుడు మణికంఠపై దాడి ఘటన ప్రసారం చేసిన మీడియాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనను ప్రసారం చేసినందుకు ఈటీవీ, ఏబీఎన్ ప్రతినిధులపైనా బాధితులతో కలిసి ప్రెస్ మీట్ లో మాట్లాడినందుకు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుపైనా ఈ నెల 17న కంచరపాలెం పోలీసుస్టేషన్ లో కేసు పెట్టారు.

వ్యక్తుల మధ్య గొడవను వర్గాల మధ్య వైరంగా సృష్టించడంతో పాటు నిందితుడిని వైఎస్సార్సీపీ వ్యక్తిగా, బాధితులు టీడీపీ వారిగా ప్రసారం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచి శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని మీడియా ప్రతినిధులకు సీఆర్​పీసీ 91 సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చారు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు తమ ముందు హాజరు కావాలని శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు నోటీసులు ఇవ్వడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.