ETV Bharat / politics

మాఫియా నేత కావాలా? ప్రజా సేవ చేసే నాయకులు కావాలా?: చంద్రబాబు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 3:25 PM IST

Updated : Feb 28, 2024, 8:23 PM IST

TDP Jansena Election Campaign Meeting Live Updates: తెలుగుదేశం- జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. నేడు తాడేపల్లిగూడెం వేదికగా తొలి బహిరంగ సభ నిర్వహించనున్నాయి. బహిరంగ వేదికపై తొలిసారి చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పాల్గొననున్నారు.

TDP_Jansena_Election_Campaign_Meeting_Live_Updates
TDP_Jansena_Election_Campaign_Meeting_Live_Updates

TDP Jansena Election Campaign Meeting Live Updates: తెలుగుదేశం- జనసేన కూటమి కలిసికట్టుగా తొలిసారి ప్రచార సమరశంఖం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే సగానికిపైగా అభ్యర్థులను ప్రకటించి అధికారపార్టీకి సవాల్ విసిరిన కూటమి ఇప్పుడు ఉమ్మడి బహిరంగ సభ నిర్వహణ ద్వారా శ్రేణులు కలిసి కదనరంగంలోకి దూకేలా దిశా నిర్దేశం చేయనున్నాయి.

  • పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నా: పవన్‌
  • 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించింది: పవన్‌
  • బలి చక్రవర్తి కూడా వామనున్ని చూసి ఇంతేనా అన్నారు: పవన్‌
  • నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసింది: పవన్‌
  • జగన్‌ను అధ:పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్‌ కాదు: పవన్‌
  • కార్యకర్తలారా వ్యూహం నాకు వదలండి.. నన్ను నమ్మండి: పవన్‌
  • గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే: పవన్ కల్యాణ్‌
  • అంకెలు లెక్కపెట్టవద్దని విపక్షాలకు చెప్పండి: పవన్‌ కల్యాణ్‌
  • 25 కిలోల బియ్యం ఇచ్చేందుకు కాదు: పవన్‌ కల్యాణ్‌
  • 25 ఏళ్ల భవిష్యత్తు ఇచ్చేందుకు నేను ఉన్నా: పవన్‌ కల్యాణ్‌
  • చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: పవన్‌ కల్యాణ్
  • నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి చంద్రబాబు: పవన్‌ కల్యాణ్‌
  • ప్రజల భవిష్యత్తు కోసం రోడ్లపైకి వచ్చాను: పవన్‌ కల్యాణ్‌
  • రెండు చోట్ల ఓడిపోయాననే నిరాశ నాలో ఉంది: పవన్‌ కల్యాణ్‌
  • కోట్లు సంపాదించే స్కిల్స్‌ ఉన్నా అన్నీ కాదనుకుని వచ్చా: పవన్‌
  • గూండా ఎమ్మెల్యేలకు ఎలాంటి కండక్ట్‌ సర్టిఫికెట్లు అక్కర్లేదు: పవన్‌
  • యువత ఉద్యోగాల కోసం మాత్రం కండక్ట్‌ సర్టిఫికెట్లు కావాలి: పవన్‌
  • మన కండక్ట్‌ ఇచ్చే నాయకులు.. మన కంటే ఉన్నతంగా ఉండాలి: పవన్‌
  • జగన్‌ ఇచ్చేది చేయూత కాదు.. చేతివాత: పవన్‌ కల్యాణ్‌
  • తాను ఒక్కడినే అంటున్న జగన్‌.. మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారు: పవన్‌
  • నా నిర్ణయాలు పార్టీ, వ్యక్తి పరంగా ఉండవు.. రాష్ట్ర లబ్ధి కోసమే ఉంటాయి: పవన్‌
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజకీయాలు చేశాం: పవన్‌
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసమే పొత్తులు పెట్టుకున్నాం: పవన్‌
  • తెదేపా-జనసేన సహకరించుకుంటేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుంది: పవన్‌
  • సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఇద్దాం: పవన్‌ కల్యాణ్‌
  • అన్ని వర్గాలను జగన్‌ మోసం చేశారు: పవన్‌ కల్యాణ్‌
  • పర్వతం ఎవరికీ వంగి సలాం చేయదు: పవన్‌ కల్యాణ్‌
  • గొంతు ఎత్తితే ఒక దేశపు జెండాకు ఉన్నంత పొగరు ఉంది: పవన్‌
  • మన విజయానికి స్ఫూర్తి జెండా.. అందుకే జెండా పేరుతో సభ: పవన్‌
  • ఏపీ రోడ్లపై వెళ్లాలంటే రోజులు గడిచిపోయే పరిస్థితి: పవన్‌
  • నడమంత్రపు సిరి వెనక ఒక నేరం ఉంటుంది: పవన్‌
  • ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల ప్రజలు తిప్పలు పడుతున్నారు: పవన్‌
  • వైకాపా గూండాయిజానికి కార్యకర్తలు భయపడవద్దు: పవన్‌
  • మా సభలు, నాయకులపై వైకాపా గూండాలు దాడి చేస్తే మక్కెలు విరగ్గొడతాం: పవన్‌
  • రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఐదుగురు రెడ్లే పంచాయితీ చేస్తున్నారు: పవన్‌
  • జగన్‌ పాలన అట్టర్‌ఫ్లాప్‌ సినిమా: చంద్రబాబు
  • అట్టర్‌ఫ్లాప్‌ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందా?: చంద్రబాబు
  • వైకాపా గూండాలకు రియల్‌ సినిమా చూపిస్తాం: చంద్రబాబు
  • తెదేపా-జనసేన కూటమి సూపర్‌ హిట్‌: చంద్రబాబు
  • రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్‌స్టాప్‌: చంద్రబాబు
  • తెదేపా-జనసేన విన్నింగ్‌ టీమ్‌.. వైకాపా చీటింగ్‌ టీమ్‌: చంద్రబాబు
  • తెదేపా అగ్నికి పవన్‌ కల్యాణ్‌ వాయువులా తోడయ్యారు: చంద్రబాబు
  • రాష్ట్ర భవిష్యత్తు కోసమే తెదేపా-జనసేన కలయిక: చంద్రబాబు
  • ఈ సభ చూశాక మా గెలుపు ఎవరూ ఆపలేరని అర్థమైంది: చంద్రబాబు
  • మాఫియా నేత కావాలా? ప్రజా సేవ చేసే నాయకులు కావాలా?: చంద్రబాబు
  • తెలుగుజాతిని ప్రపంచంలో నంబర్‌వన్‌గా చేయాలి: చంద్రబాబు
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం: చంద్రబాబు
  • వైనాట్‌ 175 కాదు.. వైనాట్‌ పులివెందుల: చంద్రబాబు
  • హూకిల్డ్‌ బాబాయ్‌.. జగన్‌ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
  • 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు.. తెచ్చారా: చంద్రబాబు
  • కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్‌ నాటకాలు వేశారు: చంద్రబాబు
  • కుప్పంలో ఒక్క రోజులోనే అంతా సర్దుకుని పోయారు: చంద్రబాబు
  • కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుంది: చంద్రబాబు
  • వైకాపా వేధింపులు తట్టుకోలేక హనుమ విహారి పారిపోయే పరిస్థితి: చంద్రబాబు
  • సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్‌ మీడియాలో వేధించారు: చంద్రబాబు
  • జగన్‌ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనం: చంద్రబాబు
  • అందరినీ అణచివేయడమే జగన్‌ ఆదర్శంగా పెట్టుకున్నారు: చంద్రబాబు
  • వైకాపాను చిత్తుగా ఓడించి సైకో నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి: చంద్రబాబు
  • కులాలు, ప్రాంతాలు, వర్గాలుగా విభజించి పాలిస్తున్నారు: చంద్రబాబు
  • అధికారం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: చంద్రబాబు
  • ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు తమ్ముళ్లకు ఉంది: చంద్రబాబు
  • రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో ముందుకెళ్లాం: చంద్రబాబు
  • 2029కి విజన్‌ డాక్యుమెంట్‌ తయారు చేశాం: చంద్రబాబు
  • హైదరాబాద్‌ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన: చంద్రబాబు
  • పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లాం: చంద్రబాబు
  • రాష్ట్రంలో సైకో పాలన ఉంది: చంద్రబాబు
  • ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారు: చంద్రబాబు
  • జగన్‌ సీఎం అయ్యాక ప్రజా వేదిక కూల్చి పాలన ప్రారంభించారు: చంద్రబాబు
  • ప్రజాస్వామ్యాన్ని జగన్‌ అపహాస్యం చేశారు: చంద్రబాబు
  • తెదేపా-జనసేన విజయకేతనం జెండా సభ ఇది: చంద్రబాబు
  • వైకాపా దొంగలపై తెదేపా-జనసేన పోరాడాలి: చంద్రబాబు
  • రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రెండు పార్టీలు కలిశాయి: చంద్రబాబు
  • రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పార్టీని ప్రజలు తరిమికొట్టాలి: చంద్రబాబు
  • వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం: చంద్రబాబు
  • ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల కోసం చేతులు కలిపాం: చంద్రబాబు
  • విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు చేతులు కలిపాం: చంద్రబాబు
  • హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చేతులు కలిపాం: చంద్రబాబు
  • వైకాపా విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసమే తెదేపా-జనసేన పొత్తు: చంద్రబాబు
  • రాష్ట్రం కోసం ప్రజలు కుదిర్చిన పొత్తు ఇది: చంద్రబాబు
  • రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మాతో చేతులు కలపాలి: చంద్రబాబు
  • తెదేపా-జనసేన సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది: అచ్చెన్న
  • సిద్ధమా అని రోడ్డెక్కిన వ్యక్తికి యుద్ధం చేసి ఓడించేందుకు సభ తొలి అడుగు: అచ్చెన్న
  • కార్మికుడి నుంచి పారిశ్రామికవేత్త వరకు కోరుకున్న పొత్తు ఇది: అచ్చెన్న
  • జగన్‌ పాలనలో మోసపోయిన రైతులు, మహిళలు కోరుకున్న పొత్తు: అచ్చెన్న
  • రెండు పార్టీలు కలిసి పనిచేస్తే 160 స్థానాల్లో ఘన విజయం లభిస్తుంది: అచ్చెన్న
  • రైతు వ్యతిరేక విధానాలతో జగన్‌ పాలిస్తున్నారు: నిమ్మల
  • రైతులు వ్యవసాయం చేయలేమనే స్థితికి వచ్చారు: నిమ్మల
  • జగన్‌ రైతు వ్యతిరేక విధానాలతో పంట విరామం చేపట్టే పరిస్థితి: నిమ్మల
  • రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది: నిమ్మల
  • తెదేపా-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది: నిమ్మల
  • జగన్‌ ప్రభుత్వం చేసిన దోపిడీ, లూటీని వెనక్కి కక్కిస్తాం: నిమ్మల
  • ఎన్టీఆర్‌ విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారు: బాలకృష్ణ
  • బడుగు బలహీన వర్గాలకు అధికార పీఠం పైకి ఎక్కించారు: బాలకృష్ణ
  • తెదేపాకు ఉన్న బలం.. పార్టీ కార్యకర్తలే: బాలకృష్ణ
  • వైకాపా ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది: బాలకృష్ణ
  • వైకాపా ప్రభుత్వం రైతు ఉనికే లేకుండా చేస్తోంది: బాలకృష్ణ
  • రాష్ట్రాన్ని కులాలు, మతాల పేరుతో చిచ్చుపెడుతున్నారు: బాలకృష్ణ
  • వచ్చే ఎన్నికల్లో తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది: బాలకృష్ణ
  • ఓటు ఆయుధాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: బాలకృష్ణ
  • రాష్ట్ర భవిష్యత్తు కోసం తెదేపా-జనసేన కూటమిని ఆశీర్వదించాలి: బాలకృష్ణ
  • రైతు వ్యతిరేక విధానాలతో జగన్‌ పాలిస్తున్నారు: నిమ్మల
  • రైతులు వ్యవసాయం చేయలేమనే స్థితికి వచ్చారు: నిమ్మల
  • జగన్‌ రైతు వ్యతిరేక విధానాలతో పంట విరామం చేపట్టే పరిస్థితి: నిమ్మల
  • పెట్టుబడి రాయితీ ఎత్తేశారు.. యాంత్రీకరణకు కోతపెట్టారు: నిమ్మల
  • రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది: నిమ్మల
  • సభకు ఎందుకు వచ్చాననే అనుమానం అందరికీ కలుగుతుంది: రఘురామ
  • చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కృష్ణార్జునుల్లా కలిశారు: రఘురామ
  • కురుక్షేత్రంలో 151 మంది అభినవ కౌరవులను తుదముట్టిస్తారు: రఘురామ
  • దుర్మార్గ పాలన అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి: రఘురామ
  • సర్వనాశనం చేసిన వ్యక్తి చరిత్రపుటల్లో కలిసే సమయం వచ్చింది: రఘురామ
  • తాడేపల్లిగూడెం సభా వేదికపైకి కలిసి వచ్చిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌
  • పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం నింపిన చంద్రబాబు, పవన్‌
  • పరస్పరం మార్చుకుని పార్టీ జెండాలు ఊపిన చంద్రబాబు, పవన్‌
  • తెదేపా-జనసేన జెండాల రెపరెపలతో కళకళలాడిన సభా ప్రాంగణం
  • ఉమ్మడి సభకు పెద్దఎత్తున తరలివచ్చిన తెదేపా-జనసేన శ్రేణులు
  • సభా వేదికపై ఉన్న ఇరుపార్టీల నేతలతో చంద్రబాబు, పవన్‌ కరచాలనం
  • ఐదేళ్లు రాష్ట్ర ప్రజలను జగన్‌ మోసం చేశారన్న జనసేన
  • వైకాపా మరోసారి వస్తే పొట్ట చేతిలో పట్టుకుని వలస వెళ్లే పరిస్థితి అంటూ ఆగ్రహం
  • అన్ని వర్గాలను నాశనం చేసిన ఘనత జగన్‌దే అంటూ విమర్శ

  • తాడేపల్లిగూడెంలో తెదేపా-జనసేన ఉమ్మడి బహిరంగ సభ
  • తాడేపల్లిగూడెం చేరుకున్న చంద్రబాబు, బాలకృష్ణ
  • తాడేపల్లిగూడెం చేరుకున్న పవన్ కల్యాణ్, నాగబాబు
  • తెదేపా-జనసేన తొలి ఉమ్మడి సభకు 'జెండా' పేరు ఖరారు
  • ఇరుపార్టీల శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌
  • 99 మంది అభ్యర్థులను ప్రకటించాక తొలి ఉమ్మడి సభ
  • ఉమ్మడి సభకు పెద్దఎత్తున తరలివస్తున్న ఇరుపార్టీల శ్రేణులు
  • తెదేపా-జనసేన శ్రేణుల వాహనాలను 2 కి.మీ దూరంలో ఆపుతున్న పోలీసులు
  • అడ్డంకులను ఛేదించుకుని సభాస్థలికి చేరుకుంటున్న తెదేపా-జనసేన శ్రేణులు
  • సభా వేదికపై దాదాపు 500 మంది ఆసీనులయ్యేలా ఏర్పాట్లు
  • తాడేపల్లిగూడెం సభా ప్రాంగణంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు
Last Updated :Feb 28, 2024, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.