ETV Bharat / politics

రంగుల పిచ్చితో చేసిన ఖర్చుతో ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి: పవన్‌ కల్యాణ్‌ - Pawan Kalyan Yatra

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 9:39 PM IST

Updated : May 2, 2024, 10:59 PM IST

Pawan Kalyan Varahi Vijayabheri Yatra in Palakonda: రంగుల పిచ్చితో వైసీపీ సర్కార్ 2,300 కోట్లు దుబారా చేసిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్‌ ప్రసంగించారు. సిక్కోలు యువత జై ఉత్తరాంధ్ర అంటే సరిపోదన్న పవన్ అన్యాయంపై తిరగబడాలని పిలుపునిచ్చారు.

pawan_kalyan_yatra
pawan_kalyan_yatra (ఈటీవీ భారత్ ప్రత్యేకం)

రంగుల పిచ్చితో చేసిన ఖర్చుతో ఉత్తరాంధ్రలో పలు ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి: పవన్‌ కల్యాణ్‌ (ఈటీవీ భారత్ ప్రత్యేకం)

Pawan Kalyan Varahi Vijayabheri Yatra in Palakonda: ఉత్తరాంధ్ర జానపదాలు నా గుండేల్లో పొంగుతాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఆగడాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యంజిల్లా పాలకొండలో వారాహి విజయభేరి యాత్రలో పవన్ పాల్గొన్నారు. అరకు పార్లమెంట్, పాలకొండ అసెంబ్లీ కూటమి అభ్యర్ధులు కొత్తపల్లి గీత, నిమ్మక జయకృష్ణకు మద్దతుగా చేపట్టిన ఈ కార్యక్రమంలో తొలుత పవన్ రోడ్డు షో నిర్వహించారు. పాలకొండలోని వీరఘట్టం రోడ్డు నుంచి పట్టణంలోని వడమ కూడలి వరకు జరిగిన రోడ్డు షో జనసందోహంగా మారింది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నుంచి పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొని పవన్​కు ఘన స్వాగతం పలికారు.

ల్యాండ్ టైటిలింగ్ చట్టం- భూ కబ్జాదారుల చుట్టమా? - Lawyers on Land Titling Act

రంగుల కోసం వైసీపీ 2వేల కోట్లు ఖర్చు చేసిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఆ మొత్తంలో కొంత ఈ ప్రాంతంలో ఖర్చు చేసి ఉంటే తోటపల్లి ప్రాజెక్ట్ పూర్తయ్యేదని తెలిపారు. ఉత్తరాంధ్ర అంటే నాకు పంచ ప్రాణాలని సిక్కోలు, ఉత్తరాంధ్ర జానపదాలు నా గుండేల్లో పొంగుతాయన్నారు. ఉత్తరాంధ్రలో భగ భగ మండే యువత ఉందని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 60 రూపాయల మద్యాన్ని 200కి పెంచిందని అన్నారు. ఇక్కడి నాగవళి, వంశదార నదుల నుంచి వైసీపీ నేతలు ఇసుకను అడ్డంగా దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రెగిపోయిన పేర్ని కిట్టు అనుచరులు - జనసేన నేత ఇంటిపై దాడి - Perni Kittu Follower Attack

ఉత్తరాంధ్రను వైసీపీ అడ్డంగా దోచుకుంటున్నారని పవన్ అన్నారు. మన్యం జిల్లా రైతులు ఏనుగుల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారని వారికి జగన్ ప్రభుత్వం సరైన పంట నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు ఊసే లేదని అన్నారు. తండ్రిలేని బిడ్డను ఒక్క చాన్స్, ఒక్క చాన్స్ అన్నాడు ఆ ఒక్క చాన్స్ ఇచ్చారని ఇక చాలని అన్నారు. జగన్ దాష్టికానికి బలైన మొదటి మహిళ కొత్త పల్లి గీత అని పవన్ గుర్తు చేశారు. ఇలాంటి సందర్భాల్లో అన్యాయాన్ని ఎదిరించాలని వైసీపీ దాష్టికాలపై ఉద్యమించాలని పవన్ పిలుపునిచ్చారు.

విజయవాడ వాసుల నీటి వ్యధ - అయిదేళ్లూ మొద్దు నిద్రలోనే జగన్ సర్కార్​! - Drinking Water problem

కూటమి ప్రభుత్వం రాగానే సీతంపేటలో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రిలో పూర్తి చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెలిపారు. ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ఏనుగుల దాడుల్లో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందచేస్తామని హామి ఇచ్చారు. పాలకొండ నియోజకవర్గంలో పర్యాటక ప్రాంతాలు అధికమని ఈ ప్రాంతాలన్నింటీని పర్యాటకంగా అభివృద్ధి చేసి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని అన్నారు. సీతంపేట మండలం భామినిలో తాగునీటి సమస్య అధికంగా ఉందని కొత్తపల్లి గీతను గెలిపిస్తే ఎంపీ నిధులతో ఆ సమస్య తీరుస్తామన్నారు. పాలకొండను బంగారు కొండగా చేస్తామని పవన్ తెలియచేశారు.

Last Updated :May 2, 2024, 10:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.