ETV Bharat / politics

'వేరుశనగ రైతుల సమస్య పరిష్కరించండి - పంటల బోనస్‌పై క్లారిటీ ఇవ్వండి'

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 15, 2024, 3:29 PM IST

MLC Kavitha on Groundnut Farmers Protest : గత కొన్ని రోజులుగా ఉమ్మడి పాలమూరు జిల్లా వేరుశనగ రైతులు గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్నారని, వారి సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. రైతుల సమస్యలు, పంటలపై బోనస్, సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు గురించి శాసనమండలిలో ఆమె మాట్లాడారు.

MLC Kavitha on Groundnut Farmers Protest
MLC Kavitha on Groundnut Farmers Protest

MLC Kavitha on Groundnut Farmers Protest : తెలంగాణ శాసనసభ సమావేశాలు ఏడోరోజు కొనసాగుతున్నాయి. ఓవైపు శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం కాగ్ నివేదిక ప్రవేశపెట్టింది. మరోవైపు శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు(Telangana Thalli Statue Issue)పై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో రాచరికపు ఆనవాళ్లు ఏం ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇటీవల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వేరుశనగ రైతులు గిట్టుబాటు ధర కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రైతుల సమస్యను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సభ దృష్టికి తీసుకువెళ్లారు. రైతులకు గిట్టుబాట ధర కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు. కర్షకులకు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్ చేశారు.

వేరుశనగ రైతుల ఆందోళనలు - గిట్టుబాటు ధర ఇవ్వాలంటూ డిమాండ్

MLC Kavitha On Groundnut farmers Issue : వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించక పోవడంతో పాటు అచ్చంపేట, నాగర్ కర్నూల్‌, జడ్చర్ల వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనల(Groundnut Farmers Protest in Mahabubnagar)పై కవిత స్పందించారు. వేరుశనగ కనీస మద్దతు ధర 6377 రూపాయలు ఉండగా 4నుంచి 5వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించడానికి శాసనమండలి ఛైర్మన్ అనుమతిని కోరారు. అలాగే ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు గిట్టుబాటు ధర, బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చారని, వాటిపైనా క్లారిటీ ఇవ్వాలని కోరారు.

అయితే దీనిపై రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ, మార్కెట్‌లో రైతుల నిరసన వాస్తవమేనని, దానికి దారి తీసిన పరిస్థితుల గురించి ఆరా తీశామని తెలిపారు. రైతులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు పంటలపై బోనస్ గురించి మాట్లాడుతూ కేవలం ధాన్యానికి మద్దతు ధర పలకకపోతే వరి ధాన్యంపైన మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చామని మంత్రి వెల్లడించారు.

గిట్టుబాటు ధర కోసం భగ్గుమన్న వేరుశనగ రైతులు - మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌పై దాడి

అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సచివాలయ ప్రాంగణంలో రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటు అంశంపై మాట్లాడటానికి మండలి ఛైర్మన్ అనుమతి కోరారు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం సచివాలయ ప్రాంగణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదని తెలిపారు. దేశాలనికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల తమకు అపారమైన గౌరవం ఉందని, కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

వేరుశనగ రైతుల సమస్య పరిష్కరించండి

రైలు రోకోకు రైతులు పిలుపు- 4 గంటలపాటు ట్రైన్లు బంద్​, చర్చలు ఫలించేనా?

'మా డిమాండ్లన్నీ పాతవే'- కేంద్రంతో చర్చలకు రైతులు సై- కర్షకులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.