ETV Bharat / politics

హిందూపురంలో బీసీ ఓటర్లే బలం - సైకిల్​ జైత్రయాత్ర సాగించిన ఎన్టీఆర్​ - Hindupur LOK SABHA ELECTIONS

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 1:06 PM IST

Hindupur Lok Sabha Constituency: హిందూపురం రాజకీయంగా పలుకుబడి కలిగిన పట్టణం, ప్రముఖ వర్తక కేంద్రం. ఈ గ్రామాన్ని కట్టించిన మరాఠా యోధుడు మురారి రావు తన తండ్రి హిందూరావు పేరిట హిందూపురం అని పేరు పెట్టినట్టు చరిత్రకారుల అభిప్రాయం. సుప్రసిద్ధ లేపాక్షి (లే పక్షి) హిందూపురంలో ఉంది. ఇక్కడి స్పిన్నింగ్​ మిల్లులు స్థానికంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

Hindupur_Lok_Sabha_Constituency
Hindupur_Lok_Sabha_Constituency

Hindupur Lok Sabha Constituency: హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. అంతకు ముందు 1952లో జరిగిన మొదటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో పెనుకొండ పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండేది. ప్రజాపార్టీకి చెందిన కె.ఎస్. రాఘవాచారి తొలిసారి ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1957లో లోక్​సభ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం ఇది జనరల్‌ కేటగిరీలో ఉంది.

టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురం పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న బీసీలు ఆ పార్టీకి కంచుకోటగా నిలిచారు. సైకిల్‌ జైత్రయాత్ర ఈ సారి కొనసాగుతుందో లేదో వేచి చూడాల్సిందే.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు:

ప్రస్తుతం ఈ లోక్‌సభ పరిధిలో 7అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

  1. హిందూపురం
  2. మడకశిర (ఎస్సీ)
  3. పెనుకొండ
  4. రాప్తాడు
  5. ధర్మవరం
  6. కదిరి
  7. పుట్టపర్తి

రాప్తాడు నియోజకవర్గం ఒక్కటే అనంతపురం జిల్లా పరిధిలో ఉండగా, మిగిలిన నియోజకవర్గాలన్నీ శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోనే ఉన్నాయి.

2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు:

  • మొత్తం ఓటర్ల సంఖ్య- 16.41 లక్షలు
  • ఓటర్లలో పురుషుల సంఖ్య- 8.20 లక్షలు
  • మహిళా ఓటర్ల సంఖ్య- 8.21 లక్షలు
  • ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య- 76

ఈ లోక్​సభ నియోజకవర్గంలో ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో 10సార్లు కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగా, 5సార్లు టీడీపీ గెలుపొంది జెండా ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో టీడీపీకి చెందిన నిమ్మల కిష్టప్పపై వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్‌ విజయం సాధించారు.

ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే: ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి బరిలో నిలిచారు. బీసీ(కురుబ) సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి అనంతపురం జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌గా, హిందూపురం ఎంపీగా, 2సార్లు పెనుగొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. వాల్మీకి(బోయ) సామాజిక వర్గానికి చెందిన జోలదరాశి శాంతను వైసీపీ బరిలో దింపింది. 2009-2014 మధ్య కాలంలో ఆమె బీజేపీ తరఫున బళ్లారి ఎంపీగా చేశారు. జోలదరాశి శాంత సోదరుడు బి. శ్రీరాములు కర్ణాటక మంత్రిగా పని చేశారు.

Hindupur_Lok_Sabha_Constituency
ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు:

  • 1957: కె.వి.రామకృష్ణారెడ్డి(కాంగ్రెస్‌)
  • 1962: కె.వి.రామకృష్ణారెడ్డి(కాంగ్రెస్‌)
  • 1967: నీలం సంజీవరెడ్డి(కాంగ్రెస్‌)
  • 1971: పి.బాయపరెడ్డి(కాంగ్రెస్‌)
  • 1977: పి.బాయపరెడ్డి(కాంగ్రెస్‌)
  • 1980: పి.బాయపరెడ్డి(కాంగ్రెస్‌)
  • 1984: కె.రామచంద్రారెడ్డి(కాంగ్రెస్‌)

ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:

  • 1989: సానిపల్లి గంగాధర(కాంగ్రెస్‌)- జి. రామన్న చౌదరి(టీడీపీ)
  • 1991: సానిపల్లి గంగాధర(కాంగ్రెస్‌)- ఎస్. రామచంద్రారెడ్డి(టీడీపీ)
  • 1996: ఎస్.రామచంద్రారెడ్డి(టీడీపీ)- ఎస్. గంగాధర(కాంగ్రెస్)
  • 1998: సానిపల్లి గంగాధర(కాంగ్రెస్‌)- ఎస్. రామచంద్రారెడ్డి(టీడీపీ)
  • 1999: బి.కె.పార్థసారథి(టీడీపీ)- ఎస్. గంగాధర(కాంగ్రెస్)
  • 2004: జి.నిజాముద్దీన్(కాంగ్రెస్‌)- బి.కె పార్థసారథి(టీడీపీ)
  • 2009: నిమ్మల కిష్టప్ప(టీడీపీ)- పి.ఖాసిం ఖాన్(కాంగ్రెస్)
  • 2014: నిమ్మల కిష్టప్ప(టీడీపీ)- దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి(వైఎస్సార్సీపీ)
  • 2019: కురవ గోరంట్ల మాధవ్‌(వైసీపీ)- నిమ్మల క్రిష్టప్ప(టీడీపీ)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.