గిరిజనుల దాహం తీరింది- 'ఈటీవీ భారత్'​ కథనంపై స్పందించిన కలెక్టర్ - Collector Solve the Water Problem

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 2:00 PM IST

thumbnail
గిరిజనుల దాహం తీరింది- 'ఈటీవీ భారత్'​ కథనంపై స్పందించిన కలెక్టర్ (ETV Bharat)

Water Problem Solved Was Story on ETV Bharat: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తూరు గిరిజన గ్రామంలో ఎట్టకేలకు తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. గత కొద్ది రోజులుగా గిరిజనులు తాగు నీటి సమస్యతో అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచినీటి పైపులైన్లు లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బంది పడేవారు. దీంతో నీటి సమస్యపై ఈటీవీ భారత్​లో కథనం రావటంతో అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి స్పందించారు.

Collector React With Story And Order to Officials: తక్షణమే మంచినీటి సమస్య పరిష్కరించాలంటూ ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ సూర్యనారాయణ, ఏఈ చంద్రశేఖర్​ను ఆదేశించారు. కలెక్టర్​ ఆదేశాల మేరకు ఆగమేఘాలపై అధికారులు కొత్తూరు గ్రామానికి చేరుకుని తాగునీటి పైప్‌ లైన్‌ మరమ్మతులు చేయించి గ్రామస్థులకు మంచినీటిని అందించారు. నీటి సమస్య పరిష్కారం కావటంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా నీరు లేక ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్​ ఆదేశాలతో అధికారులు సమస్యను పరిష్కరించారని సర్పంచి దమ్మంగి బోడమ్మ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.