ETV Bharat / politics

తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్ - లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 4:46 PM IST

Updated : Mar 5, 2024, 6:38 PM IST

BRS BSP Alliance in Telangana Lok Sabha Polls 2024 : తెలంగాణ లోక్‌సభ ఎన్నికల రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో కలిసి పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ అయి ఈ వ్యవహారంపై చర్చించారు.

BRS BSP Alliance in Telangana Lok Sabha Polls 2024
BRS BSP Alliance in Telangana Lok Sabha Polls 2024

తెలంగాణ రాజకీయాల్లో ట్విస్ట్ - లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు

BRS BSP Alliance in Telangana Lok Sabha Polls 2024 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉండగా ఆ తర్వాత బీజేపీలోకి వలసలు ఎక్కువగా సాగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఇటీవల వరుసగా నాయకులు గుడ్ బై చెబుతున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పార్టీని వీడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల విషయంలో పార్టీ గందరగోళానికి గురవుతోంది.

BRS BSP Alliance For Lok Sabha Polls 2024 : ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బీఎస్పీతో పొత్తుకు సిద్ధమైంది. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు తాజాగా నిర్ణయించాయి. ఈ క్రమంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (BSP Praveen Kummar Meets KCR) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను హైదరాబాద్ నందినగర్ కాలనీలోని ఆయన నివాసంలో కలిశారు. దాదాపు రెండు గంటలపాటు ఇరువురి భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరు పార్టీలు పొత్తుపై చర్చించాయి.

భేటీ అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్, ప్రవీణ్ కుమార్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ బీఎస్పీతో పొత్తుపై చర్చించామని, ఇరు పార్టీల మధ్య గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని ప్రకటించారు. పొత్తు విధివిధానాలు, సీట్ల ఖరారుపై త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లోకి జహీరాబాద్ ఎమ్మెల్యే - క్లారిటీ ఇచ్చిన మాణిక్​ రావు

"సిద్ధాంత పరంగా కూడా రెండు పార్టీలు ఒకే రకంగా ఉన్నాయి. మా పాలనలో దళిత బంధు సహా ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. పొత్తుపై ప్రవీణ్ కుమార్ బీఎస్పీ అధిష్ఠానం అనుమతి కూడా తీసుకున్నారు. సీట్లు, విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తాం. ఆ పార్టీ అధినేత్రి మాయావతితో రెండ్రోజుల్లో మాట్లాడతాను. పొత్తు గురించి ఆమెతో చర్చించి మిగతా విషయాలు త్వరలోనే ప్రకటిస్తాం." - కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత

RS Praveen Kumar On BRS BSP Alliance : అనంతరం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్‌ను కలవడం ఆనందంగా ఉందని అన్నారు. దేశంలో లౌకికత్వం ప్రమాదంలో పడిందన్న ఆయన లౌకికవాదాన్ని నిరంతరం కాపాడిన నేత కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో రాజ్యాంగం అమలుకు ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కూడా బీజేపీ లాగే ప్రవర్తిస్తోందని విమర్శించారు. పొత్తుపై కేసీఆర్‌తో చర్చించామన్న ప్రవీణ్‌ కుమార్‌, ఈ చర్చల వివరాలను అధిష్ఠానంతో మాట్లాడతానని తెలిపారు. మాయావతితో కేసీఆర్‌ కూడా చర్చిస్తారని వెల్లడించారు.

తెలంగాణలో 9 మంది బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన - మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్​ పోటీ

బీఆర్ఎస్‌ మరో షాక్ - సీఎం రేవంత్‌ను కలిసిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య

Last Updated : Mar 5, 2024, 6:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.