ETV Bharat / lifestyle

ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అలవాట్లు ఇవే! - నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

శరీరంలో రెండో మెదడు పొట్ట - ఆరోగ్యాన్ని దెబ్బ తీసే పదార్థాలేమిటో తెలుసా?

Foods to be Avoided for Gut Health
Foods to be Avoided for Gut Health (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : July 23, 2025 at 5:19 PM IST

3 Min Read
Choose ETV Bharat

Foods to be Avoided for Gut Health : శరీరంలో అన్ని అవయవాల కన్నా(గట్) పొట్ట ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుకే పొట్టను 'సెకండ్ బ్రెయిన్' అంటారని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మెదడులో ఏదైన ఆలోచన వస్తే మొదట స్పందించేది పొట్ట మాత్రమే అని, అందుకే ఒత్తిడికి లోనైనప్పుడు కడుపు ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఎవరి మీదనైనా కోపం వస్తే ఎసిడిటీ వస్తుందని, కాబట్టి, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రాధాన్యమివ్వాలంటున్నారు. అయితే మనం రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరించారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

Sugary substances
చక్కెర పదార్థాలు (Getty Images)

చక్కెర పదార్థాలు : పొట్టలో మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడంలో మంచి బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. కాబట్టి, చెడు బ్యాక్టీరియా వల్ల గ్యాస్, అల్సర్లు వంటి సమస్యలు వస్తుంటాయని తెలిపారు. ఈ క్రమంలో చక్కెర అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియాకు నష్టం కలిగి, చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వివరించారు. తద్వారా పలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి పొట్టలోని బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బ తీసే రిఫైన్డ్ షుగర్, చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిదని సలహా ఇస్తున్నారు.

కూరగాయలు నీళ్లలో ఉడికిస్తున్నారా?, ఆవిరి పడుతున్నారా? - ఎలా తింటే మంచిదో తెలుసా?

Ultra processed food
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ (Getty Images)

కృత్రిమ చక్కెరలు : చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదన్న కారణంతో కొందరు వీటికి బదులుగా కృత్రిమ చక్కెరలను ఆహారంలో చేర్చుకుంటారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంటారని నిపుణులు పేర్కొన్నారు. పొట్ట ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపించడమే కాకుండా పొట్టలోని మంచి బ్యాక్టీరియాను అసమతుల్యం చేస్తుంటాయని వివరించారు. కాబట్టి, వీటికి దూరంగా ఉండడం మేలని సూచిస్తున్నారు. సింథటిక్ స్వీటెనర్లు, సహజ స్వీటెనర్లు రెండూ పేగుల్లోని మైక్రోబయోటా కూర్పుపై ప్రభావం చూపుతాయని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.

Overly fried foods
ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలు (Getty Images)

ఎక్కువగా ఫ్రై చేస్తే : ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది ఎక్కువగా ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తినడానికి మక్కువ చూపిస్తుంటారు. ఇవి జీర్ణమవ్వడానికి అధిక సమయం పడుతుందంటున్నారు నిపుణులు. తద్వారా పొట్ట ఆరోగ్యంపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుందని, కాబట్టి వీటికి దూరంగా ఉండడం మంచిదని పేర్కొన్నారు.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ : ప్రస్తుతం పిల్లలు మొదలుకుని పెద్దల వరకు ప్యాకేజ్డ్ ఫుడ్ తినడానికి మక్కువ చూపిస్తున్నారని, ఈ ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయని తెలిపారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల పొట్టలోని బ్యాక్టీరియాను అసమతుల్యం చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి, వీటిని కూడా దూరంగా ఉండడం మంచిదంటున్నారు. కొన్ని ఎమల్సిఫైయర్లు, స్వీటెనర్లు, రంగులు, మైక్రోపార్టికల్స్, నానోపార్టికల్స్ గట్ మైక్రోబయోమ్, పేగు వాపుతో సహా అనేక ఫలితాలపై ప్రభావం చూపుతాయని National Library of Medicine అధ్యయనంలో పేర్కొంది.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? కాదా? - నిపుణులు ఏమంటున్నారంటే!

డైలీ "చపాతీలు" తింటున్నారా? - ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా? - నిపుణుల సమాధానమిదే!