ETV Bharat / international

టేకాఫ్‌ సమయంలో విమాన ప్రమాదం- రంధ్రంతో గంటసేపు గాల్లోనే ఫ్లైట్

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 9:58 PM IST

Serbia Plane Crash : టేకాఫ్‌ సమయంలో రన్‌వే సమీపంలో ఉన్న పరికరాలను ఢీకొన్న ఘటనలో ఓ విమానం ఎడమవైపు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.

Serbia Plane Crash
Serbia Plane Crash

Serbia Plane Crash : సెర్బియాలో ప్రయాణికుల విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్‌ క్రమంలో రన్‌వే సమీపంలో ఉన్న పరికరాలను ఢీకొన్న ఘటనలో ఎడమవైపు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. అలాగే గాల్లోకి దూసుకెళ్లిన ఫ్లైట్‌ గంట తర్వాత అదే ఎయిర్‌పోర్టులో సేఫ్​గా ల్యాంజ్ అయ్యింది. సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది.

ఎయిర్‌ సెర్బియాకు చెందిన విమానం 106 మంది ప్రయాణికులతో బెల్‌గ్రేడ్‌లోని నికోలా టెస్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌కు టేకాఫ్‌ తీసుకుంది. అయితే తగినంత ఎత్తుకు చేరుకోకపోవడం వల్ల రన్‌వే చివర్లో ఉన్న 'ల్యాండింగ్‌ సిస్టమ్‌ అరే' పరికరాలను ఢీకొంది. ఈ ఘటనలో ఎడమవైపు రెక్క భాగం తీవ్రంగా ధ్వంసమైంది. రంధ్రం పడటం సహా విమానం బాడీ (ఫ్యూజ్‌లేజ్‌) చీరుకుపోయినట్లు కనిపిస్తోన్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఫ్లైట్‌ తిరిగి వచ్చిన అనంతరం ఇంధనం లీక్ అవుతున్నట్లు గుర్తించిన అగ్నిమాపక సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. అంతకుముందు దాదాపు గంటసేపు గాల్లో ఉన్న సమయంలో విమానం కంపించిందని ప్రయాణికులను ఉటంకిస్తూ స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది. ఈ పరిణామంతో బెల్‌గ్రేడ్‌ ఎయిర్‌పోర్టును కొద్దిసేపు మూసివేశారు.

గగనతలంలో ఊడిన విమానం డోర్
Plane Door Blown Mid Air : ఇటీవలే గగనతలంలో ఓ విమానానికి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. టేకాఫ్ అయిన వెంటనే బోయింగ్ విమానం డోర్‌ ఊడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో విమాన సిబ్బంది ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి ఒంటారియోకు బయలుదేరిన సమయంలో 16 వేల అడుగుల ఎత్తులో ఈ ప్రమాదం జరిగింది. ఊడిన డోర్‌ పక్కనే ప్రయాణికులు సీట్లు ఉండగా కొందరి ఫోన్లు బయటకు ఎగిరి పడ్డాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

భారీ నిఘా విమాన ప్రమాదం
US Plane Crash Into Sea : గతేడాది నవంబరులో అగ్రరాజ్యం అమెరికా నౌకాదళానికి చెందిన పీ-8ఏ(P-8A) భారీ నిఘా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్‌వేపై నుంచి గగనతలంలోకి ఎగిసిన కొద్దిసేపటికే అదుపు తప్పి ఏకంగా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అమెరికా హవాయీ రాష్ట్రంలోని మెరైన్‌ కోర్‌ బేస్‌లో ఈ ప్రమాదం జరిగినట్లుగా కోర్‌ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్‌ ధ్రువీకరించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

'రష్యా సీక్రెట్ శాటిలైట్ రెడీ- వ్యోమగాములకు ఫుల్ డేంజర్'

1994లో హత్య- రింగ్​కు ఉన్న వెంట్రుకతో కేసు ఛేదించిన పోలీసులు- సందీప్​కు యావజ్జీవ జైలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.