ETV Bharat / international

వ్యాపారికి జాక్​పాట్- లాటరీలో రూ.796 కోట్లు- విజయ రహస్యం ఇదేనట!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 7:42 AM IST

China Lottery Winner
China Lottery Winner

China Lottery Winner : ఓ వ్యాపారవేత్త జాక్​పాట్​ కొట్టాడు. లాటరీలో ఏకంగా రూ.796 కోట్లు గెలుచుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తనకు నిద్ర కూడా పట్టలేదని ఆ వ్యాపారి చెబుతున్నారు.

China Lottery Winner : పది కాదు, ఇరవై కాదు, లాటరీలో ఏకంగా రూ.796 కోట్ల జాక్​పాట్ కొట్టాడు చైనాకు చెందిన ఓ వ్యాపారవేత్త. ఈ మొత్తాన్ని ప్రభుత్వం నిర్వహించే లాటరీలో గెలుచుకున్నాడు గోయ్​జో రాష్ట్రానికి చెందిన ఆ వ్యక్తి. చైనాలో ఓ వ్యక్తి గెలుచుకున్న అతిపెద్ద లాటరీ మొత్తం ఇదే కావడం విశేషం. 'చైనా వెల్ఫేర్ లాటరీ' అనే ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్న సంస్థ ఈ టికెట్లను విక్రయించింది. జాక్​పాట్ కొట్టిన వ్యాపారవేత్త మొత్తం 133 టికెట్లను కొనుగోలు చేశాడు. ఒక్కో టికెట్​ను రెండు యువాన్ల (సుమారు రూ.24)కు కొన్నాడు. ఏడు నంబర్లతో కూడిన ఒకే సిరీస్​పై అన్ని టికెట్లతో బెట్టింగ్ వేశాడు. లాటరీలో ఆ నంబర్​కే జాక్​పాట్ తగిలింది. దీంతో ఒక్కో టికెట్​పై 5.16 మిలియన్ యువాన్ల (7.25 లక్షల డాలర్లు) చొప్పున గెలుచుకున్నాడు. మొత్తం 133 టికెట్లకు 680 మిలియన్ యువాన్లు (96 మిలియన్ డాలర్లు) వచ్చాయి. ఈ మొత్తం భారత కరెన్సీలో రూ.796 కోట్లకు సమానం.

విజయ రహస్యం ఇదే!
లాటరీ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉందని విజేతగా నిలిచిన వ్యాపారవేత్త చెప్పాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తనకు నిద్ర కూడా పట్టలేదని అన్నాడు. 'తొలుత నేను నమ్మలేదు. తర్వాత పలుమార్లు చెక్ చేసుకున్నా. ఆ ఎగ్జైట్​మెంట్​లో నాకు నిద్ర పట్టలేదు' అని చెప్పుకొచ్చాడు. 'గత లాటరీలను నేను గమనించాను. ఏ నంబర్లకు జాక్​పాట్ తగిలిందనే విషయంపై పరిశోధన చేశా. అలాంటి నంబర్లను ఎంపిక చేసుకొని, నా లక్కీ నంబర్​ను కూడా జత చేసి బెట్ వేశా. ఇలాంటి సిరీస్​పై నేను చాలా కాలంగా బెట్ వేస్తున్నా. లాటరీ గెలిచిన విషయాన్ని నేను నా కుటుంబ సభ్యులకు ఇంకా చెప్పలేదు. వచ్చే సెలవుల సీజన్​లో వారికి ఈ విషయం చెబుతా' అని వ్యాపారవేత్త పేర్కొన్నాడు.

విజేతకు అన్షున్ సిటీలో చిన్న వ్యాపారం ఉందని లాటరీ నిర్వాహకులు తెలిపారు. ఫిబ్రవరి 7న అతడు తన లాటరీ డబ్బును తీసుకున్నాడని చెప్పారు. జాక్​పాట్ గెలిచిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేయలేదు. సాధారణంగా లాటరీలో విజేతగా నిలిచినవారి పేర్లను గోప్యంగానే ఉంచుతారు. చైనా ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం లాటరీలో గెలిచిన మొత్తంలో ఐదో వంతు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.

Mega Millions Jackpot : అమ్మబాబోయ్! లక్​ అంటే ఇదే.. లాటరీలో రూ.13వేల కోట్ల జాక్​పాట్​!

రూ.కోట్లు కురిపిస్తున్న కేరళ లాటరీ.. మనం కొనచ్చా?.. రూల్స్ ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.