ETV Bharat / health

సమ్మర్​ స్పెషల్​ రాగి జావ - ఇలా చేస్తే వద్దన్నోళ్లు కూడా రెండు గ్లాసులు తాగడం పక్కా!

Ragi Java Preparation : సమ్మర్‌లో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చెరకు రసం, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాల కన్నా రాగి జావ బెస్ట్​ ఆప్షన్​ అంటున్నారు నిపుణులు. అయితే చాలా మందికి రాగి జావ తాగాలని ఉంటుంది. కానీ, దానిని ప్రిపేర్​ చేసే విధానం తెలియక చేయడం మానేస్తారు. అలాంటి వారి కోసమే ఇది. మరి ఇంట్లోనే దీ బెస్ట్​ రాగి జావను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 5:32 PM IST

Ragi Java Preparation
Ragi Java Preparation

Ragi Java Preparation : ఎండాకాలం వచ్చేసింది. ఎండల తీవ్రత కూడా రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే ఆలోచిస్తున్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లినవారు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూల్‌డ్రింక్స్‌, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు అంటూ వాటిని లాగిస్తున్నారు. అయితే పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ రోజూ వాటిని తాగలేరు. అలా అని రోజూ కూల్‌డ్రింక్స్‌ తాగితే అనారోగ్యాలకు వెల్​కమ్​ చెప్పడం పక్కా. మరి ఎండ వేడి నుంచి ఎలా రిలీఫ్ పొందాలనుకుంటున్నారా? అందుకు రాగి జావ బెస్ట్​ అంటున్నారు నిపుణులు. అయితే చాలా మందికి రాగిజావ తాగాలని ఉంటుంది. కానీ, దానిని ప్రిపేర్​ చేసే విధానం తెలియక చేయడం మానేస్తారు. అలాంటి వారి కోసమే ఇది. వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండటానికి, అలాగే శరీరాన్ని చల్లబరచడానికి రాగి జావ తాగాలని సూచిస్తున్నారు. మరి సమ్మర్‌ స్పెషల్‌గా రాగి జావను ఇంట్లోనే ఎలా ప్రిపేర్‌ చేయాలో ఇప్పుడు చూద్దాం..

సమ్మర్‌ స్పెషల్‌ రాగి జావ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • రాగి పిండి - 4 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర పొడి - 1/2 టేబుల్‌ స్పూన్‌
  • పెరుగు లేదా మజ్జిగ - 1 కప్పు
  • నీరు - 2 నుంచి 3 గ్లాసులు
  • ఉప్పు - రుచికి సరిపడ

రాగి జావ తయారు చేయు విధానం :

  • ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకుని అందులో రాగి పిండి వేయాలి. తర్వాత అందులోకి 1/2 కప్పు నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపుకోవాలి.
  • ఇప్పుడు ఒక పెద్ద గిన్నెను తీసుకుని స్టవ్‌ మీద పెట్టి, అందులో రెండు గ్లాసుల నీళ్లు పోయాలి.
  • నీళ్లు కొద్దిగా మరిగిన తర్వాత, కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని పోయాలి.
  • ఇప్పుడు మంట చిన్నగా పెట్టి గరిటెతో జావ ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండాలి.
  • ఒక మూడు నిమిషాలు సన్నని మంట పైన జావ ఉడికిన తర్వాత అందులో సరిపడినంత ఉప్పు, జీలకర్ర పొడి వేసుకోవాలి.
  • జావ కొద్దిగా చల్లారిన తర్వాత అందులోకి పెరుగు లేదా మజ్జిగ వేసుకుని కలిపి తాగితే చాలా బాగుంటుంది.
  • మీరు ఈ జావ మరింత టేస్ట్‌గా ఉండటానికి సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగును కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

రాగి జావ తాగడం వల్ల కలిగే లాభాలు :

  • ఉదయం పూట రాగి జావ తాగడం వల్ల ఎన్నో రకాల హెల్త్‌ బెనిఫిట్స్‌ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఫైబర్, ఐరన్, క్యాల్షియం, ఐయోడిన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని తాగడం వల్ల మన శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి.
  • వేసవి కాలంలో దీన్ని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుందని నిపుణులంటున్నారు.
  • రాగి జావలో ఫైబర్‌ శాతం అధికంగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల చాలా సేపు ఆకలి కాకుండా ఉంటుందని తెలియజేస్తున్నారు.
  • రోజూ రాగి జావ తాగడం వల్ల రక్తపోటు, షుగర్‌ కంట్రోల్లో ఉంటాయట.

రోజూ ఉడికించిన గుడ్డు తింటున్నారా? - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

పుచ్చకాయ లోపల ఎర్రగా పండిందో లేదో - ఇలా తెలుసుకోండి!

మరమరాలు ఆఫ్ట్రాల్ అని తీసిపారేయకండి - ఇవి తిన్నారంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.