ETV Bharat / health

పుచ్చకాయ లోపల ఎర్రగా పండిందో లేదో - ఇలా తెలుసుకోండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 10:41 AM IST

How to Identify Best Watermelon : సమ్మర్​ను కూల్​ చేసే పండ్లలో పుచ్చకాయ ముందు వరసలో ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. ఈ కాయ లోపల ఎర్రగా పండిందా? లేదా? అనేది తెలుసుకోవడం పెద్ద సవాల్. బయట చక్కగా కనిపించే కాయలు.. లోపల సరిగా పండకుండా ఉంటాయి. ఇంటికి తీసుకెళ్లి, కోసిన తర్వాతగానీ అది అర్థం కాదు. అయితే.. కొన్ని టిప్స్ ద్వారా మార్కెట్లో కొనుగోలు చేస్తున్నప్పుడే పండిన కాయను గుర్తుపట్టొచ్చు! అది ఎలాగో తెలుసుకోండి.

How to Identify Best Watermelon
How to Identify Best Watermelon

How to Identify Best Watermelon : ఎండకాలం వచ్చిదంటే.. కనీసం ఒక్కసారైనా పుచ్చకాయ తింటారు అందరూ. అంత ఫేమస్ అయిన ఈ కాయ సరిగా పండిందా లేదా? అన్నది మాత్రం బయట నుంచి చూసి గుర్తుపట్టడం అందరికీ సాధ్యం కాదు. ఇందుకోసం కొన్ని టిప్స్ ఉన్నాయి. మరి ఆ చిట్కాలేంటో తెలుసుకోండి.

పుచ్చకాయ రంగు : పుచ్చకాయ పచ్చగా, నిగనిగలాడుతూ కనిపించే సరికి.. తాజాగా ఉందని చాలా మంది కొనేస్తూ ఉంటారు. తీరా ఇంటికెళ్లాక చూస్తే కాయ పూర్తిగా పండకపోవటం, చప్పగా ఉండటం, గుజ్జు తక్కువగా ఉండటం గమనిస్తుంటారు. వాస్తవానికి పూర్తిగా పండిన పుచ్చకాయ.. ఎప్పుడూ ముదురు రంగులోనే ఉంటుంది. కాబట్టి పైకి కనిపించటానికి తాజాగా ఉందా లేదా అన్న విషయం పక్కనపెట్టి ముదురు వర్ణంలో ఉన్న కాయను ఎంపిక చేసుకోండి.

కొన్ని పుచ్చకాయల్లో ఒకవైపు తెలుపు రంగు లేదంటే గోధుమ రంగు మచ్చలుంటాయి. పండించేటప్పుడు పుచ్చకాయలు నేలకు ఆనుకుని ఉండటం వల్ల ఈ మచ్చలు ఏర్పడతాయి. అయితే ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే అవి అంత మంచివన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా గోధుమ రంగు మచ్చలున్న పుచ్చకాయల్ని అనుమానం లేకుండా కొనొచ్చు. అంతేకాదు కొన్ని పుచ్చకాయలపై సాలెగూడులాగా, గోధుమ రంగులో గీతలుంటాయి. తెగులు సోకింది కావొచ్చని.. ఆ కాయలను కొనేందుకు ఇష్టపడరు. వాస్తవానికి ఇంతకంటే తీపి కాయ మరొకటి ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తేనెటీగలు అనేకసార్లు ఆ పూల మీద వాలడం వల్ల ఆ మచ్చలు ఏర్పడతాయి.

పుచ్చకాయను లైట్‌గా కొట్టండి : కొంత మంది పుచ్చకాయను కొనేటప్పుడు చేతితో కాయపై రెండు మూడు సార్లు కొట్టి తీసుకోవడం చూస్తుంటాం. అయితే, ఇలా ఎందుకు కొడతారని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? బాగా పండి స్వీట్‌గా ఉండే పుచ్చకాయను చేతితో కొట్టినప్పుడు శబ్ధం వస్తుంది. అలాగే పండకుండా గుజ్జు లేకుండా ఉండేవాటిని కొట్టినప్పుడు తక్కువ సౌండ్‌ వస్తుంది.

తొడిమ చూడండి : బాగా పండిన పుచ్చకాయ తొడిమ ఎండిపోయినట్లుగా ఉంటుంది. అలా కాకుండా తొడిమ కాస్త పచ్చిగా ఉంటే దానిని కొనకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

బరువు చూడండి : చాలా మంది పుచ్చకాయలు పెద్దగా ఉంటేనే అందులో బాగా గుజ్జు ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ, ఇది కేవలం అపోహే అని నిపుణులంటున్నారు. ఏదైనా కాయ కూడా సైజ్‌ను బట్టి బరువు ఉంటే దానిని ఎటువంటి సందేహం లేకుండా కొనొచ్చని తెలియజేస్తున్నారు. ఎందుకంటే చిన్న వాటిలో కూడా బాగా పండినవి, స్వీట్‌గా ఉండేవి ఉంటాయని చెబుతున్నారు.

క్యాన్సర్​ నుంచి కిడ్నీల ఆరోగ్యం వరకు - దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలివే!

తెల్లజుట్టుతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సీడ్స్​ ట్రై చేస్తే నల్లగా మారడం పక్కా!

బాదం తినకపోతే ఓ సమస్య - అతిగా తింటే మరో ప్రాబ్లం! - రోజుకు ఎన్ని తినాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.