ETV Bharat / health

ఒత్తిడితో చిత్తవుతున్నారా ? ఈ ఆహార పదార్థాలతో ఈజీగా చెక్‌ పెట్టొచ్చు! - Stress Relief Foods

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 3:40 PM IST

Stress Relief Foods : నేటి ఆధునిక కాలంలో మనిషిని పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యలలో ఒత్తిడి ఒకటి. అయితే, ఈ స్ట్రెస్‌ను తగ్గించుకోవడానికి డైలీ యోగా, ధ్యానం వంటి వాటితో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Stress Relief Foods
Stress Relief Foods

Stress Relief Foods In Telugu : ప్రస్తుత కాలంలో మెజార్టీ జనాలు స్ట్రెస్​కు గురవుతున్నారు. ఉద్యోగ, వ్యాపార పనుల వల్ల ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్ర పోయే వరకు ఏదో ఒక విషయంలో ఒత్తిడితో చిత్తవుతున్నారు. ఈ సమస్య తీవ్రమైతే అది మధుమేహం, ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటం కోసం స్ట్రెస్​ తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

ఆకుకూరలు : ఆకుకూరలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, స్ట్రెస్‌తో బాధపడేవారు ఆకుకూరలను ఎక్కువగా తినమని సలహా ఇస్తున్నారు.

బెర్రీలు : స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు పండ్లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్​గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయంటున్నారు.

చేపలు : సాల్మన్, మాకేరెల్, సార్డినెస్ వంటి వివిధ రకాల చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

డ్రై ఫ్రూట్స్‌ : బాదం, వాల్‌నట్‌లు, గుమ్మడికాయ గింజల వంటి వాటితో పాటు.. డ్రైఫ్రూట్స్‌లలో హెల్దీ ఫ్యాట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి, వీటిని తరచూగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

పెరుగు : పెరుగులో మంచి ప్రోటీన్‌, ప్రోబయోటిక్స్‌ నిండి ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు, ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, రోజూ ఒక కప్పు పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా? - మీ సాల్ట్​ ఇలా టెస్ట్​ చేసుకోండయ్యా! - How to Check the Purity of Salt

ఓట్స్‌ : బరువు తగ్గాలనుకునే వారు, అలాగే మధుమేహం వ్యాధితో బాధపడేవారు డైట్‌లో ఓట్స్‌ తింటే మంచిదని అందరికీ తెలుసు! అయితే, బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్‌ తినడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులంటున్నారు.

డార్క్ చాక్లెట్ : డార్క్ చాక్లెట్‌లో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తాయని నిపుణులంటున్నారు. కాబట్టి, ఒత్తిడిగా అనిపించినప్పుడు కొద్దిగా డార్క్‌ చాక్లెట్‌ తినాలని సూచిస్తున్నారు. 2018లో "జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, డార్క్ చాక్లెట్ తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుందని, అలాగే ఒత్తిడి తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని 'పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ'లో పనిచేసే 'డాక్టర్. మార్క్ హాన్సన్' పాల్గొన్నారు. ఒత్తిడిగా ఉన్నప్పుడు డార్క్‌ చాక్లెట్‌ తినడం వల్ల రిలీఫ్​ పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

  • ఇంకా రోజూ అవకాడోను తినడం వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుందట.
  • అలాగే ఒత్తిడిగా ఉన్నప్పుడు అరటి పండ్లు తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు రాలడం నుంచి చుండ్రు వరకు - ఉల్లి నూనెతో అన్నీ పరార్​! - Onion Oil Benefits

వాటర్​ వెయిట్' సమస్య ఉంటే ఏమవుతుంది? దీన్ని తగ్గించడం ఎలా? - water retention in body symptoms

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.