ETV Bharat / health

కొరియన్స్​లా మీ స్కిన్​ కూడా నిగనిగలాడాలా? ఈ సింపుల్​ టిప్స్​ పాటిస్తే చాలు​! - Korean Skin Care

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 6:17 PM IST

Korean Skin Care Benefits
Korean Skin Care Tips

Korean Skin Care Tips : కొరియన్​లలా మీరు కూడా చాలా అందంగా కనిపించాలనుకుంటున్నారా? మేకప్​ వేసుకునే అవసరం లేకుండానే వారిలా సహజంగా ఉండే ఆకర్షణీయమైన, మెరిసే చర్మాన్ని మీరూ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Korean Skin Care Tips : బ్యూటీ టిప్స్​ కోసం ప్రస్తుతం సోషల్​ మీడియాలో ఎక్కడ వెతికినా మొదట కొరియన్​ స్కిన్​ కేర్​ రొటీన్​కు సంబంధించిన పోస్టులే దర్శనిమిస్తున్నాయి. మామూలుగా కొరియన్​ అనే మాట వినగానే అందరికీ గుర్తొచ్చేది అందం. ఇక్కడి ఆడవారు సహజంగానే ఆకర్షణీయమైన, మెరిసే చర్మాన్ని కలిగి ఉంటారు. ఇంతకీ కొరియన్​ యువతులు, మహిళలు ఎందుకంత అందంగా, అట్రాక్టివ్​గా కనిపిస్తారు. దీనికి గల కారణాలు ఏంటి? స్కిన్​ కేర్​ కోసం వారు ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రోజుకు నాలుగు సార్లు
కొరియన్​ బ్యూటీస్​ మొదటి సీక్రెట్​ ఏంటంటే- ముఖ్యంగా వారు కాలుష్యానికి దూరంగా ఉంటారు. వారి చర్మం మీద దుమ్ము, ధూళి లాంటి వాటిని అస్సలు చేరనివ్వరు. వీటి వల్ల చర్మం రంగు మారడం, మచ్చలు రావడం లాంటివి జరుగుతాయి గనుక రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కుంటారు. ఇందుకు వారు హానికరమైన రసాయనాలు లేని సున్నితమైన సబ్బు, క్రీములను మాత్రమే ఉపయోగిస్తారు.

ఎక్స్‌ఫోలియేట్​ చేయాలి
ఎక్స్‌ఫోలియేట్​ చేయడం వల్ల చర్మం రంధ్రాల్లోని మృత కణాలతో పాటు దుమ్ము, ధూళి లాంటివి బయటకొస్తాయి. ఇది మీకు సహజమైన కాంతిని, ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. కనీసం వారానికి రెండు సార్లు చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయాలి.

టోనర్​​
మీరు ముఖం కడుక్కున్న లేదా స్నానం చేసిన ప్రతిసారీ టోనర్​ను రాసుకోవాలి. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్​ చేస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని లోతుల్లోంచి మృదువుగా మారుస్తుంది. ఇది ఆరిన తర్వాత మీరు వాడే ఏ ఫేస్​ క్రీమునైనా అప్లై చేసుకోవచ్చు.

సీరం
ప్రస్తుతం మార్కెట్​లో ఎక్కడ వెతికినా సీరం దొరుకుతుంది. అలాగని ఏది పడితే అది వాడకూడదు. మీ చర్మ తీరు ఏంటి, ఎలాంటి సీరం మీకు సూట్​ అవుతుంది అనే విషయాల గురించి తెలుసుకుని తగిన సీరంలను మాత్రమే ఉపయోగించాలి.

కొరియన్​ షీట్​ మాస్క్​​
సడెన్​గా మీరు ఓ పార్టీకి లేదా ఫంక్షన్​కు వెళ్లాల్సి వచ్చినప్పుడు మీకు కొరియన్​ షీట్​ మాస్క్​ బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్​లో చాలా తక్కువగా దొరికే ఈ మాస్కులు మీకు సహజమైన తేమను, మెరుపును అందిస్తాయి. పార్టీ ముగిసే వరకూ మీరు అందంగా కనిపించేలా చేస్తాయి.

మాయిశ్చరైజర్​​
మేకప్​ వేసుకునే అలవాటు ఉన్న వారు తప్పకుండా చేయాల్సిన పనేంటంటే- మేకప్​ వేసుకునే కన్నా ముందు మాయిశ్చరైజర్​ను రాసుకోవడం. మాయిశ్చరైజర్​ క్రీములు మీ చర్మాన్ని హైడ్రేటెడ్​గా ఉంచడమే కాకుండా మేకప్ క్రీముల ప్రతికూల ప్రభావం మీ చర్మంపై పడకుండా కాపాడుతాయి.

ఐక్రీమ్​​
కొరియన్​లలా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఐక్రీమ్​ను తప్పనిసరిగా వాడాలి. ఎందుకంటే కంటి కింద నల్లటి వలయాలు, ముడతల వల్ల మీరు అందంగా కనిపించే అవకాశం ఉండదు. అందుకని రాత్రి పడుకునే ముందు ఐక్రీమ్​ను రాసుకోవడం వల్ల కంటి కింద చర్మం తాజాగా, బిగుతుగా మారుతుంది. దీనితో మీరు అందంగా కనిపిస్తారు.

డాబ్​ ట్యాప్​ పద్ధతి
ఫేస్​వాష్​లు, సబ్బులతో ముఖం కడుకున్న తర్వాత ముఖాన్ని తుడిచేందుకు సాఫ్ట్​ మెటీరియల్​తో తయారు చేసిన టవల్స్​ను మాత్రమే వినియోగించండి. ఇష్టం వచ్చిన క్లాత్స్​ను వాడటం వల్ల మీ చర్మంపై రెడ్​ ర్యాషెస్​ వచ్చి స్కిన్​ పాడయ్యే అవకాశం ఉంది.

మీరు ఎక్కువగా బరువు పెరుగుతున్నారా ? అయితే, డైలీ లైఫ్‌లో ఈ తప్పులు చేస్తున్నట్లే! - Causes Of Obesity

రెస్ట్​లెస్ లెగ్స్ సిండ్రోమ్​ వేధిస్తోందా? - ఈ విటమిన్స్​ ఉండే ఫుడ్​తో ఆ సమస్యకు చెక్ పెట్టండి! - Vitamins Help Restless Leg Syndrome

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.