ETV Bharat / health

మీ పిల్లలు ఫోన్​కు అడిక్ట్​ అయ్యారా? ఈ 6 చిట్కాలు ఫాలో అయితే అంతా సెట్​! - How To Stop Child Phone Addiction

How To Avoid Child From Mobile : మీ పిల్లలు పూర్తిగా ఫోన్​కు బానిస అయిపోయారా? ఎంత చెప్పినా మారడం లేదా? మరి ఫోన్లు, టెక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా పిల్లలను కాపాడుకునేందుకు దోహదం చేసే ఆరు టిప్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 30, 2024, 5:18 PM IST

How To Avoid Child From Mobile
How To Avoid Child From Mobile

How To Avoid Child From Mobile : ఈతరం పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఖాళీ సమయం దొరికిందంటే చాలు ఫోన్లలో మునిగి తేలుతున్నారు. పిల్లలు ఫోన్ల మాయలో పడి రాత్రి, పగలుకు తేడాను కూడా గుర్తించలేకపోతున్నారు. వివిధ గేమ్స్, సాంగ్స్, వీడియోలు, మ్యూజిక్, గ్రాఫిక్ కంటెంట్ పిల్లలను అంతగా కట్టిపడేస్తున్నాయి. ఫోన్లు, టెక్ గాడ్జెట్లకు బానిసలుగా మారకుండా పిల్లలను కాపాడుకునేందుకు దోహదం చేసే ఆరు టిప్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1.మీరు చేసి చూపించండి!
తల్లిదండ్రులే పిల్లలకు మొదటి గురువులు. అందుకే పేరెంట్స్ ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేసేందుకు ప్రయత్నిస్తారు. ఫోన్ ఎక్కువ చూడొద్దని పిల్లలకు చెప్పే ముందు మీరే ఒక రోల్ మోడల్‌గా మారండి. ఫోన్ చూసే టైంను తగ్గించేయండి. దానివల్ల కలుగుతున్న పాజిటివ్ ఫీలింగ్స్ గురించి పిల్లలకు చెప్పండి. క్రమంగా పిల్లలు కూడా అదే బాటలో పయనిస్తారు. ఖాళీ టైంలో ఫోన్ చూడటం కంటే పిల్లలతో మాట్లాడటం, వారితో కలిసి ఆడుకోవడం, పుస్తకాలు చదవడం వంటివి చేయడం బెటర్.

2.కచ్చితమైన రూల్స్ పెట్టండి!
మీ పిల్లలు ఎక్కువగా ఫోను చూస్తుంటే వారిని అలర్ట్ చేయడం మీ బాధ్యత. రోజూ గరిష్ఠంగా ఎంతసేపు ఫోను చూడాలనే దానిపై వారికి సున్నితంగా గైడెన్స్ ఇవ్వండి. రోజూ ఏ వేళలో, ఎంత సమయం పాటు ఫోన్ చూడాలనేది నిర్దేశించండి. దాన్నే పిల్లలు ఫాలో అయ్యేలా చూడండి. అతిగా ఫోన్ చూస్తే కంటిపై, మానసిక స్థితిపై కలిగే ప్రతికూల ప్రభావాలను పిల్లలకు వివరించండి.

3.టెక్ ఫ్రీ జోన్లను క్రియేట్ చేయండి!
మీ ఇంట్లోని డైనింగ్ రూమ్, బెడ్‌రూమ్‌ వంటి చోట్ల ఫోన్లను వాడొద్దని పిల్లలకు చెప్పండి. ఇంట్లోని ఆయా ఏరియాల్లో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం తప్ప ఫోన్ల వాడకం జరగకూడదని స్పష్టం చేయండి. బెడ్ రూంలో విశ్రాంతి డైనింగ్ రూంలో భోజన రుచిని ఆస్వాదించడం అనేవి ప్రయారిటీలుగా ఉండాలని పిల్లలకు వివరించాలి.

4.యాక్టివిటీలతో బ్యాలెన్స్ చేయండి!
పిల్లలు ఫోన్లలోనే మునిగి తేలుతుంటే వారిని ఆ ఊబి నుంచి బయటపడేసే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలి. ఇందుకోసం ఇంట్లో ప్రత్యక్షంగా ఆడుకునే గేమింగ్ వసతులు కల్పించాలి. చెస్, క్యారం బోర్డు, ఇతర క్రీడా సామగ్రిని, పుస్తకాలను, పెయింటింగ్ క్యాన్వాస్‌లను అందుబాటులో ఉంచాలి. తద్వారా పిల్లలను ఫోన్ల మత్తు నుంచి క్రియేటివిటీ వైపుగా, యాక్టివిటీ వైపుగా నడపొచ్చు.

5.స్క్రీన్ టైంను రివార్డులా వాడండి!
పిల్లలు ఫోన్ చూసే టైంను తగ్గించడం ముఖ్యమే. అయితే ఆ విధంగా మిగిలే టైంను ఎలా వెచ్చించాలి అనే దానిపై వారికి పేరెంట్స్ తగిన గైడెన్స్ అందించాలి. హోం వర్క్ చేసుకోవడం, ఏదైనా ఇండోర్ గేమ్‌ను నేర్చుకోవడం వంటి వాటి దిశగా పిల్లలను ప్రోత్సహించాలి. దీనివల్ల పిల్లలు బాధ్యతాయుత ప్రవర్తనకు, సమయ సద్వినియోగానికి అలవడుతారు.

6. జాయింట్ యాక్టివిటీస్ చేయండి!
పిల్లలు ఎక్కువ సమయం పాటు ఒంటరిగా ఫోనులో మునిగిపోకుండా చూడాలి. లేదంటే వారు ఫోనునే లోకంగా భావించే అపాయం ఉంటుంది. అందుకే ఇంట్లోని పిల్లలంతా లేదా పిల్లలు, పేరెంట్స్ కలిసి జాయింట్‌గా ఫోన్లలో ఎడ్యుకేషనల్ గేమ్స్ ఆడాలి. సినిమాలు చూడాలి. దీనివల్ల పిల్లలకు టీమ్ వర్క్ అలవడుతుంది. టీమ్‌లో సభ్యుడిగా ఎలా ఉండాలనేది తెలిసొస్తుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.