కీళ్ల నొప్పుల నుంచి బరువు తగ్గడం వరకు - ఈ ఆకుతో బోలెడు ప్రయోజనాలు! అస్సలు మిస్​ కావొద్దు! - Health Benefits of Tamarind leaves

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 7:48 PM IST

Tamarind leaves Health Benefits
Tamarind leaves Health Benefits ()

Tamarind leaves Health Benefits: వేసవిలోనే దొరికే ఆహార పదార్థాల్లో మామిడి, తాటి ముంజలు మాత్రమే కాదు.. చింతచిగురు కూడా ఒకటి. అయితే చింతచిగురు కూరల రుచిని పెంచడమే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

Health Benefits of Tamarind leaves: వేసవిలో మాత్రమే లభించే చింత చిగురుతో పప్పు, పచ్చడి, చికెన్​, మటన్​, రొయ్యలు.. ఇలా ఇతర కూరల్లో కలిపి వండుకుని తింటుంటారు. ఇక చింత చిగురు పులిహోర చాలా పాపులర్‌. రుచితోపాటు ఔషధ గుణాలు కూడా ఇందులో అధికంగా ఉన్నాయి. వాస్తవానికి చింతపండు కంటే చింత చిగురు తింటేనే ఎక్కువ ప్రయోజనాలున్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇందులో మన శరీరానికి డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్​లా పని చేస్తుంది. చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం చింతచిగురు ధర నగర వాసులకు షాక్​ ఇస్తుంది. గ్రామాల్లో ఈజీగా లభించే చింతచిగురు పెద్ద పెద్ద నగరాల్లో రేట్​ కాస్తా ఎక్కువగానే ఉంది. చికెన్​, మటన్​ కన్నా ఎక్కువ ధర చింతచిగురు సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో కేజీ చింతచిగురు 700 పైనే ఉంది. ఇంతలా రేటు ఎందుకుందంటే.. అవి అందించే ప్రయోజనాలే కారణమంటున్నారు నిపుణులు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో చూద్దాం..

సూపర్​ పోషకాలు: చింత చిగురులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చింత చిగురులో ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయన్నారు. అలాగే డైటరీ ఫైబర్​, విటమిన్​ సి, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్​, ఫాస్పరస్​ వంటి పోషకాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు.

చింతచిగురు ఆరోగ్య ప్రయోజనాలు: చింతచిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే మలబద్ధకం నివారించడానికి సహాయపడుతుంది.

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: కీళ్ల నొప్పులను తగ్గించడానికి చింత చిగురు మంచి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు, వాపును తగ్గించడంలో సహాయపడతాయి. 2016లో "Evidence-Based Complementary and Alternative Medicine" జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 8 వారాల పాటు రోజుకు 4 గ్రాముల చింతచిగురు పొడిని తీసుకోవడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులలో నొప్పి, కీళ్ల వాపును గణనీయంగా తగ్గిందని పేర్కొంది. ఇందులో ఇరాన్​లోని షాహిద్ చమ్రాన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్​ మహమ్మద్ అజీజ్ పాల్గొన్నారు.

రోగనిరోధక శక్తిని పెంచడంలో: చింతచిగురులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్​లు, టార్టారిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడతాయి.

కొలెస్ట్రాల్ తగ్గుతుంది: చింతచిగురులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచుతుంది.

రక్తపోటును నియంత్రిస్తుంది: చింతచిగురులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది..

బరువు తగ్గడానికి సహాయపడుతుంది: చింతచిగురులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే అతిగా తినడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. దీంతో బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

చర్మానికి మంచిది: చింతచిగురులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. చింతచిగురును ముఖానికి ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఇది మొటిమలను తగ్గించడంలో, చర్మాన్ని నిగారింపుగా చేయడంలో సహాయపడుతుంది.

జుట్టుకు మంచిది: చింతచిగురు జుట్టు రాలడాన్ని నివారించడానికి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. చింతచిగురు ఆకులతో తయారు చేసిన హెయిర్ ప్యాక్‌ను జుట్టుకు పట్టించి, 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే జుట్టు రాలడం తగ్గి పెరుగుదల ఉంటుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి..

  • స్కర్వీ, మలేరియా వ్యాధులకు కూడా ఈ చిగురు చక్కగా పనిచేస్తుంది.
  • చింతచిగురు జ్యూస్‌ ఆడవాళ్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుంది.
  • చింతచిగురు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి ఊతమిస్తుంది.
  • చింత చిగురు ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి.
  • కంటి సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొద్దిగా చింత చిగురు తింటే ఉపశమనం లభిస్తుంది.
  • థైరాయిడ్ తో బాధపడేవారు చింత చిగురు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులకు చింత చిగురు ఔషధంలా పనిచేస్తుంది.
  • నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.
  • ఇందులోని బయోయాక్టివ్ సమ్మేళనాలు గాయాల్ని నయం చేయడంలో సహాయపడతాయి. ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, సపోనిన్లు, టానిన్లు వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గాయాలవల్ల వచ్చే శాశ్వత మచ్చ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుందట.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీకు కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత - కొబ్బరి తినే అలవాటు ఉందా? - ఏం జరుగుతుందో తెలుసా! - Raw COCONUT HEALTH PROBLEMS

చిన్న వయసులోనే గర్భసంచి తీసేస్తే ఎలాంటి సమస్యలొస్తాయో మీకు తెలుసా ? - Hysterectomy Side Effects

నెల రోజుల పాటు కాఫీ, టీ తాగకపోతే - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? - Stop Drinking Tea Coffee Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.