ETV Bharat / entertainment

ఫొటోలతో క్యూరియాసిటీ పెంచేసిన విక్రమ్​ - ఆ హిట్​ సినిమాకు సీక్వెల్ రానుందా ?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 8:45 PM IST

Vikram Mahaan Movie : స్టార్ హీరో విక్రమ్​ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఇంతకీ అదేంటంటే ?

Vikram Mahaan Movie
Vikram Mahaan Movie

Vikram Mahaan Movie : కోలీవుడ్ నటుడు విక్రమ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనలో వర్సటైలిటీ చూపించే ఈ స్టార్ హీరో సినిమా సినిమాకు కొత్తదనాన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. దీంతో అటు తెలుగుతో పాటు తమిళంలోనూ మంచిక్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్ పార్ట్​ 2తో బ్లాక్​బస్టర్​ను తన ఖాతాలో వేసుకున్న విక్రమ్​, గ్యాప్​ లేకుండా సినిమా షెడ్యూళ్లతో బిజీగా ఉన్నారు.

అయితే తాజాగా ఆయన నెట్టింట పెట్టిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. 2022లో ఆయన నటించిన 'మహాన్‌' సినిమా నేటి ( ఫిబ్రవరీ 11) తో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ రెండు స్టిల్స్‌ షేర్‌ చేస్తూ 'మహాన్‌ 2' అని క్యాప్షన్‌ పెట్టారు. ఇది చూసిన అభిమానులు నెట్టింట ఈ ఫొటోలను ట్రెండ్​ చేస్తూ క్యాఫ్షన్​ గురించి డిస్కషన్ మొదలెట్టారు. అసలు 'విక్రమ్‌ మహాన్‌ సీక్వెల్​కు ప్లాన్‌ చేస్తున్నారా?' అంటు కామెంట్​ చేస్తున్నారు. మరి, విక్రమ్‌ తన అభిమానులను కన్​ఫ్యూజ్​ చేసేందుకు ఇలా పోస్ట్ చేశారా లేకుంటే నిజంగానే ఈ సీక్వెల్​ చేస్తున్నారా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి మూవీ టీమ్​ కానీ, విక్రమ్​ కానీ క్లారిటీ ఇస్తే హ్యాపీ అంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Mahaan Movie Cast : ఇక మహాన్ సినిమా విషయానికి వస్తే - యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన మూవీ 2022 ఫిబ్రవరి 10న నేరుగా 'అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో'లో రిలీజైంది. ఈ చిత్రంతో విక్రమ్​ ఓ హిట్​ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇందులో ఆయన తనయుడు ధ్రువ్‌ కీలక పాత్ర పోషించగా, సిమ్రన్‌, బాబా సింహా, వాణీ భోజన్‌ కూడా తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Vikram Upcoming Movies : మరోవైపు ప్రస్తుతం 'తంగలాన్' సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రానున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా డైరెక్టర్​ పా. రంజిత్‌ ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఇందులో విక్రమ్​తో పాటు మాళవిక మోహనన్‌, పార్వతి తిరువత్తు కీలక పాత్రలు పోషించారు. ఇక విక్రమ్​ ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ ఓ డిఫరెంట్​ గెటప్​లో కనిపించనున్నారు. ఓ గిరిజన తెగకి చెందిన నాయకుడి పాత్రలో ఆయన. ఇప్పటికే విడుదలైన పోస్టర్​, టీజర్​తో ఈ సినిమా కోసం ఆయన పడిన కష్టం తెలుస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.

'కంగువా', 'తంగలాన్‌' రిలీజ్‌ డేట్స్​ - థియేటర్లలోకి అప్పుడే

'తంగలాన్‌' రోల్​పై విక్రమ్ ఇంట్రెస్టింగ్​ కామెంట్స్​ - ఒక్క డైలాగ్​ కూడా చెప్పకుండానే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.