ETV Bharat / entertainment

నాని రికార్డ్​ను బ్రేక్ చేసిన టిల్లన్న - ఇక మిగిలింది దేవరకొండనే! - Tillu Square Collections

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 16, 2024, 8:34 PM IST

Tillu Square Collections : టిల్లు స్క్వేర్ కలెక్షన్ల జోరు ఇంకా ఆగట్లేదు. ఈ క్రమంలోనే హీరో నాని నటించిన సినిమా రికార్డు కలెక్షన్లను బ్రేక్ చేసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

.
.

Tillu Square Collections : టిల్లూ స్క్వేర్ ఊహించిన దాని కన్నా పెద్ద సక్సెస్ కొట్టేసింది. రైటర్‌గా, యాక్టర్‌గా సినిమా కోసం డ్యూయెల్ రోల్‌లో పనిచేసిన సిద్దు జొన్నలగడ్డ ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్​గా నటించిన ఈ చిత్రం విడుదలై మూడు వారాలు దాటేసినా ఇంకా ఆడుతూనే ఉంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది. అయితే ఈ చిత్రం ఇప్పుడు నాని సినిమాకు మించిన కలెక్షన్లను వసూలు చేసింది.

దసరా రికార్డ్ బ్రేక్ - నాని, కీర్తి సురేశ్ జోడీగా తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ దసరా లైఫ్ టైమ్ కలెక్షన్లు రూ.115 కోట్ల గ్రాస్. అయితే ఇప్పుడు టిల్లూ స్క్వేర్ రూ.125 కోట్లకుపైగా వసూలు చేసి దసరాను బ్రేక్​ చేసింది. అసలే సమ్మర్, యూత్ అందరికీ ఈ వేసవి సెలవుల్లో మంచి ఫన్నీ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తూ ఇలా వరుస రికార్డులను బ్రేక్ చేస్తోంది టిల్లన్న మూవీ.

మరో రూ.5కోట్లు సాధిస్తే - ఇక టాలీవుడ్​ మిడిల్ రేంజ్ హీరోల్లో నానితో పాటు విజయదేవరకొండ కూడా ఒకరు. ఈయన నటించిన గీతా గోవిందం లైఫ్​ టైమ్ కలెక్షన్స్ రూ.130కోట్లు. ఆ తర్వాత ఈయన చేసిన ఏ సినిమా కూడా ఆ రేంజ్​ వసూళ్లను సాధించలేదు. అంటే ఈ లెక్కన మరో రూ.5 కోట్లు సాధిస్తే సిద్దూ జొన్నలగడ్డ నెం.1 పొజిషన్​కు వెళ్లే అవకాశాలు ఉంటాయని సినీ ప్రేక్షకులు అంటున్నారు.

రూ.35కోట్లకు - రిలీజ్‌కు ముందే ఓటీటీ హక్కులను విక్రయించింది సినిమా యూనిట్. నెట్‌ఫ్లిక్స్‌ రూ.35 కోట్లకు సినిమా హక్కులను కొనుగోలు చేసిందట. మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిపి సంయుక్తంగా నిర్మించారు. సిద్దు జొన్నలగడ్డ సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. గత చిత్రాలకు భిన్నంగా అనుపమ ఈ మూవీలో వెరీ హాట్​గా లిల్లీ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.

త్వరలోనే టిల్లు క్యూబ్​ - ఇకపోతే డీజే టిల్లుతో ఫ్యాన్స్​ను పెంచుకున్న సిద్దు ఈ సినిమాతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నారు. త్వరలోనే టిల్లు క్యూబ్​ను కూడా రెడీ చేయనున్నారు. అలాగే ఈయనతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు కూడా కథలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.