ETV Bharat / entertainment

ఓటీటీలో 'హనుమాన్‌'- ఈ వారం థియేటర్​లో చిన్న చిత్రాలదే హవా

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 2:41 PM IST

This Week Release Movies : ఈ వారం బాక్సాఫీస్ వద్ద పలు చిన్న సినిమాలు సందండి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదికి పైగా చిత్రాలు అటు థియేటర్​లో విడుదల కానున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ అలరించేందుకు పలు చిత్రాలు, సిరీస్​లు రెడీగా ఉన్నాయి. ఆ చిత్రాలు ఎంటో చుద్దాం.

This Week Release Movies
This Week Release Movies

This Week Release Movies : ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు ఇంట్రెస్టింగ్​ అండ్ హిట్ సినిమా/సిరీస్​లు అటు థియేటర్​లో ఇటు ఓటీటీలో రిలీజ్​కు రెడీ అయిపోయాయి. అయితే ఈ వారం చిన్న సినిమాల హవా కొనసాగుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదికి పైగా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అటు ఓటీటీలోనూ పలు చిత్రాలు/ సిరీస్​లు రెడీగా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రాలు
సాయిరాం శంకర్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'వెయ్​ దరువెయ్' చిత్రం మార్చి 15న విడుదల కానుంది. నవీన్​ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దేవ్​రాజ్ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరిలియో సంగీతాన్ని అందిస్తున్నారు. అదే రోజు 'రజాకార్' చిత్రం రిలీజ్​కు సిద్ధంగా ఉంది. బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. అనన్య నాగళ్ల, ధనుష్‌, సలోని నటించిన 'తంత్ర', చైతన్యరావ్‌ ప్రధాన పాత్రలో వస్తున్న ' షరతులు వర్తిస్తాయి', 'లైన్​ మ్యాన్', 'రవికుల రఘురామ', 'లంబసింగి', మార్చి 15న విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రాశీఖన్నా ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'యోధ', 'ప్రేమలో ఇద్దరు', 'కుంగ్‌ఫూ పాండా4', 'మాయ 2024' చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

ఓటీటీలో స్ట్రీమింగ్​ అయ్యే చిత్రాలు/సిరీస్​లు

జియో సినిమా

హను-మాన్‌ (హిందీ)- మార్చి 16

నెట్‌ఫ్లిక్స్‌

టూ కిల్‌ ఏ టైగర్‌ (హిందీ)- మార్చి 10

యంగ్‌ రాయల్స్‌ (హిందీ) -మార్చి 11

జీసస్‌ రెవల్యూషన్‌ (హిందీ) -మార్చి 12

24 హవర్స్‌ విత్‌ గాస్పర్‌ (హాలీవుడ్‌)- మార్చి 14

లాల్‌ సలామ్‌ (తమిళ)- మార్చి 15

మర్డర్‌ ముబారక్‌ (హిందీ)- మార్చి 15

అమెజాన్‌ ప్రైమ్‌

బిగ్‌ గర్ల్స్‌ డోంట్‌ క్రై (హిందీ)- మార్చి 14

డిస్నీ+హాట్‌స్టార్‌

లవర్‌ (తమిళ చిత్రం) -మార్చి 15

సేవ్‌ ది టైగర్స్‌2 (తెలుగు సిరీస్‌)- మార్చి 15

సోనీలివ్‌

భ్రమయుగం (మలయాళం/తెలుగు) -మార్చి 15

లయన్స్‌ గేట్‌ ప్లే

నో వే అప్‌ (తెలుగు వెర్షన్‌)- మార్చి 15

జీ5

మే అటల్‌ హూ (హిందీ) - మార్చి 14

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.