ETV Bharat / entertainment

రాకింగ్ స్టార్​ యశ్ కొత్త సినిమాలో బాలీవుడ్ బాద్​ షా

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 10:29 AM IST

Updated : Feb 6, 2024, 10:50 AM IST

రాకింగ్ స్టార్​ యశ్ కొత్త సినిమాలో బాలీవుడ్ బాద్​ షా
రాకింగ్ స్టార్​ యశ్ కొత్త సినిమాలో బాలీవుడ్ బాద్​ షా

Sharukh Khan Yash Movie : కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న కొత్త సినిమాలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటిస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలు.

Sharukh Khan Yash Movie : గతేడాది పఠాన్, జవాన్, డంకీ అంటూ వరుస సినిమాలతో హ్యాట్రిక్​ బ్లాక్ బాస్టర్​ హిట్​ అందుకుని మళ్లీ సక్కెస్​ ట్రాక్​ ఎక్కారు బాలీవుడ్‌ సూపర్ స్టార్​ షారుక్‌ ఖాన్‌. అలాగే ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తానని అభిమానులకు మాట కూడా ఇచ్చారు. దీంతో బాద్​ షా ఈ ఎలాంటి ఎలాంటి కథలతో తెరపై సందడి చేస్తారా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకైతే తన నుంచి రాబోయే ప్రాజెక్టుల గురించి ఎలాంటి సమాచారం అందలేదు.

తాజాగా మాత్రం ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఆయన కన్నడ రాకింగ్ స్టార్​ యశ్‌ నటిస్తున్న 'టాక్సిక్‌' చిత్రంలో గెస్ట్ రోల్​ పోషించనున్నట్లు సమాచారం అందింది. ఈ చిత్రాన్ని గీతూ మోహన్‌ దాస్‌ గ్రాండ్​గా తెరకెక్కిస్తున్నారు. 'గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో గెస్ట్ రోల్​ కోసం షారుక్‌తో చర్చలు జరుపుతున్నారు గీతూ మోహన్‌. ఇందులో ఆయనది ఓ పవర్ ఫుల్ రోల్​. దీన్ని షారుక్‌ మాత్రమే చేయగలరని చిత్రబృందం గట్టిగా నమ్ముతోంది. త్వరలో దీని గురించి అఫీషియల్​గా అనౌన్స్ చేస్తాం" అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా, మాస్‌, యాక్షన్‌ ఎలిమెంట్స్​ను మేళవించి రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా ఈ సినిమా కథ ఉండబోతుందని తెలిసింది.

ముగ్గురు హీరోయిన్లు(Yash Toxic Movie Heroines) : యశ్ 19వ ప్రాజెక్ట్ అయిన ఈ 'టాక్సిక్'లో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్​తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నారని తెలిసింది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రంతోనే కరీనాకపూర్ సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్టవుతుంది. ఇక కరీనాతో పాటు శృతిహాసన్, సాయి పల్లవితోనూ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై మూవీటీమ్​ ఇంకా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇవ్వలేదు. వచ్చే ఏడాది ఏప్రిల్​లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

SSMB 29 - వారిని పక్కన పెట్టేసిన జక్కన్న!

సాయి పల్లవి సినిమా రీ రిలీజ్​ - ఐదు రోజుల్లో రికార్డ్ రేంజ్​ కలెక్షన్స్​!

Last Updated :Feb 6, 2024, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.