ETV Bharat / entertainment

అక్కనే మించిపోయేలా - సాయిపల్లవి సిస్టర్​ తీన్మార్​ డ్యాన్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 10:34 PM IST

Saipallavi Sister Dance : నిశ్చితార్థ వేడుకలో సాయి పల్లవి సిస్టర్ పూజా అదిరిపోయే రేంజ్​లో స్టెప్పులేసింది. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. మీరు చూశారా?

అక్కనే మించిపోయేలా - సాయిపల్లవి సిస్టర్​ తీన్మార్​ డ్యాన్స్​
అక్కనే మించిపోయేలా - సాయిపల్లవి సిస్టర్​ తీన్మార్​ డ్యాన్స్​

Saipallavi Sister Dance : లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి ప్రస్తుతం ఫ్యామిలీతో బిజీగా గడుపుతోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె ఇంట పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ నిశ్చితార్థం రెండు రోజుల క్రితమే గ్రాండ్​గా జరిగింది. త్వరలోనే ఈ పెళ్లి జరగనుంది. అయితే చెల్లి నిశ్చితార్థంలో అక్క సాయిపల్లవి హడావిడి కూడా ఎక్కువగానే కనిపించింది.

మరోవైపు అందంలో కానీ, డ్యాన్స్​లో కానీ అక్కకు ఏమాత్రం తీసిపోదు పూజా కన్నన్​. ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడుతున్న సంతోషం పూజా ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే ఎంగేజ్​మెంట్​ పూర్తైన తర్వాత పూజా వేడుకకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్​ మీడియాలో షేర్ చేస్తోంది.

తాజాగా నిశ్చితార్థ వేడుకలో కుటుంబం మొత్తం డ్యాన్స్ వేస్తున్న వీడియోను షేర్ చేసింది పూజా. విషయానికొస్తే - సాయి పల్లవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడా విషయంలో అక్కనే మించిపోయింది పూజా. కాబోయే భర్తతో కలిసి అదిరిపోయే రేంజ్​లో స్టెప్పులు వేసింది. పసుపు రంగు చీరలో, జుట్టుకు ముడివేసి సాయి పల్లవి ఎంత అందంగా అయితే కనిపించిందో, అంతకన్నా అందంగా, క్యూట్​గా కనిపించింది పూజా. ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడబోతున్న సంతోషంలో తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టేసింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమాలోని మా మదురే సాంగ్​కు అదిరిపోయేలా చిందులేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

సాయి పల్లవి చీర ధర : ఇకపోతే ఈ ఎంగేజ్​మెంట్​ వేడుకలో సాయి పల్లవి కట్టుకున్న చీర ధర కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంతో సింపుల్ లుక్​లో కనిపించిన సాయి పల్లవి వేడుకలో చెల్లితో పాటు స్పెషల్ అట్రాక్షన్​గా కనిపించింది. దీంతో ఆమె కట్టిన చీర ధర తెలుసుకునేందుకు కొంతమంది ఆరాటపడ్డారు నెటిజన్లు. అయితే దీని ధర అక్షరాల రూ.50 వేలు అని తెలిసింది. ఇక సాయిపల్లవి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి నాగచైతన్య 'తండేల్​'.

'అది చూసి వాంతు వచ్చినట్టైంది' - ఆ స్టార్ హీరో మూవీపై రాధిక కామెంట్స్​!

'ఆదిపురుష్‌'లో ఆ సీన్స్‌ అస్సలు నచ్చలేదు : ప్రశాంత్‌ వర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.