ETV Bharat / entertainment

RC 16 షురూ కాకుండానే ట్రెండింగ్​లోకి చరణ్ కొత్త సినిమా! - RAMCHARAN RC 17 Director

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 1:47 PM IST

Updated : Mar 21, 2024, 1:59 PM IST

Ramcharan RC 17 Director : ప్రస్తుతం రామ్​చరణ్​ గేమ్​ ఛేంజర్​ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఆర్​సీ 16 చిత్రాన్ని బుచ్చిబాబుతో మొదలుపెట్టారు. ఇది ఇంకా రెగ్యులర్ షూటింగ్​ను ప్రారంభించుకోలేదు అప్పుడే ఆర్​సీ 17కు సంబంధించి ఓ సూపర్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు.

RC 16 షురూ కాకుండానే ట్రెండింగ్​లోకి చరణ్ కొత్త సినిమా!
RC 16 షురూ కాకుండానే ట్రెండింగ్​లోకి చరణ్ కొత్త సినిమా!

Ramcharan RC 17 Director : గ్లోబల్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్​ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్​ రిలీజ్​కు రెడీ అవుతోంది. ఇకపోతే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో 16 బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతోంది. అయితే ఈ నేపథ్యంలో చరణ్ అభిమానులకు కిక్కిచ్చే మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే సుకుమార్, చెర్రీ కాంబోలో మరో సినిమా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

సుకుమార్​కు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ఆర్సీ 17 వర్కింగ్ టైటిల్​ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అంతేకాదు కథ కూడా ఫైనల్ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీని ప్రకటిస్తారని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో రంగస్థలం వచ్చి బాక్సాఫీస్ ముందు భారీ హిట్​ను అందుకుంది. దీని తర్వాత రామ్ చరణ్ సుకుమార్ మధ్య చాలాకాలంగా మరో ప్రాజెక్ట్​ కోసం చర్చలు జరిగాయని వార్తలు వచ్చాయి. చివరికి ఇది ఇప్పటికీ కార్యరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఆర్ సీ 17హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండింగ్ అవుతుందో. మరి ఇందులో నిజముందో లేదో తెలీదు కానీ ఎప్పుడు అప్డేట్​ ఇస్తారో అంటూ ఫ్యాన్స్ మాత్రం తెగ వెయిట్ చేస్తున్నారు.

ఇక సుకుమార్ పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నారు. ఆ చిత్రం తర్వాత పార్ట్ 3 కూడా ఉండనుంది. మరి చెర్రీతో ఆయన ఎప్పుడు సినిమా చేయనున్నాలో తెలియలేదు. మరోసారి వీరి కాంబో రిపీట్ అయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవ్వాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్.

కాగా, రామ్​చరణ్​ గేమ్ ఛేంజర్ సినిమా విషయానికొస్తే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వైజాగ్​లో షూటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

అల్లు అర్జున్ గ్రేటెస్ట్ రికార్డ్​ - సౌత్ ఇండియా నుంచి తొలి హీరోగా! - Alluarjun Instagram Record

సమంతను చూసి భయపడిపోయాను - తను అలాంటి వ్యక్తి! : సుహాస్

Last Updated :Mar 21, 2024, 1:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.