ETV Bharat / entertainment

'ఓజీ' రిలీజ్ డేట్​ ఫిక్స్​ - హంగ్రీ చీతా ఆ రోజే రానున్నాడు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 5:02 PM IST

Updated : Feb 6, 2024, 5:17 PM IST

Pawan Kalyan OG Release Date : పవర్ స్టార్ పవన్​ కల్యాణ్, సుజీత్​ కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్​ మూవీ 'ఓజీ'. తాజాగా ఈ మూవీకి సంబంధించిన లేటెస్ట్ అప్​డేట్​ను మేకర్స్ రివీల్​ చేశారు. ఈ మూవీ రిలీజ్​ డేట్​ను ఫిక్స్​ చేశారు. ఇంతకీ 'ఓజీ' ఎప్పుడు రిలీజ్ కానుందంటే ?

Pavan Kalyan OG Release Date
Pavan Kalyan OG Release Date

Pawan Kalyan OG Release Date : అటు పవన్ ఫ్యాన్స్​తో పాటు ఇటు మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఓజీ' మూవీ రిలీజ్​ డేట్​ రానే వచ్చింది. తాజాగా ఈ సినిమా రిలీజ్​ డేట్​ను మేకర్స్​ రివీల్​ చేశారు. వరల్డ్​ వైడ్​గా ఈ చిత్రం 2024 సెప్టెంబర్ 24న విడుదల కానున్నట్లు ప్రకటించారు. పవన్ స్టైలిష్​ లుక్​లో ఉన్న ఓ స్పెషల్ పోస్టర్​ ద్వారా ఆ విషయాన్ని ఫ్యాన్స్​కు తెలియజేశారు.

Pawan Kalyan OG Cast : ఇక 'ఓజీ' సినిమా విషయానికి వస్తే ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో రూపందుతున్న ఈ సినిమాలో పవన్​ కల్యాణ్​ ఓ గ్యాంగ్‌స్టర్​గా కనిపించనున్నారు. ఇందులో పవన్ సరసన గ్యాంగ్​లీడ్​ ఫేమ్​ కోలీవుడ్ నటి ప్రియాంక అరుల్ మోహన్​ నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్ హీరో ఇమ్రాన్‌ హష్మి ఈ సినిమాలో విలన్ రోల్​లో మెరవనున్నారు. వీరితో పాటు అర్జున్‌ దాస్‌, వెంకట్‌, శ్రియారెడ్డి, సీనియర్ నటుడు వెంకట్​ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Pawan Kalyan OG Title : ఈ సినిమాకు ఓ పవర్​ఫుల్​ టైటిల్​ను ఫిక్స్​ చేసినట్లు తెలుస్తోంది. తొలుత ఈ మూవీ వర్కింగ్​ టైటిల్​ అయిన 'ఓజీ'ని అందరూ 'ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్' అని అనుకున్నారు. కానీ దాని అర్థం 'ఓజాస్ గంభీర' అని తెలిసింది. దీంతో దీన్నే టైటిల్గా ఫిక్స్ చేస్తే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారట, కానీ ఈ సినిమాకు మరింత సాలిడ్ టైటిల్​ను మూవీ టీమ్​ డిసైడైందని సమాచారం.

అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్ కొత్తగా 'హంగ్రీ చీతా' అనే టైటిల్ను రిజిస్టర్ చేయించిందట. దీంతో ఈ టైటిల్​ గురించి చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ఓజీ మేకర్స్ మాత్రం ఈ సినిమాకు 'They Call Him OG' అనే టైటిల్నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్​ కన్​ఫ్యూజన్​లో ఉన్నారు. ఈ రెండింట్లో మేకర్స్​ దేన్ని ఫిక్స్ చేస్తారన్న విషయం గురించి డిస్కషన్ పెట్టారు. అయితే మేకర్స్ క్లారిటీ ఇస్తేకానీ అసలు విషయం తెలియదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రికార్డ్​ ధరకు 'ఓజీ' ఆడియో రైట్స్​ - ఏకంగా ఎన్ని కోట్లంటే?

మరోసారి పాట పాడబోతున్న పవన్ - సూపర్ అప్డేట్ ఇచ్చిన తమన్​

Last Updated :Feb 6, 2024, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.