ETV Bharat / entertainment

సీక్రెట్​గా బాలయ్య బాబు పరిచయం చేసిన బ్యూటీ పెళ్లి - ఫ్యాన్స్ సర్​ప్రైజ్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 5:09 PM IST

Natasha Doshi Marriage : టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బ్యూటీ పెళ్లి పీటలెక్కింది. సీక్రెట్​గా పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ వివరాలు.

సీక్రెట్​గా బాలయ్య బాబు హీరోయిన్​ పెళ్లి - ఫ్యాన్స్ షాక్​!
సీక్రెట్​గా బాలయ్య బాబు హీరోయిన్​ పెళ్లి - ఫ్యాన్స్ షాక్​!

Natasha Doshi Marriage : ఫిల్మ్ ఇండస్ట్రీలో బాజాభజంత్రీల మోత గట్టిగా వినిపిస్తోంది. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటుంటే మరికొంతమంది అరేంజ్​ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఇప్పటికే గత నెల రోజుల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్​తో పాటు దాదాపు ఐదు ఆరు జంటలు పెళ్లి పీటలెక్కాయి. తాజాగా మరో తెలుగు హీరోయిన్ శుభవార్త వినిపించింది.

ఆమెనే ముంబయికి చెందిన నటాషా దోషి. 1993 ముంబయిలో పుట్టిన ఈ భామ చదువు పూర్తయ్యాక సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మలయాళ చిత్రాలతో నటిగా కెరీర్​ను ప్రారంభించింది. 2012 నుంచి 2017 వరకు మాంత్రికన్​,హైడ్ అండ్ సీక్​, కాల్ మీ, కాపుచీనో వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.

Natasha Doshi Movies : అనంతరం 2018లో నటసింహం బాలయ్య నటించిన జై సింహా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం సీనియర్ నటుడు శ్రీకాంత్​తో కలిసి కోతలరాయుడులో హీరోయిన్​గా, నందమూరి హీరో కల్యాణ్ రామ్​తో కలిసి ఎంతమంచి వాడవురా చిత్రంలో స్పెషల్ సాంగ్​లో మెరిసింది. ఆ తర్వాత కనపడలేదు.

Natasha Doshi Wedding Pics : ఇక 2020 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన నటాషా దోషి గతేడాది జులైలో మనన్ షా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. తనకు నిశ్చితార్థం జరిగినట్లు చెప్పి ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 31న కుటుంబ సభ‍్యుల సమక్షంలో నటాషా గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయం అప్పుడు తెలియలేదు. దాదాపు నెల రోజుల తర్వాత తాను తాజాగా పోస్ట్ చేసిన పెళ్లి ఫొటోల ద్వారా ఈ విషయం తెలిసింది. ఈ పిక్స్ చూస్తుంటే వివాహ వేడుక గ్రాండ్​గానే జరిగినట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు ఈ అందాల భామకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే మరో గుడ్ న్యూస్ కూడా చెప్పాలంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

ఆ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం -స్టేజ్​ మీద నటి క్లారిటీ!

ఈ స్టార్స్ వెడ్డింగ్స్ చాలా కాస్ట్లీ - వేల కోట్లలోనే పెళ్లి ఖర్చులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.