ETV Bharat / entertainment

కొత్త వారం షురూ - ఈటీవీలోకి బోలెడు తెలుగు సినిమాలు - మీరేం చూస్తారు?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 19, 2024, 9:55 AM IST

Updated : Feb 19, 2024, 11:31 AM IST

Movies In Etv : కొత్త వారం మొదలైపోయింది(ఫిబ్రవరి 19). ఇక ఉద్యోగస్థులు తన డ్యూటీలకు యథావిధిగా వెళ్లిపోతారు. అయితే ఇంట్లో ఉండేవారు ఓటీటీలు, టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు, కార్యక్రమాలతో కాలక్షేపం చేస్తుంటారు. మరి నేడు ఈటీవీలో ఏఏ సమయానికి ఏఏ చిత్రాలు వస్తున్నాయో వంటి వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.

కొత్త వారం షురూ - ఈటీవీలోకి బోలెడు తెలుగు సినిమాలు - మీరేం చూస్తారు?
కొత్త వారం షురూ - ఈటీవీలోకి బోలెడు తెలుగు సినిమాలు - మీరేం చూస్తారు?

Movies In Etv : కొత్త వారం మొదలైపోయింది(ఫిబ్రవరి 19). దీంతో జాబ్​ హోల్డర్స్​ అంతా ఉద్యోగాలకు వెళ్లిపోతారు. అయితే ఇంట్లో ఉండేవారు మాత్రం ఫోన్​లతో పాటు టీవీలతోనే కాలక్షేపం చేస్తుంటారు. ముఖ్యంగా ఆడవారు సీరియళ్లతో పాటు బుల్లితెరపై వచ్చే చిత్రాలను చూస్తుంటారు. వారి కోసం నేడు(ఫిబ్రవరి 19) ఈటీవీ ఛానల్​లో ఏఏ సమయానికి ఏఏ చిత్రాలు వస్తున్నాయో వంటి వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం.

వివరాల్లోకి వెళితే. ఈటీవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను అందిస్తూ ఇంటిల్లిపాదిని ఎంటైర్‌టైన్‌ చేస్తోంది. ఈటీవీ ప్లస్, ఈటీవీ సినిమా, ఈటీవి విన్​తో ఎన్నో సినిమా సిరీస్​లను అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రతివారంలానే నేడు కూడా బోలేడు హిట్​ సినిమాలను ప్రసారం చేస్తోంది. అయితే వీటిలో ఈరోజు ఎక్కువగా విక్టరీ వెంకటేశ్‌ నటించిన చాలా చిత్రాలు ప్రసారం కానుండటం విశేషం.

ఈటీవీ(ETV)లో ఉద‌యం 9 గంట‌ల‌కు నందమూరి నటసింహం బాల‌కృష్ణ‌, అందాల తార రోజా న‌టించిన సోషియో ఫాంటసీ భైర‌వ ద్వీపం ప్రసారం కానుంది. ఈ చిత్రం అపట్లో తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ టీవీ ప్ల‌స్​లో (E TV Plus) మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు విక్టరీ వెంక‌టేశ్‌ నటించిన అగ్గిరాముడు, రాత్రి 10 గంట‌ల‌కు కింగ్​ నాగార్జున‌ నటించిన చైత‌న్య‌ చిత్రం ప్రసారం కానుంది. ఈ సినిమాలు కూడా అపట్లో మంచి హిట్స్​​ అందుకున్నాయి.

ఇక ఈ టీవీ సినిమా ( TV Cinema)లో ఉద‌యం 7 గంట‌ల‌కు వెంక‌టేశ్‌ నటించిన చిన‌రాయుడు, ఉద‌యం 10 గంట‌ల‌కు జూ.ఎన్టీఆర్‌ నటించిన అల్ల‌రి రాముడు టెలికాస్ట్ కానున్నాయి. మ‌ధ్యాహ్నం 1 గంటకు వెంక‌టేశ్‌ నటించిన చిన్న‌బ్బాయ్‌, సాయంత్రం 4 గంట‌లకు రాజేంద్ర‌ప్ర‌సాద్‌ నటించిన మాయ‌లోడు, రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీఆర్ నటించిన అన్నాత‌మ్ముడు, రాత్రి 10 గంట‌ల‌కు విజ‌య్‌కాంత్ నటించిన పోలీస్ అధికారి రానున్నాయి. ఇవన్నీ కూడా అప్పట్లో బాక్సాఫీస్​ దగ్గర మంచి విజయం అందుకున్న చిత్రాలే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ వారం మొత్తం 16 సినిమా/సిరీస్​లు - ఆ సెన్సేషనల్​ మూవీ కూడా

తెలుగు ఆడియెన్స్ - ఈ రెండు మలయాళ చిత్రాల గురించే చర్చంతా!

Last Updated :Feb 19, 2024, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.