ETV Bharat / entertainment

విశాల్ యాక్షన్ డ్రామా 'రత్నం' ఎలా ఉందంటే? - Ratnam Movie review

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 26, 2024, 4:27 PM IST

Updated : Apr 26, 2024, 4:58 PM IST

Ratnam Review
Ratnam Review

Vishal Ratnam Movie Review : విశాల్​ - హరి కాంబో నుంచి లేటెస్ట్ మూవీ రత్నం తాజాగా విడుదలైంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?

Vishal Ratnam Movie Review :

చిత్రం: రత్నం;

నటీనటులు: విశాల్‌, ప్రియా భవానీ శంకర్‌, సముద్రఖని, రామచంద్రరాజు, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, యోగిబాబు, మురళీ శర్మ, హరీశ్‌ పేరడి తదితరులు;

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌;

ఎడిటింగ్‌: టి.ఎస్‌. జై;

సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్‌;

నిర్మాత: కార్తికేయన్‌ సంతానం, అలంకార్‌ పాండియన్‌;

రచన, దర్శకత్వం: హరి.

దర్శకుడు హ‌రి సినిమా అన‌గానే సినీ ప్రియుల మదిలో ఉత్కంఠగా సాగే యాక్ష‌నే మెదులుతుంది. సింగం సిరీస్​తో ఆయ‌న చూపించిన ప్ర‌భావం అలాంటిది మరి. విశాల్‌తోనూ ఆయ‌న తెరకెక్కించిన భ‌ర‌ణి, పూజ సినిమాలు బాక్సాఫీస్​ వద్ద భారీ విజయాల్ని అందుకున్నాయి. దీంతో తాజాగా వీరిద్దరి కాంబోలో వచ్చిన ర‌త్నంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

క‌థేంటంటే : త‌మిళ‌నాడు, ఆంధ్ర స‌రిహ‌ద్దుల్లో ఈ సినిమా కథ సాగుతుంది. తాను అనుకున్నది సాధించడానికి హ‌త్య‌లు చేయ‌డానికి కూడా వెన‌కాడ‌ని యువ‌కుడు ర‌త్నం (విశాల్‌). ఎమ్మెల్యే ప‌న్నీర్‌స్వామి(స‌ముద్ర‌ఖ‌ని)కి కుడి భుజంగా ఉంటూ పోలీసుల‌కు స‌గం స‌మ‌స్య‌ల్ని కూడా త‌గ్గిస్తుంటాడు విశాల్​. అయితే అతడి జీవితంలో ఎన్నో సమస్యలు. చిన్నప్పుడే త‌ల్లి రంగనాయ‌కి పోలీస్‌స్టేష‌న్‌లో ఉరి వేసుకుని చనిపోతుంది. అతడి బాల్యం జైలులో గ‌డుస్తుంది. అలాంటి ర‌త్నం లైఫ్​లోకి మ‌ల్లిక (ప్రియ‌భ‌వానీ శంక‌ర్‌) ఎంటర్ అయ్యాక అంతా మారిపోతుంది. కానీ మల్లికను త‌మిళ‌నాడులోని తిరుత్త‌ణిలో అరాచ‌కాలకు పాల్ప‌డే లింగం బ్ర‌ద‌ర్స్ (ముర‌ళీశ‌ర్మ‌, హ‌రీష్ పేర‌డి) చంపాలనుకుంటారు. ఇంత‌కీ మ‌ల్లిక ఎవ‌రు? ఆమెను లింగం బ్ర‌ద‌ర్స్ ఎందుకు చంపాల‌నుకున్నారు? రత్నం ఆమెను ఎలా కాపాడాడు? అసలు అతడి త‌ల్లి రంపోలీస్‌స్టేష‌న్‌లో ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకుంది? అనేదే కథ.

ఎలా ఉందంటే : హ‌రి సినిమా అంటేనే వీరోచిత‌మైన పోరాటాలు, ప‌రుగులు పెట్టే స‌న్నివేశాలు. మాస్‌, యాక్ష‌న్, సెంటిమెంట్ అంశాల్ని కలిపి బాగా చూపిస్తారు. విశాల్‌తో గతంలో ఆయన చేసిన సినిమాలు కూడా అలాంటివే. ఇప్పుడీ రత్నం చిత్రంలోనూ ఛేజింగ్‌లు, యాక్ష‌న్ సీన్స్​ ప‌రుగులు పెడ‌తాయి. కానీ కథ కొత్తగా అనిపించదు. మ‌ల్లిక పాత్ర ప‌రిచ‌యం, ఆమెపై హ‌త్యాయ‌త్నంతో క‌థ‌లో మ‌లుపులు చోటు చేసుకుంటాయి. కానీ సెకండాఫ్​లో సీన్స్​ వాస్త‌వానికి ద‌గ్గ‌ర‌గా అనిపించ‌వు.

ఏ పాత్ర‌తోనూ స‌గ‌టు ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ కాలేని ప‌రిస్థితి ఉంటుంది. స‌న్నివేశాలు బలవంతంగా రాసిన‌ట్టు అనిపిస్తుంది. క‌థ ముగుస్తుంద‌నుకున్న ప్ర‌తిసారీ మ‌రో కొత్త అంకం మొద‌ల‌వుతుంది. అంతా సాగ‌దీత వ్య‌వ‌హార‌మే. హీరో, హీరోయిన్ మ‌ధ్య కెమిస్ట్రీ కూడా అంతా వర్కౌట్ కాదు. తల్లి సెంటిమెంట్ బాగుంది. క్లైమాక్స్​ స‌న్నివేశాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. ఫైనల్​గా కాలం చెల్లిన క‌థ‌కు, బ‌ల‌వంతంగా కొన్ని మ‌లుపుల్ని జోడించి తీసిన సినిమా ఇది.

ఎవ‌రెలా చేశారంటే : విశాల్‌ ర‌త్నంగా అద్భుతంగా నటించారు. భావోద్వేగాల్నీ పండించారు. హీరోయిన్​ ప్రియ భ‌వానీ శంక‌ర్‌కు హీరోకు స‌మాన‌మైన పాత్ర దొరికింది. ఎమ్మెల్యేగా క‌నిపించే స‌ముద్ర‌ఖ‌ని పాత్ర ఆక‌ట్టుకుంటుంది. లింగం బ్ర‌ద‌ర్స్‌ ముర‌ళీశ‌ర్మ‌, హ‌రీష్ పేర‌డీ పాత్ర‌లూ బాగున్నాయి. రాజేంద్ర‌న్‌, యోగిబాబు పెద్ద‌గా న‌వ్వించ‌లేక‌పోయారు. టెక్నికల్​ అంశాలు బాగున్నాయి. దేవీ శ్రీ సంగీతం ప్ర‌ధాన‌బ‌లం. కానీ దర్శకుడు వైవిధ్యం చూపించ లేకపోయారు. పోరాటాలు, వేగవంత‌మైన సీన్స్​పైనే ఆధార‌ప‌డుతున్నారు. మారుతున్న ప్రేక్ష‌కుల అభిరుచుల‌కి త‌గ్గ‌ట్టుగా క‌థ‌ను చెప్ప‌లేకపోతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సలార్ 2​లో ఆమె 'గేమ్​ఛేంజర్' కాదట - అదంతా ఫేక్​! - Prabhas Salaar 2

ఇండస్ట్రీలోకి అబ్బాయిగా ఎంట్రీ - ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు స్టార్​ హీరోయిన్​గా ఇమేజ్​! - AHSAAS CHANNA

Last Updated :Apr 26, 2024, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.