ETV Bharat / entertainment

కెరీర్ హైప్ ఉన్న సమయంలోనే గుడ్ బై చెప్పిన హీరోయిన్ - Star Actress Quit Movies

author img

By ETV Bharat Telugu Team

Published : May 23, 2024, 7:24 AM IST

బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలలో టాప్ హీరోల సరసన కనిపించి, మెప్పించిన అసిన్, సినిమాలకు దూరం అవడానికి కారణమిదే. ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నారో తెలుసా?

Actress Asin Career
Actress Asin Career (Source: Getty Images)

Actress Asin Career: కెరీర్ స్టార్టింగ్ నుంచే కమర్షియల్ సక్సెస్‌లు అందుకుంటూ, తెలుగు, తమిళం, హిందీ అన్ని పరిశ్రమల్లోనూ తిరుగులేని హీరోయిన్​గా ఎదిగి పెళ్లి అవగానే నటనకు గుడ్ బై చెప్పేసిన హీరోయిన్లలో అసిన్ ఒకరు. బాలీవుడ్, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రోజుల్లోనే రూ.1300 కోట్ల ఆస్తులు ఉన్న బిజినెస్‌మేన్‌ను పెళ్లాడింది.

15 ఏళ్లకే యాక్టింగ్​ను కెరీర్​గా ఎంచుకున్న ఆమె 18ఏళ్లకే స్టార్ ఇమేజ్ సంపాదించుకుంది. 2003లో పూరీ జగన్నాథ్ డైరక్ట్ చేసిన 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలో నటించినప్పుడు అసిన్ వయస్సు 18ఏళ్ల మాత్రమే. తెలుగులో తొలి సినిమాతోనే కమర్షియల్ సక్సెస్ కొట్టేసింది. ఆ తర్వాత సూర్య హీరోగా తీసిన 'గజిని' సినిమాలో నటించి దక్షిణాదిలో లీడింగ్ హీరోయిన్ అయిపోయింది.

తెలుగులో నటించిన ప్రతి సినిమాలోనూ అగ్ర హీరోల పక్కనే కనిపించింది. బాలకృష్ణ సరసన 'లక్ష్మీ నరసింహ', వెంకటేశ్​తో 'ఘర్షణ', నాగార్జునతో 'శివమణి', ప్రభాస్​తో 'చక్రం' సినిమాలో నటించి మెప్పించింది. తమిళ్‌లో 'శివకాశీ', 'వరాలరు', 'పోకిరీ', 'వేల్', 'దశావతారం' లాంటి హిట్ సినిమాల్లో నటించి కోలీవుడ్​లోనూ హవా చూపించింది. 'గజిని' హిందీ వెర్షన్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అసిన్ తన తర్వాతి సినిమా 'రెడీ'లో సల్మాన్ ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అది కూడా బ్లాక్ బస్టర్ కావడం వల్ల అక్షయ్ కుమార్ హీరోగా 'హౌజ్ ఫుల్- 2', 'ఖిలాడీ 786'లో నటించింది. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ వస్తున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసి చేసేసుకుంది.

సినీ కెరీర్​లో మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న అసిన్, ప్రొఫెషనల్ భరతనాట్యం డ్యాన్సర్​గానూ పలు స్టేజ్ షోలు ఇచ్చిందట. పలు భాషల్లో నటించిన అసిన్ ఏకంగా ఎనిమిది భాషలు మాట్లాడగలదు కూడా. 2016లో రాహుల్ శర్మ అనే వ్యక్తిని క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో పెళ్లాడింది. వారిద్దరికీ 2017లో ఒక పాప కుడా పుట్టింది. ఇంతకీ ఈ రాహుల్ శర్మ ఎవరో కాదు మైక్రోమ్యాక్స్ కంపెనీకి కో ఓనర్. ఇప్పుడు గ్లామర్ వరల్డ్​కు దూరంగా బతుకుతూ ముద్దుల కూతుర్ని పెంచుకుంటూ, లగ్జరీ లైఫ్ గడుపుతుంది అసిన్. సినిమాలకు దూరమైనా తన అభిమానులకు దగ్గరగా ఉండేందుకు సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది అసిన్.

అక్షయ్ బాలీవుడ్​ ఎంట్రీ.. ఈ హీరోయిన్లు పుట్టనేలేదు!

జూనియర్‌ అసిన్‌ ఫోటోతో ఓనం శుభాకాంక్షలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.