ETV Bharat / entertainment

తొలిసారి ఫ్యామిలీని పరిచయం చేసిన మృణాల్​ - మ్యాజిక్ అంటూ ఎమోషనల్​! - Mrunal Thakur Family

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 4, 2024, 12:35 PM IST

Family Star Movie Mrunal Thakur : తొలిసారి తన ఫ్యామిలీ మెంబర్స్​ను పరిచయం చేసింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్​. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్​లో భాగంగా వారితో కలిసి ఓ ఈవెంట్​లో పాల్గొంది.

తొలిసారి ఫ్యామిలీని పరిచయం చేసిన మృణాల్​ - మ్యాజిక్ అంటూ ఎమోషనల్​!
తొలిసారి ఫ్యామిలీని పరిచయం చేసిన మృణాల్​ - మ్యాజిక్ అంటూ ఎమోషనల్​!

Family Star Movie Mrunal Thakur : అటు బాలీవుడ్​లో ఇటు టాలీవుడ్​లో వరుస అవకాశాలతో కెరీర్​లో దూసుకెళ్తున్న హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌. తాను ఎంపిక చేసుకున్న పాత్రల్లో ఒదిగిపోయి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా సీతగా ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. ఈమె గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ట్రెండింగ్ అవుతూనే ఉంటుంది. అంతలా అభిమానులను ఆకట్టుకుందీమే.

ప్రస్తుతం ఈమె తెలుగులో చేసిన రెండు చిత్రాలు సీతారామం, హాయ్ నాన్న సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు మరో రోజులో ఫ్యామిలీ స్టార్​గా విజయ్​ దేవరకొండతో కలిసి రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్​ జోరుగా సాగుతున్నాయి. దీని కోసం ఆమె వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె తన ఫ్యామిలీ మెంబర్స్​ను పరిచయం చేసింది. తొలిసారి వాళ్లను తనతో పాటు ఫ్యామిలీ స్టార్​ ఈవెంట్​కు తీసుకొచ్చింది. అలా వీళ్లను తీసుకురావడం ఎంతో సంతోషంగా, మ్యాజిక్​గా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన సోదరి, అమ్మానాన్నలతో కలిసి దిగిన ఫొటోలను పంచుకుంది. వారి ప్రేమ తనలో కొత్త ఉత్సాహాన్ని కలిగించినట్లు చెప్పుకొచ్చింది. అలానే తన కొత్త ఫొటోషూట్​ను కూడా పోస్ట్ చేసింది.

Mrunal Thakur Upcoming Movies : కాగా, మృణాల్ ఠాకూర్​ మహారాష్ట్రకు చెందిన అమ్మాయి. సీరియల్స్​తో కెరీర్​ ప్రారంభించింది. 2014లో హలో నందన్‌ (మరాఠీ)తో హీరోయిన్‌గా మారింది. లవ్‌ సోనియాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సీతారామంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇందులో సీతామహాలక్ష్మి, ప్రిన్సెస్‌ నూర్జహాన్‌గా నటించి తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. హాయ్‌ నాన్నలో యష్న, వర్షగా అలరించింది. ఇక విజయ్‌ దేవరకొండ ఫ్యామిలీ స్టార్​లో విజయ్ భార్యగా కనిపించి మెప్పించేందుకు రెడీ అయింది. దీనికి పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్​ను అందుకుంటుందో. ఇకపోతే హిందీలో పూజా మేరీ జాన్‌ అనే సినిమాలో నటిస్తోంది మృణాల్.

వావ్ రెడ్​ డ్రెస్​లో శ్రీలీల గ్లామర్ ట్రీట్ - మత్తుకళ్లతో మతిపోగొడుతూ - Sreeleela Photoshoot

బ్యాక్​ టు బ్యాక్​ 8 హిట్​ సీక్వెల్స్‌తో రానున్న స్టార్ హీరో! - Ajay Devgn Upcoming Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.