ETV Bharat / entertainment

విజయ్ అలా రష్మిక ఇలా ! - టాలీవుడ్ ​టు బాలీవుడ్​ సినీ తారల హోలీ సంబరాలు చూశారా ? - Cinema Stars Holi Celebration

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 7:45 PM IST

Updated : Mar 25, 2024, 10:10 PM IST

Cinema Stars Holi Celebration : హోలీ పండుగను పురస్కరించుకుని టాలీవుడ్​ టు బాలీవుడ్ సెలబ్రిటీలు సంబరాలు చేసుకున్నారు. ఆ ఫొటోలను తమ ఫ్యాన్స్ కోసం నెట్టింట షేర్ చేసుకున్నారు. వాటిని మీరూ ఓ లుక్కేయండి.

Cinema Stars Holi Celebration
Cinema Stars Holi Celebration

Cinema Stars Holi Celebration : హోలీ అంటేనే ఇక వీధంతా రంగులమయం అయిపోతుంది. చిన్నపెద్ద తేడా లేకుండా అందరూ ఈ సంబరాల్లో లీనమైపోతుంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు తమ సన్నిహితులతో సెలబ్రేషన్స్​ చేసుకుంటుంటారు. కొందరేమో రంగులు పూసుకుంటే మరికొందరేమో గుడ్లు, టమాటలతో విన్నూత్నంగా చేసుకుంటుంటారు. ఈ పండుగ అటు నార్త్​ నుంచి ఇటు సౌత్ వరకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు కూడా ఈ సంబరాల్లో మునిగితేలారు.ఆ విశేషాలు మీ కోసం.

షూటింగ్ సెట్​లో రష్మిక - సాంగ్ రిలీజ్​ ఈవెంట్​లో రౌడీ హీరో
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న హోలీ సందర్భంగా ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పోస్ట్ చేశారు. "ఈసారి హోలీ మనందరికీ పని ఉంది. అయితే మీరందరూ సురక్షితంగా హోలీ ఆడుతూ ఆనందిస్తున్నారని ఆశిస్తున్నాను. ఇక్కడి నుండి మీకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతున్నాన" అంటూ తన మూవీ టీమ్​తో తీసుకున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఫ్యామిలీ స్టార్ మూవీ టీమ్​తో హోలీ ఆడారు. ఈ మూవీలో నుంచి ఓ కొత్త సాంగ్​ను విడుదల చేసిన ఈవెంట్​లో విజయ్, మృణాల్​ సందడి చేశారు.

ఇక టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్టార్స్ వరకు ఎవరెవరు హోలీ జరుపుకున్నారంటే :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్​ తన ఫ్యాన్స్ కోసం సింపుల్​గా విష్​ చేశారు. సమంత తన ఫర్రీ ఫ్రెండ్స్​తో సంబరాలు చేసుకున్నారు. హ్యాష్​తో పాటు హోలీ ఆడుతున్న ఫొటోను సామ్ ఇన్​స్టాలో షేర్ చేశారు. రామ్​ చరణ్ కూడా సుకుమార్​తో పాటు సెలబ్రేషన్స్​లో పాల్గొన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

మరోవైపు బీటౌన్​లోనూ ఈ పండుగ సందడి అంతా ఇంతా కాదు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, స్వరా భాస్కర్, సిద్ధార్థ్​ కియారా జంట, నయా కపుల్ పుల్​కిత్ సామ్రాట్, కృతి కర్బందా రకుల్ జాకీ భగ్నానీ, దిశాపటానీ అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్​ ప్రీతీ జింటా కూడా ఎంతో గ్రాండ్​గా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు.

హోలీ స్పెషల్​ - ఈ ఎనర్జిటిక్​ సాంగ్స్​కు మీరు స్టెప్పులేశారా ? - Holi Special Songs In Telugu Movies

జాలీ జాలీగా సినీ తారల హోలీ..

Last Updated :Mar 25, 2024, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.