ETV Bharat / entertainment

బంపర్​ ఆఫర్​ - రూ.150 కే 'భ్రమయుగం' టికెట్‌ - మల్టీప్లెక్స్‌లో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 6:47 PM IST

Updated : Feb 21, 2024, 7:00 PM IST

Bramayugam Ticket Price : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన 'భ్రమయుగం' మూవీ మాలీవుడ్​లో సక్స్​స్​ఫుల్​గా దూసుకెళ్తోంది. అయితే మార్చి 23న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే ?

Bramayugam Ticket Price
Bramayugam Ticket Price

Bramayugam Ticket Price : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి లీడ్​ రోల్​లో తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'భ్రమయుగం'. బ్లాక్ అండ్ వైట్​లో సరికొత్త ఎక్స్​పెరిమెంట్​గా తెరకెక్కిన ఈ మూవీ మాలీవుడ్​లో సూపర్​ హిట్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. అయితే ఈ చిత్రం మార్చి 23వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ మూవీని ఇక్కడ విడుదల చేస్తోంది.

ఈ క్రమంలో టికెట్‌ ధరల గురించి తాజాగా కీలక అప్​డేట్​ ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.150గా నిర్ణయించినట్లు తెలిపింది. ఇక ఎంపిక చేసిన మల్టీప్లెక్స్‌లలో ఈ టికెట్‌లను రూ.200లకు కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపింది. దీంతో తెలుగు ఆడియెన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా మాలీవుడ్​లో ఇప్పటివరకూ దాదాపు రూ.30 కోట్లకు మేర వసూళ్లు సాధించింది దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ రాహుల్ సదాశివన్‌ ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

" మమ్ముట్టి ఓ లెజెండరీ స్టార్ . ఒకవేళ ఆయన ఈ చిత్రంలో కుడుమోన్‌ పొట్టి పాత్రకు ఓకే చెప్పకుంటే, అసలు నేను ఈ సినిమానే తీసేవాడిని కాదు. ఆయన సెట్‌లో అడుగుపెట్టగానే కొద్దిసేపు అంతా నిశ్శబ్దంగా అనిపించింది. మమ్ముట్టి తేజస్సు అలాంటిది. కానీ, మరికాసేపటికే ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సెట్‌ అంతా సందడిగా మారేలా చేసేవారు ఆయన. కొన్నిసార్లు మేము తీస్తున్నది హారర్‌ మూవీనా? లేక కామెడీ చిత్రమా అన్నట్లు అనిపించేది. పీరియాడిక్‌ ఫిల్మ్‌ కావడం వల్ల ఈ సినిమాలో పాత్రల మధ్య వచ్చే డైలాగ్స్​, వాడే పదాల్లో అంత ఆధునికత కనిపించదు. అందుకే సినిమా చూస్తున్న ఆడియెన్స్​కు ఆ ఇబ్బంది కలగకుండా ఇదులోని స్టార్స్​ వాటిని మరింత ఇంప్రవైజ్ చేశారు. ఇక ఈ విషయంలో మమ్ముట్టి గురించి చెప్పాల్సింది ఏముంది. ఆయన తన పాత్రకు తగినట్లుగా మారిపోయేవారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకునేవారు" అంటూ మూవీ గురించి చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టితో పాటు మలయాళ నటుడు అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ లాంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తెలుగు ఆడియెన్స్ - ఈ రెండు మలయాళ చిత్రాల గురించే చర్చంతా!

మలయాళ మెగాస్టార్​ కొత్త ఎక్స్​పరిమెంట్​ - ఆ సినిమాను అలా చూపిస్తారట!

Last Updated : Feb 21, 2024, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.