ETV Bharat / entertainment

ఆ స్టార్​ హీరోనే నా స్ఫూర్తి - సమంత

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 5, 2024, 2:16 PM IST

ఆ స్టార్​ హీరోనే నా స్ఫూర్తి - సమంత
ఆ స్టార్​ హీరోనే నా స్ఫూర్తి - సమంత

Alluarjun samantha : నటనలో తనకు ఎవరు స్ఫూర్తో చెప్పింది స్టార్ హీరోయిన్ సమంత. ఓ స్టార్ హీరోపై ప్రశంసలు కురిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.

Alluarjun samantha : హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకం చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు క్యూట్​ అండ్​ లవ్లీ యాక్టింగ్​తో ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తన బోల్డ్​ రోల్స్​తో ఆడియెన్స్​లో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఏమాయ చేశావే చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈమె సినిమా సినిమాకు నటనలో వైవిధ్యం చూపిస్తూ కెరీర్​లో ముందుకెళ్లింది. బృందావనం, దూకుడు, ఈగ, అత్తారింటికి దారేది, మనం వంటి చిత్రాలతో స్టార్ కమర్షియల్​ హీరోయిన్​గా మారిపోయింది.

తన హవా కాస్త తగ్గుతున్న నేపథ్యంలో ఓ బేబీ, యూటర్న్​, యశోద, శాకుంతలం వంటి లేడీ ఓరియెంటెండ్​ చిత్రాల్లో నటించి మళ్లీ తన స్టార్​ స్టేటస్​ను నిలబెట్టుకుంది. పుష్ప చిత్రంలో ఊ అంటావా మావ సాంగ్​తో దేశవ్యాప్తంగా బోల్డ్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఈమెకు నటనలో ఎవరు స్ఫూర్తో మీకు తెలుసా? ఆ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

ఓ కాలేజీ ఫంక్షన్‌లో పాల్గొన్న సమంతను కొందరు విద్యార్థులు "నటనలో మీకు స్ఫూర్తి ఎవరు?" అని ప్రశ్నించగా - దీనికి ఆమె సమాధానం చెబుతూ "యాక్టింగ్‌లో నాకు అల్లు అర్జునే స్ఫూర్తి. తనతో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నా. ఎందుకంటే యాక్టింగ్‌ బీస్ట్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు" అని చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియోను బన్నీ ఫ్యాన్స్ నెట్టింట్లో తెగ షేర్‌ చేస్తున్నారు. గతంలోనూ ఓ సందర్భంలో అల్లు అర్జున్​పై సమంత ప్రశంసలు కురిపించింది. అల్లు అర్జున్ తన సూపర్‌ హీరో అని చెప్పింది.

కాగా, అల్లు అర్జున్ - సమంత కలిసి సన్ ఆఫ్‌ సత్యమూర్తి చిత్రంతో కలిసి నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలానే సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన పుష్పలో అల్లు అర్జున్‌, సమంత కలిసి ఊ అంటావా సాంగ్​తో అంతర్థాతీయ స్థాయిలో ఆడియెన్స్​ను ఉర్రూతలూగించారు. ఈ సాంగ్​కు కోట్లలో వ్యూస్‌ వచ్చాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలోకి ​12th Fail తెలుగు వెర్షన్​ - జీవితంలో ఎదగాలంటే ఈ మూవీ డోంట్ మిస్​!

'షూటింగ్​లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తా' - బాలయ్య NBK109 భామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.