ETV Bharat / entertainment

'నాటు నాటు' బీటౌన్ వెర్షన్​ - ఆ సాంగ్​కు హుక్​ స్టెప్​ వేసిన అక్షయ్​, టైగర్​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 5:19 PM IST

Updated : Feb 28, 2024, 7:20 PM IST

Akshay Kumar Naatu Naatu: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్​ కుమార్​, టైగర్​ ష్రాఫ్​ లీడ్​ రోల్స్​లో నటించిన లేటెస్ట్ మూవీ 'బడేమియా చోటేమియా'. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్​ ఓ సూపర్​ సాంగ్​ను విడుదల చేశారు. అందులోని హుక్ స్టెప్​ గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి.

Akshay Kumar Naatu Naatu
Akshay Kumar Naatu Naatu

Akshay Kumar Naatu Naatu : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్​ కుమార్ ఇటీవలే ఓ మై గాడ్ 2 సినిమాతో భారీ సక్సెస్​ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే ఆయన మరో భారీ ప్రాజెక్ట్​కు సైన్ చేశారు.'బడే మియా, చోటే మియా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్​తో పాటు బీటౌన్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్​ కూడా కనిపించారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్​, గ్లింప్స్​తో ఈ సినిమా అభిమానుల్లో భారీ అంచనాలే పెంచేసింది.

ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమా నుంచి ఓ సూపర్​ సాంగ్​ను మేకర్స్ విడుదల చేశారు. 'మస్త మలంగ్​ ఝూమ్​' అంటూ సాగే ఆ సాంగ్​ ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అక్షయ్​, టైగర్​, సోనాక్షి సిన్హా ఈ సాంగ్​కు ఎనర్జిటిక్ స్టెప్పులేసి అలరించారు. అయితే ఇందులో ఓ స్టెప్​ మాత్రం ఇప్పుడు ఆడియెన్స్ దృష్టిలో పడింది. సాంగ్​ మధ్యలో హుక్ స్టెప్​ వేస్తారు అక్షయ్​, టైగర్​. అది చూసేందుకు అచ్చం 'ఆర్​ఆర్​ఆర్​'లోని నాటు నాటు స్టెప్​ను పోలి ఉందంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే ఇది నాటు నాటు కాపీ అంటు నెట్టింట మీమ్స్ వేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Bade Miyan Chote Miyan 2024 Cast : ఇక ఈ సినిమా విషయానికి వస్తే - అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏప్రిల్ 9న గ్రాండ్​గా విడుదల కానుంది. ఇందులో అక్షయ్, టైగర్​, సలార్​ 'ఫేమ్' మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

వీరితో పాటు మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా, అలయా ఎఫ్​, రోనిత్ బోస్ రాయ్, సునీల్ శెట్టిలు కూడా ఇంపార్టెంట్ రోల్స్​లో కనిపించనున్నారు. విశాల్ మిశ్రా, జులియస్ పాకియమ్ ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని అందించారు. జాకీ భగ్నానీ, వషు భగ్నానీ, దీప్‍శిఖ దేశ్‍ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్, సునీల్ శెట్టి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.

Indias Most Successful Actor : ప్రభాస్​, షారుక్​, రజనీ కాదు.. ఇండియాలో మోస్ట్ స‌క్సెస్​ఫుల్ యాక్ట‌ర్ ఆయనే!

అవును టైగర్​ష్రాఫ్​తో అది జరగడం నిజమే!: రష్మిక

Last Updated :Feb 28, 2024, 7:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.